అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ప్రతినెలా రూ.30,000 కోట్ల నష్టాలు వస్తుండటంతో.. ధరల పెంపు తప్పదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
Image credits: ANI
Telugu
భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర
యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 126 డాలర్లకు పెరిగింది. అయినా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మార్చవద్దని చమురు కంపెనీలను ఆదేశించింది.
Image credits: ANI
Telugu
ఎన్నికలు ముగియడంతోనే పెంపు నిర్ణయం..?
ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల వల్లే ఇన్నాళ్లూ ధరలు పెంచలేదని, ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం ధరల పెంపునకు సిద్ధమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Image credits: stockPhoto
Telugu
మోదీ మాటలతో అనుమానాలు...
అయితే ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై అధికారిక ప్రకటన ఏమీ లేదు. కానీ ఇటీవల ప్రధాని మోదీ ఇంధనం పొదుపుగా వాడాలి అనేలా కామెంట్స్ చేశారు. ఇదే అనుమానాలకు తావిస్తోంది.