- Home
- National
- Sankranti Gift 2026 : రేషన్ కార్డు ఉంటేచాలు .. ఈ సంక్రాంతికి ఫ్రీగా చీర, రూ.3,000 క్యాష్
Sankranti Gift 2026 : రేషన్ కార్డు ఉంటేచాలు .. ఈ సంక్రాంతికి ఫ్రీగా చీర, రూ.3,000 క్యాష్
Sankranti Gift : సంక్రాంతి పండక్కి తమిళనాడు ప్రజలకు అక్కడి ప్రభుత్వం కానుకలు ప్రకటించింది. నగదుతో పాటు కొత్తబట్టలు, సరుకులు అందిస్తోంది. ఇలా ఏమేమి ఇస్తుందో తెలుసా?

పొంగల్ కానుక
Sankranti Gift : సంక్రాంతి పండక్కి రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 'చంద్రన్న కానుక' పేరిట గతంలొ టిడిపి సర్కార్ ఉచితంగా సరుకులు అందించిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణలో కూడా గత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండక్కి రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి చీరలు పంపిణీ చేసింది. ఇలా పండగల వేళ పేద ప్రజలు ఆనందంగా గడిపేందుకు తెలుగు ప్రభుత్వాలు బహుమతులు ఇచ్చే సంస్కృతిని తీసుకువచ్చాయి... ఇప్పుడు దీన్ని పొరుగు రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి.
తమిళనాడులో పొంగల్ కానుకగా రూ.3000 పంపిణీ
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడులో కూడా సంక్రాంతి పండగను 'పొంగల్' పేరిట ఘనంగా జరుపుకుంటారు. దీంతో ఆ రాష్ట్ర ప్రజలకు స్టాలిన్ ప్రభుత్వం పొంగల్ కానుకను ప్రకటించింది... స్వయంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరుపేద ప్రజలు పండగను ఆనందంగా జరుపుకునేలా ఖర్చుల కోసం డబ్బులు, కొత్త బట్టలు అందిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే 'పొంగల్ కానుక' పంపిణీ ప్రారంభమయ్యింది.
ఈ పొంగల్ కానుక కింద రేషన్ కార్డు కలిగివుండే ప్రతి కుటుంబానికి 3000 రూపాయలు అందిస్తుంది ప్రభుత్వం. అలాగే కొత్తబట్టలు (దోతి, చీర)... అలాగే కిలో బియ్యం, కిలో చక్కెర, ఓ చెరకు గడను ప్రజలకు అందిస్తోంది. ఇలా పొంగల్ ను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకునే ఏర్పాటుచేసింది ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ప్రభుత్వం.
వీరికి కూడా పొంగల్ గిప్ట్...
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, అంతర్యుద్ద పరిస్థితుల నేపథ్యంలో అక్కడ స్థిరపడిన తమిళులు చాలామంది కుటుంబాన్ని తీసుకుని భారత్ కు వలసవచ్చారు. ఇలా ప్రస్తుతం తమిళనాడులో వేలాదిమంది శ్రీలంక తమిళ శరణార్థులు ఉన్నారు... వీరికి కూడా పొంగల్ కానుక అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది... అంటే వీరికి కూడా రూ.3 వేలు, ఇతర కానుకలు లభించనున్నాయి. మానవత్వంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది.
2 కోట్ల మందికిపైగా బెనిఫిట్
తమిళనాడు దాదాపు 2.22 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి... వీళ్లందరికీ పొంగల్ కానుక అందనుంది. అలాగే శ్రీలంక తమిళ శరణార్థి కుటుంబాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీళ్ళందరికీ రూ.3,000 నగదుతో పాటు కొత్తబట్టలు, నిత్యావసర సరుకులు అందించడానికి డిఎంకే ప్రభుత్వం రూ.6936 కోట్ల నిధులు కేటాయించింది.
పండగవేళ గందరగోళం ఉండుకుండా ముందుగానే లబ్ధిదారులకు టోకెన్లు అందించారు. ఇందులో పొంగల్ కానుక ఎప్పుడు అందుకోవాలో సూచించారు. నిర్ణీత సమయంలో లబ్ధిదారులు రేషన్ షాపుకు వెళ్లి తమ పండగ కానుకను అందుకోవాల్సి ఉంటుంది. ఈ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.
ఎన్నికల కోసమే పొంగల్ కానుకలా..?
ఈ ఏడాది (2026) తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి... అందుకోసమే డిఎంకే పొంగల్ కానుకల పేరిట అధికారికంగానే తాయిలాలు అందిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. పేదలకు పొంగల్ కానుక ఇవ్వండి మంచిదే, చాలాకాలంగా ఇది కొనసాగుతోంది... కానీ ఇప్పుడు నగదు పెంచడం మాత్రం ఎన్నికల జిమ్మిక్కేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్, మెడికల్, అగ్రికల్చర్ డిగ్రీలు చేసే విద్యార్థులకు మొదటి విడతగా దాదాపు 10 లక్షల ల్యాప్ టాప్ లు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది... ఇందుకోసం భారీగా నిధులు కేటాయించారు. అయితే ఈ ల్యాప్ టాప్ ల పంపిణీ కూడా ఎన్నికల కోసమేనని.. అందుకే ఓటుహక్కు కలిగిన విద్యార్థులకు వీటిని అందిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

