సెప్టెంబర్ 10న యూఏఈతో భారత్ తన ఆసియా కప్ 2025 ప్రారంభిస్తుంది. 2023లో టైటిల్‌ను గెలుచుకున్న మెన్ ఇన్ బ్లూ టోర్నమెంట్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది.
Image credits: Getty
Telugu
ఆసియా కప్ 2025 - భారత జట్టు
ఆగస్టు చివరలో ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ టీమ్ ఆరుగురు ఆటగాళ్లు ఉండటానికి అర్హులు. వారిలో..
Image credits: Getty
Telugu
1. సాయి సుదర్శన్
సాయి సుదర్శన్ ఐపీఎల్ 2025లో అద్భుతమైన బ్యాటింగ్ తో 15 మ్యాచ్‌లలో 759 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ ఆసియా కప్ జట్టులో ఉండటానికి అర్హుడు.
Image credits: Getty
Telugu
2. శ్రేయాస్ అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణించాడు. కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. కూల్, మిడిల్ ఆర్డర్‌లో స్థిరమైన ఇన్నింగ్స్‌లు ఆడగలడు.
Image credits: Getty
Telugu
3. ప్రభ్‌సిమ్రాన్ సింగ్
జాతీయ జట్టులోకి రావాల్సిన మరో ఆటగాడు ప్రభ్‌సిమ్రాన్ సింగ్. గత ఐపీఎల్ సీజన్‌లో అతను అద్భుతమైన బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. 17 మ్యాచ్‌లలో 549 పరుగులు చేశాడు.
Image credits: Getty
Telugu
4. కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ 2022 నుండి టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు, కానీ ఐపీఎల్ 2025లో అతని ఇటీవలి ఫామ్, టాపార్డ్ లో నిలకడగా స్కోర్ చేయడం, ఆసియా కప్ జట్టులో చేర్చడానికి బలమైన పోటీదారుగా మారాడు.
Image credits: Getty
Telugu
5. ఖలీల్ అహ్మద్
జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ ఆడే అవకాశం లేనందున, ఐపీఎల్ 2025లో అతని ప్రదర్శన దృష్ట్యా, ఖలీల్ అహ్మద్‌ను ఫ్రంట్‌లైన్ పేసర్‌లలో ఒకరిగా జట్టులో చేర్చవచ్చు.
Image credits: Getty
Telugu
6. ప్రసిద్ధ్ కృష్ణ
ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోవాల్సిన మరో ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణ. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరపున 25 వికెట్లు పడగొట్టాడు.