MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • National
  • India's First Hydrogen Train: డీజిల్, కరెంట్ లేకుండా నీటి ఆవిరితో నడిచే సరికొత్త ట్రైన్ ఇది !

India's First Hydrogen Train: డీజిల్, కరెంట్ లేకుండా నీటి ఆవిరితో నడిచే సరికొత్త ట్రైన్ ఇది !

India First Hydrogen Train: భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును పీఎం మోదీ ప్రారంభించనున్నారు. కాలుష్యం లేకుండా కేవలం నీటి ఆవిరిని మాత్రమే వదిలే ఈ సరికొత్త రైలు విశేషాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 17 2026, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నీటి ఆవిరితో పరిగెత్తే ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వచ్చేసింది!
Image Credit : Gemini

నీటి ఆవిరితో పరిగెత్తే ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వచ్చేసింది!

భారతీయ రైల్వే హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ ఛేంజ్ రాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ రైలు పట్టాలెక్కడానికి రెడీ అయిపోయింది. ఈ సరికొత్త రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జింద్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. 

ఈ స్టార్టప్‌తో ప్రపంచంలోనే హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న కొన్ని స్పెషల్ కంట్రీస్ లిస్ట్‌లో భారత్ కూడా చేరిపోనుంది. ఈ రైలు ప్రత్యేకత ఏంటంటే.. దీనికి డీజిల్ అవసరం లేదు, అలాగని పైన కరెంట్ వైర్లు కూడా అక్కర్లేదు. కేవలం హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తూ, కాలుష్యానికి బదులుగా కేవలం నీటి ఆవిరి, స్వల్ప వేడిని మాత్రమే బయటకు వదులుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎలా పనిచేస్తుంది? అసలు ఈ టెక్నాలజీ ఏంటి?
Image Credit : Asianet News

ఎలా పనిచేస్తుంది? అసలు ఈ టెక్నాలజీ ఏంటి?

ఇప్పటివరకు మనం చూసిన ఎలక్ట్రిక్ రైళ్లు పైన ఉండే ఓవర్‌హెడ్ కరెంట్ లైన్ల నుంచి పవర్ తీసుకుంటాయి. కానీ ఈ హైడ్రోజన్ ట్రైన్ రూటే వేరు. దీని లోపలే పవర్ జనరేట్ అవుతుంది. రైలులోని ఫ్యూల్ సెల్స్ లోపల హైడ్రోజన్, వాతావరణంలోని ఆక్సిజన్ మధ్య కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. 

ఈ ప్రాసెస్ ద్వారా డైరెక్ట్‌గా ఎలక్ట్రిసిటీ తయారై, రైలు మోటార్లను నడిపిస్తుంది. ఇది ఒక రకంగా పాతకాలపు స్టీమ్ ఇంజన్ లాంటిదే అయినా, బొగ్గు లేదా డీజిల్ లాంటివి కాల్చకుండా ప్యూర్ గ్రీన్ ఎనర్జీతో నడుస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో మల్టీలేయర్డ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను పెట్టారు. ఇది హైడ్రోజన్ లీకేజ్, మంటలు, పొగను ఈజీగా పసిగట్టేస్తుంది.

Related Articles

Related image1
Penguin Huddling: గడ్డకట్టే చలిలో వేల పెంగ్విన్లు అలా ఎందుకు నిల్చుంటాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Related image2
South Kashmir of Andhra: దక్షిణ కాశ్మీరం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.. పాపికొండలు ఎందుకు అంత స్పెషల్?
35
రూట్, స్పీడ్, సీట్ల కెపాసిటీ వివరాలు ఇవే
Image Credit : stockPhoto

రూట్, స్పీడ్, సీట్ల కెపాసిటీ వివరాలు ఇవే

ఈ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ రైలు (ట్రైన్ నెంబర్ 74010) రెగ్యులర్ సర్వీస్‌లో భాగంగా జింద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 7.40 గంటలకు బయలుదేరి, 9.40 గంటలకు సోనిపట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (ట్రైన్ నెంబర్ 74009) సోనిపట్ నుంచి ఉదయం 10.40 గంటలకు స్టార్ట్ అయి, మధ్యాహ్నం 1.00 గంటలకు జింద్ చేరుకుంటుంది. ఈ 89 కిలోమీటర్ల జర్నీలో జింద్ సిటీ, పాండు పిండారా, లలిత్ ఖేరా, భంబేవా, ఇషాపూర్ ఖేరి, బుటానా, ఖాండ్రాయ్, గోహనా, రాత్రా, లాత్, మోహనా హర్యానా, బర్వాస్ని అనే 12 స్టేషన్లలో రైలు ఆగుతుంది.

రోజుకు రెండు రౌండ్ ట్రిప్‌లతో మొత్తం 356 కిమీ దూరం ప్రయాణిస్తుంది. ఈ 10 కోచ్‌ల రైలులో 682 సీట్లు ఉండగా, మొత్తం 2,600 మంది ప్యాసింజర్లు ట్రావెల్ చేయవచ్చు. ట్రయల్స్‌లో 120 కిమీ స్పీడ్ అందుకున్నప్పటికీ, రెగ్యులర్ సర్వీస్‌లో మాత్రం గరిష్ఠంగా గంటకు 75 కిమీ స్పీడ్‌తో నడుస్తుంది.

45
మేడ్ ఇన్ ఇండియా.. మన సొంత టెక్నాలజీ
Image Credit : ChatGPT

మేడ్ ఇన్ ఇండియా.. మన సొంత టెక్నాలజీ

పూర్తిగా ఇండియాలోనే డిజైన్, ఇంజనీరింగ్ చేసి, మన దేశీయ సాంకేతికతతో ఈ రైలును తయారు చేశారు. జింద్ స్టేషన్‌లో ఈ ప్రాజెక్ట్ మెయిన్ కాంట్రాక్టర్లయిన మేథ, గ్రీన్-H2B2 కంపెనీలు హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ రైలును, ఎలక్ట్రోలైజర్‌ను అందించగా.. ఫ్లూయిట్రాన్ కంపెనీ హైడ్రోజన్ రీఫ్యూలింగ్ స్టేషన్‌ను తయారు చేసింది.

జింద్‌లోని ఈ ప్లాంట్‌కు పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) పర్మిషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ తయారయ్యే హైడ్రోజన్‌ను ఫ్లూయిట్రాన్ రీఫ్యూలింగ్ సిస్టమ్ ద్వారా ఇంజన్‌లోకి ఎక్కిస్తారు. భవిష్యత్తులో డార్జిలింగ్, కాల్కా-శిమ్లా, నీలగిరి లాంటి హెరిటేజ్ రూట్లలో కూడా ఇలాంటి సిస్టమ్స్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

55
రూ. 14,700 కోట్ల డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు
Image Credit : X-@Indianinfoguide

రూ. 14,700 కోట్ల డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు

పీఎం మోదీ జింద్ పర్యటనలో కేవలం రైలు మాత్రమే కాకుండా, ఏకలవ్య స్టేడియం నుంచి దాదాపు రూ. 14,700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో రూ. 12,470 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా 157.92 కిమీ పొడవైన ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే ను లాంచ్ చేయనున్నారు. దీనివల్ల ఢిల్లీ నుంచి కత్రా జర్నీ టైమ్ 14 గంటల నుంచి 6 గంటలకు, ఢిల్లీ-అమృత్‌సర్ జర్నీ 8 గంటల నుంచి 4 గంటలకు తగ్గిపోతుంది.

అలాగే అంబాలా-కాలా అంబ్ హైవే, జింద్-గోహనా గ్రీన్‌ఫీల్డ్ హైవేలను కూడా ఓపెన్ చేస్తారు. కురుక్షేత్రలో ఎలివేటెడ్ రైల్వే ట్రాక్‌ను, భివానీలోని పండిట్ నేకి రామ్ శర్మ మెడికల్ కాలేజీని, నార్నాల్‌లోని మహర్షి చ్యవన్ మెడికల్ కాలేజీని జాతికి అంకితం చేయడంతో పాటు కురుక్షేత్రలో సిక్కు మ్యూజియంకు కూడా పునాది రాయి వేయనున్నారు. ఆ తర్వాత మోదీ చండీగఢ్, పంజాబ్‌లోని జలంధర్‌లలో పర్యటించి మరికొన్ని వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Recommended image2
Now Playing
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu
Recommended image3
Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
Related Stories
Recommended image1
Penguin Huddling: గడ్డకట్టే చలిలో వేల పెంగ్విన్లు అలా ఎందుకు నిల్చుంటాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
South Kashmir of Andhra: దక్షిణ కాశ్మీరం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.. పాపికొండలు ఎందుకు అంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved