MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • Petrol Price : పెట్రోల్ ధరలు తగ్గుతాయా..? చమురు రంగంలో కేంద్రం కీలక మార్పులు

Petrol Price : పెట్రోల్ ధరలు తగ్గుతాయా..? చమురు రంగంలో కేంద్రం కీలక మార్పులు

Petrol Price : పెట్రోల్ కొరతకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా పెట్రోల్, డీజిల్ మనకు అందుబాటులో ఉండేలా, వీటి ధరలపై ఎఫెక్ట్ పడకుండా ఉండేలా ముందడుగు వేస్తోంది.

2 Min read
Author : Arun Kumar P
Published : May 12 2026, 05:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెట్రోల్, డీజిల్ పై కేంద్రం కీలక నిర్ణయం...
Image Credit : ANI

పెట్రోల్, డీజిల్ పై కేంద్రం కీలక నిర్ణయం...

Petrol Price : ఎక్కడో మిడిల్ ఈస్ట్ లోని ఇరాన్ పై దాడులు జరిగితే ఇండియన్స్ ఇబ్బందిపడటం ఏమిటి..? దాడులకు పాల్పడ్డ అమెరికా, ఇజ్రాయెల్ లకు ప్రాబ్లం లేదు... మరి మనకే ఎందుకు ఇంతలా ఎల్పిజి గ్యాస్, పెట్రోల్ కొరత వేధిస్తోంది..? అంటే మనం దిగుమతులపై ఆధారపడటమే కారణం. మనం ఎక్కువగా ముడి చమురును గల్ఫ్ దేశాల నుండే దిగుమతి చేసుకుంటాం... అందుకే 'స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్' మూతపడగానే అల్లాడిపోయాం. అయితే భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి రాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది... ఇందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెట్రోల్ కొరత రాకుండా ఇండియా సూపర్ ప్లాన్...
Image Credit : stockPhoto

పెట్రోల్ కొరత రాకుండా ఇండియా సూపర్ ప్లాన్...

చమురు, సహజవాయువుల కోసం విదేశాలపై ఆధారపడకుండా దేశీయంగానే ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇందుకోసమే చమురు ఉత్పత్తిపై రాయల్టీ రేట్లను భారీగా తగ్గించింది. ముఖ్యంగా డీప్ వాటర్, అల్ట్రా-డీప్ వాటర్ క్షేత్రాల్లో ఈ మార్పులు చేసింది. దీనివల్ల పెట్టుబడులు పెరిగి, దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

35
చమురు రంగంలో భారీ మార్పులు...
Image Credit : X

చమురు రంగంలో భారీ మార్పులు...

భారత పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ మే 8న దీనిపై అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. రాయల్టీ రేట్లు తగ్గడంతో గ్లోబల్, దేశీయ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సముద్ర గర్భం నుంచి తీసే ముడి చమురుపై రాయల్టీని 16.66% నుంచి 10%కి తగ్గించారు.

ఈ మార్పులు సవాల్‌తో కూడిన, భారీ పెట్టుబడులు అవసరమయ్యే చమురు, గ్యాస్ క్షేత్రాల్లో పనిచేసే కంపెనీల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం లక్ష్యం.

45
దేశీయంగానే ముడిచమురు ఉత్పత్తి..
Image Credit : X

దేశీయంగానే ముడిచమురు ఉత్పత్తి..

భూభాగంపై తీసే ముడి చమురుపై రాయల్టీని కూడా 9.09% నుంచి 8%కి… సహజవాయువుపై 10% నుంచి 8%కి తగ్గించారు. ఇందుకోసం ప్రభుత్వం 'వెల్-హెడ్ ప్రైస్' లెక్కించేందుకు కొత్త 'ఫ్లాట్ డిడక్షన్ ఫార్ములా'ను తీసుకొచ్చింది. ఈ ఫార్ములా ప్రకారమే రాయల్టీ రేట్లను తగ్గించారు.

55
LPG ఉత్పత్తిపైనా కీలక నిర్ణయం..
Image Credit : Freepik

LPG ఉత్పత్తిపైనా కీలక నిర్ణయం..

ఇక సహజ వాయువు ఉత్పత్తిపై ఎఫెక్టివ్ రాయల్టీ రేటును 8%గా నిర్ణయించారు. ఇక DSF (డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్స్), HELP (హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ) బ్లాక్‌ల నుంచి తీసే సహజవాయువు ఉత్పత్తిపై కూడా రాయితీ వర్తింపజేశారు. ఈ బ్లాక్‌లలో మొదటి ఏడేళ్లపాటు రాయల్టీ సున్నాగా ఉంటుంది. ఆ తర్వాత వరుసగా 5%, 2%కి పెరుగుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Now Playing
Free Services at Petrol Pumps: మీకు తెలుసా? పెట్రోల్ బంక్‌లో ఈ సేవలు ఉచితం| Asianet News Telugu
Recommended image2
Petrol Price : నిజంగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved