MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • RBI Rules : మీరు GPay, PhonePe వాడుతున్నారా..? ఇకపై ఇది తప్పనిసరి

RBI Rules : మీరు GPay, PhonePe వాడుతున్నారా..? ఇకపై ఇది తప్పనిసరి

డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది.  కేవలం OTPతో జరిగే లావాదేవీలకు ఇకపై అదనపు భద్రత ఉండనుంది… ఎలాగో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 01 2026, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డిజిటల్ చెల్లింపులపై న్యూ రూల్స్..
Image Credit : Gemini AI

డిజిటల్ చెల్లింపులపై న్యూ రూల్స్..

RBI New Rules : ఇవాళ్టి (ఏప్రిల్ 1, 2026) నుంచి ఆన్‌లైన్ లావాదేవీలు చేసే విధానం పూర్తిగా మారబోతోంది. డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)ను తప్పనిసరి చేసింది. అంటే ఇప్పటివరకు కేవలం వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)తో చేసే లావాదేవీలకు ఇప్పుడు అదనపు సెక్యూరిటీ లేయర్ యాడ్ అవుతోంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
RBI రూల్స్ ఏంటి..?
Image Credit : gemini

RBI రూల్స్ ఏంటి..?

ఇకపై ప్రతి డిజిటల్ లావాదేవీకి కనీసం రెండు రకాల వెరిఫికేషన్స్ అవసరం. కేవలం మెసేజ్‌లో వచ్చిన OTP ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయడం కుదరదు. ప్రతి లావాదేవీకి ఈ మూడు పద్ధతుల్లో ఏవైనా రెండింటిని ఉపయోగించాలి. 

1. పిన్, పాస్‌వర్డ్ లేదా సీక్రెట్ పాస్‌ఫ్రేజ్.

2. OTP లేదా హార్డ్‌వేర్ టోకెన్. 

3. వేలిముద్ర, ఫేస్ స్కాన్ లేదా ఐరిస్ స్కాన్.

 ఈ నిబంధనలు దేశీయ లావాదేవీలకే కాకుండా అంతర్జాతీయ లావాదేవీలకు కూడా వర్తిస్తాయి. అయితే అంతర్జాతీయ కార్డు లావాదేవీలకు పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అక్టోబర్ 2026 వరకు గడువు ఇచ్చారు. ఆన్‌లైన్ మోసాలను తగ్గించడం, డిజిటల్ లావాదేవీలపై ప్రజల నమ్మకాన్ని పెంచడమే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం.

34
కేవలం OTP లపై నమ్మకం ఎందుకు తగ్గింది?
Image Credit : X

కేవలం OTP లపై నమ్మకం ఎందుకు తగ్గింది?

ఇటీవల 'ఫిషింగ్', 'సిమ్ స్వాప్' వంటి మోసాలు బాగా పెరిగాయి. ఈ మోసాల్లో సైబర్ నేరగాళ్లు కస్టమర్ల OTPలను సులభంగా దొంగిలిస్తున్నారు. సిమ్ క్లోనింగ్ ద్వారా మీ ఫోన్‌కు వచ్చే OTPలను హ్యాకర్లు యాక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు బయోమెట్రిక్స్ లేదా డివైజ్ పిన్‌తో పాటు OTPని కూడా తప్పనిసరి చేయడంతో, హ్యాకర్లు మోసం చేయడం దాదాపు అసాధ్యం అవుతుంది.

44
ఏప్రిల్ 1 నుంచి మీ చెల్లింపులపై ప్రభావం ఎలా ఉంటుంది?
Image Credit : Getty

ఏప్రిల్ 1 నుంచి మీ చెల్లింపులపై ప్రభావం ఎలా ఉంటుంది?

ఏప్రిల్ 1, 2026 నుంచి మీరు UPI, క్రెడిట్/డెబిట్ కార్డులు లేదా వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు ఈ మార్పులను గమనిస్తారు.

1. కాస్త అదనపు సమయం : రెండు వెరిఫికేషన్ స్టెప్స్ ఉంటాయి కాబట్టి పేమెంట్ పూర్తి కావడానికి కొన్ని సెకన్లు ఎక్కువ సమయం పట్టొచ్చు.

2. మెరుగైన భద్రత : మీరు రెగ్యులర్‌గా వాడే డివైజ్ నుంచి చిన్న మొత్తంలో పేమెంట్స్ చేస్తే, ప్రాసెస్ సింపుల్‌గా ఉంటుంది. కానీ కొత్త డివైజ్‌లు లేదా పెద్ద లావాదేవీలను సిస్టమ్ మరింత నిశితంగా పరిశీలిస్తుంది. 

3. జవాబుదారీతనం : బ్యాంకులు, పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లకు ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి. ఒకవేళ సిస్టమ్ వైఫల్యం వల్ల మోసం జరిగితే బ్యాంకు కస్టమర్‌కు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పర్సనల్ పైనాన్స్
భారత దేశం
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
RBI Repo Rate Cut: మీకు లోన్ ఉందా, అయితే గుడ్ న్యూస్‌.. ఏ లోన్ పై ఎంత ఈఎమ్ఐ త‌గ్గుతుందో తెలుసా.?
Recommended image2
Indian Economy: వామ్మో..డబ్బు తయారీకే ఇంత ఖర్చా, RBI షాకింగ్ లెక్కలు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved