MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Raghav Chadha Net Worth : భార్య పరిణితికే రూ.74 కోట్ల ఆస్తి.. మరి రాఘవ్ చద్దాకో..?

Raghav Chadha Net Worth : భార్య పరిణితికే రూ.74 కోట్ల ఆస్తి.. మరి రాఘవ్ చద్దాకో..?

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని వీడి బీజేపీ (BJP)లో చేరిపోయారు ఎంపీ రాఘవ్ చద్దా. దీంతో ప్రస్తుతం అతడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఈ క్రమంలో అతడి ఆస్తుల వివరాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 24 2026, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాఘవ్ చద్దా పరిణితి చోప్రా.. ఇద్దర్లో ఎవరు రిచ్
Image Credit : Instagram/Parineeti Chopra

రాఘవ్ చద్దా-పరిణితి చోప్రా.. ఇద్దర్లో ఎవరు రిచ్

రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, ఆయన భార్య పరిణితి చోప్రా ఆస్తులను పోల్చి చూస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. భర్త కంటే భార్య దగ్గరే భారీగా ఆస్తులున్నాయి. 

పెళ్లికి ముందు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పరిణితి మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.74 కోట్లు. ఆమెకు ముంబైలోని బాంద్రాలో రూ.22 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు, ఆడి-రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే  రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రాఘవ్ చద్దా మొత్తం చరాస్తుల విలువ సుమారు రూ.37 లక్షలు మాత్రమే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాఘవ్ చద్దా ఆస్తులివే..
Image Credit : X

రాఘవ్ చద్దా ఆస్తులివే..

ఒకప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ (CA)గా పనిచేసిన రాఘవ్ చద్దా చాలా పక్కాగా పెట్టుబడులు పెట్టారు. ఆయన వద్ద సుమారు రూ.30,000 నగదు, యాక్సిస్ బ్యాంకులో రూ.14.57 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. షేర్ మార్కెట్లో దాదాపు రూ.6.35 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఆయన వద్ద 90 గ్రాముల బంగారం ఉంది… దీని విలువ సుమారు రూ.4.95 లక్షలు. ఈయన పేరుతో 2019 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ఉంది… దాని విలువ రూ.1.32 లక్షలుగా చూపించారు.

35
రాఘవ్ చద్దాకు సొంత ఇల్లు లేదా..?
Image Credit : Getty

రాఘవ్ చద్దాకు సొంత ఇల్లు లేదా..?

అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రాఘవ్ చద్దా పేరుమీద సొంతంగా ఇల్లు, కమర్షియల్ బిల్డింగులుగానీ, ఎలాంటి భూమి (స్థిరాస్తి) లేదు. ఆయన ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో లేదా ప్రభుత్వ అధికారిక నివాసంలో ఉంటున్నారు. 

45
రాఘవ్ చద్దా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్..
Image Credit : X

రాఘవ్ చద్దా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్..

రాఘవ్ చద్దా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీ.కామ్ పూర్తి చేశారు. 2011లో చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పట్టా పొందారు. ఆ తర్వాత 'డెలాయిట్' (Deloitte) వంటి పెద్ద విదేశీ కంపెనీలలో పనిచేశారు. 2012లో కేజ్రీవాల్ బృందంలో చేరారు.. అప్పటి నుంచి 'ఆప్'లో కీలక నేతగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరాలనే నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

55
రాఘవ్ బాటలోనే మరికొందరు ఎంపీలు..
Image Credit : X

రాఘవ్ బాటలోనే మరికొందరు ఎంపీలు..

రాఘవ్ చద్దాతో పాటు 'ఆప్'కు చెందిన మరో 7 మంది ఎంపీలు కూడా బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. వీరిలో అశోక్ మిట్టల్ వంటి పెద్ద పేర్లు కూడా ఉన్నాయి. ఇటీవలే అశోక్ మిట్టల్ ఇంటిపై ఈడీ దాడులు జరిగాయి. 2027 పంజాబ్ ఎన్నికలకు ముందు రాఘవ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంలో చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
రాజకీయాలు
భారత దేశం
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
Recommended image2
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Recommended image3
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్
Related Stories
Recommended image1
Raghav Chadha: పదవి పోయింది.. నోరు మూయించారు.. రాఘవ్ చద్దా ఏం చేశారు? ఆప్ కక్షగట్టిందా?
Recommended image2
Now Playing
పార్లమెంట్లో రాఘవ్ చద్దా అదిరిపోయే స్పీచ్ | Raghav Chadha Raises Big Question | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved