- Home
- National
- Pahalgam Terror Attack: చేతిలో ఏకే47తో.. బయటకు వచ్చిన జమ్ముకశ్మీర్ కాల్పుల ఉగ్రవాది ఫొటో.
Pahalgam Terror Attack: చేతిలో ఏకే47తో.. బయటకు వచ్చిన జమ్ముకశ్మీర్ కాల్పుల ఉగ్రవాది ఫొటో.
జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో జరిగిన కాల్పలపై యావత్ దేశం ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉగ్రదాడికి సంబంధించి అధికారులు కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఎప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మొదలు హోం మంత్రి అతిత్‌షా వరకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడులో ఏకంగా 27 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్ఐఏ రంగంలోకి దిగింది. రెండు బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాడుల తర్వాత అడవిలోకి పారిపోయిన ఉగ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు.
Pahalgam terror attack
విచారణలో భాగంగా కొన్ని విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకరి ఫోటో బయటపడింది. అతని చేతిలో AK-47 కనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో అనుబంధంగా ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడిందని తెలుస్తోంది. ఈ దాడిని ప్రపంచం నలుమూలల నుండి ఖండిస్తున్నారు. ఈ దాడి తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఉగ్రవాది పరుగులు పెడుతున్నట్లు ఇందులో కనిపిస్తోంది. టూరిస్టుల ఫోన్‌లలో ఈ ఫొటో క్యాప్చర్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ దాడిలో 8 నుంచి 10 మంది పాల్గొన్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. వీరిలో 5 నుంచి 7గురు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. కాల్పుల తర్వాత అక్కడే ఉన్న అడవిలోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.