MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas: ఈ చిన్న సినిమాను తెగ పొగిడేసిన ప్రభాస్, మరొక నాలుగు సార్లు చూస్తానని కామెంట్

Prabhas: ఈ చిన్న సినిమాను తెగ పొగిడేసిన ప్రభాస్, మరొక నాలుగు సార్లు చూస్తానని కామెంట్

Prabhas:  ప్రభాస్‌కి నచ్చిన సినిమా అంటే అభిమానులు చూడకుండా ఎలా ఉంటారు? అందుకే ప్రభాస్ ఆ చిన్న సినిమాకు సపోర్టుగా నిలబడ్డాడు. కపుల్ ఫ్రెండ్లీ సినిమా కోసం తన రేంజ్‌లో ప్రమోషన్ ఇస్తున్నాడు. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ప్రస్తుతం థియేటర్లో ఉంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 20 2026, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చిన్న సినిమాకు ప్రభాస్ సాయం
Image Credit : UVcreations/Instagram

చిన్న సినిమాకు ప్రభాస్ సాయం

బాహుబలి ప్రభాస్‌కు పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఉన్నారు. ప్రభాస్‌కి ఒక సినిమా నచ్చిందంటే అతను అభిమానులకు నచ్చకుండా ఎలా ఉంటుంది? అందుకే ప్రభాస్ తనకు నచ్చిన ఒక సినిమా గురించి ప్రమోషన్ చేస్తున్నారు. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఇది ప్రస్తుతం థియేటర్లలో ఉంది. మొదట్లో సినిమా బాగుందంటూ టాక్ వచ్చింది. ముఖ్యంగా వాలెంటైన్స్ డే కు సైలెంట్ గా విడుదలైంది ఈ సినిమా. వీకెండ్ వచ్చేసరికి థియేటర్లకు ప్రేక్షకులకు రావడమే మానేశారు. సినిమా బాగుంది, కథ బాగుంది, రివ్యూలు పాజిటివ్గా వచ్చాయి... కానీ ప్రేక్షకులకు మాత్రం సినిమాకు రావట్లేదు. అందుకే ప్రభాస్ రంగంలోకి దిగి తన వంతు సాయం చేయడం మొదలుపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రంగంలోకి దిగిన ప్రభాస్
Image Credit : UVcreations/Instagram

రంగంలోకి దిగిన ప్రభాస్

యువి క్రియేషన్స్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు ప్రభాస్ మొదటి నుంచి మద్దతుగానే ఉన్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ సినిమా కోసం మొదటిసారిగా రియాక్ట్ అయ్యారు. అప్పుడే ఆ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలైంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేశారు. ఇదే ఇంటర్వ్యూ ను ముందే చేసి ఉంటే ఓపెనింగ్స్ పెరిగేవేమో.. అయినా కూడా బిజీగా ఉండే ప్రభాస్ ఈ చిన్న సినిమా కోసం ఇంత సమయం కేటాయించడం గ్రేట్ అని అభిమానులు ముచ్చట పడిపోతున్నారు.

34
మరో నాలుగు సార్లు సినిమా చూస్తా
Image Credit : UVcreations/Instagram

మరో నాలుగు సార్లు సినిమా చూస్తా

ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు. అలాంటి వ్యక్తి తాను ఇప్పటికే కపుల్ ఫ్రెండ్లీ చూశానని, ఆ సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పారు. అంతేకాదు మరో నాలుగు సార్లు చూడడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా అన్నారు. లివింగ్ రిలేషన్ షిప్ అనే వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ప్రభాస్ తనకు ఆ సినిమాలో హీరోగా చేసిన సంతోష శోభన్ నటన చాలా నచ్చిందని చెప్పారు. హీరోయిన్ మానస వారణాసి కూడా యాక్టింగ్ తో మెప్పించిందని, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చిందని మెచ్చుకున్నారు. సంతోష్ శోభన్ క్యారెక్టర్ ను చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారని, అందుకే ఆ క్యారెక్టర్ మనతో బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు.

44
బ్యూటీఫుల్ లవ్ స్టోరీ
Image Credit : UVcreations/Instagram

బ్యూటీఫుల్ లవ్ స్టోరీ

హీరో హీరోయిన్లు ఇద్దరు చక్కగా నటించారని.. వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ కూడా తనకు ఎంతో నచ్చుతుందని చెప్పారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ టీంకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడంతో ఇక ప్రేక్షకులు కూడా థియేటర్ బాట పడతారని ఆశిస్తున్నారు. ఆ సినిమా నిర్మాతలు ప్రభాస్ ఇచ్చిన హైప్ ఆ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Annayya Movie: చిరంజీవికి చెప్పి హీరోయిన్లని మార్చుకున్న యంగ్ హీరోలు..బాబోయ్ వాళ్ళు మాకు వద్దు అంటూ కంప్లైంట్
Recommended image2
Suma Kanakala: రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ చేస్తే.. సుమ కనకాల రియాక్షన్ ఏంటి? క్లారిటీ ఇచ్చిన రాజీవ్!
Recommended image3
Hanuman Ansh Telugu Collections: హనుమాన్‌ అంశ్‌ తెలుగులో డల్‌ కలెక్షన్లు.. టోటల్‌గా ఎంత రాబట్టిందంటే?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన పురుషులు రిచ్ డాడ్స్.. తమ పిల్లలకు కోట్ల విలువైన ఆస్తిని ఇస్తారు
Recommended image2
Ram Charan: మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో? రామ్ చరణ్ సపోర్టుతో ఆ సినిమా సీక్వెల్‌లో?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved