MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • దేశంలో మొదటి బుల్లెట్ రైలు ఏ రూట్లో తెలుసా?

దేశంలో మొదటి బుల్లెట్ రైలు ఏ రూట్లో తెలుసా?

India's first Bullet Train: ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో గుజరాత్‌లో 300 కిలో మీటర్ల వైడక్ట్ నిర్మాణం పూర్తయిందని NHSRCL వెల్లడించింది. 

2 Min read
Mahesh Rajamoni
Published : May 21 2025, 12:59 AM IST| Updated : May 21 2025, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు
Image Credit : ANI

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు

India's first Bullet Train: భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు అయిన ముంబయి నుంచి అహ్మదాబాద్ వరకు నిర్మిస్తున్నారు. ఈ హై-స్పీడ్ రైలు మార్గంలో 300 కిలోమీటర్ల వైడక్ట్ నిర్మాణం పూర్తయిందని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) మంగళవారం ప్రకటించింది. ఈ నిర్మాణ పురోగతిని సూచిస్తూ, గుజరాత్‌లోని సూరత్ సమీపంలో 40 మీటర్ల పొడవైన ఫుల్-స్పాన్ బాక్స్ గిర్డర్‌కు సంబంధించిన వీడియోలను పంచుకుంది.

300 km viaduct completed.
— Bullet Train Project pic.twitter.com/dPP25lU2Gy

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 20, 2025

25
 India's first Bullet Train: 353 కిలోమీటర్లు గుజరాత్ రాష్ట్రంలోనే
Image Credit : @IndianTechGuide

India's first Bullet Train: 353 కిలోమీటర్లు గుజరాత్ రాష్ట్రంలోనే

ఈ ప్రాజెక్టు మొత్తం 508 కిలోమీటర్లదైనా, అందులో 353 కిలోమీటర్లు గుజరాత్ రాష్ట్రంలోనే ఉంది. పూర్తి అయిన 300 కిలోమీటర్ల వైడక్ట్‌లో 257.4 కిమీ ను Full Span Launching Method (FSLM) ద్వారా నిర్మించగా, 37.8 కిమీ ను Span by Span (SBS) ద్వారా నిర్మించారు. దీనితో పాటు రివర్ వంతెనలు, 0.9 కిమీ స్టీల్ బ్రిడ్జులు (7 వంతెనల్లో 10 స్పాన్లు), 1.2 కిమీ ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ బ్రిడ్జులు, 2.7 కిమీ స్టేషన్ బిల్డింగ్‌లలో నిర్మాణం పూర్తయింది.

ఈ నిర్మాణానికి 6,455 FSLM స్పాన్లు, 925 SBS స్పాన్లు (ప్రతి స్పాన్ 40 మీటర్లు) వినియోగించారు. ఇప్పటివరకు 383 కిమీ పియర్ వర్క్, 401 కిమీ ఫౌండేషన్ వర్క్, 326 కిమీ గిర్డర్ కాస్టింగ్ పూర్తయింది.

Related Articles

Related image1
Covid-19: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. కారణమేంటి?
Related image2
Telangana: దేశంలో తెలంగాణకు టాప్ ప్లేస్
35
 India's first Bullet Train: మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు
Image Credit : Google

India's first Bullet Train: మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు

ప్రాజెక్ట్ నిర్మాణంలో దేశీయంగా రూపకల్పన చేసి తయారుచేసిన స్ట్రాడల్ క్యారియర్లు, లాంచింగ్ గాంట్రీలు, బ్రిడ్జ్ గాంట్రీలు, గిర్డర్ ట్రాన్స్పోర్టర్లు వాడటం “మేక్ ఇన్ ఇండియా” లక్ష్యాన్ని సూచిస్తుంది. ప్రతి ఫుల్-స్పాన్ బాక్స్ గిర్డర్ బరువు 970 మెట్రిక్ టన్నులు కాగా, కొన్ని చోట్ల మాత్రమే సెగ్మెంటల్ గిర్డర్లను ఉపయోగించారు.

మొత్తం 27 ప్రత్యేక కాస్టింగ్ యార్డులు నిర్మాణానికి ఏర్పాటుచేశారు. స్టీల్ బ్రిడ్జులు దేశవ్యాప్తంగా 7 వర్క్‌షాప్‌లలో తయారు అయ్యాయి. గుజరాత్‌లో మూడు, మిగతా నాలుగు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో ఉన్నాయి.

45
శబ్ధ కాలుష్య నివారణ కొరకు 3 లక్షల noise barriers
Image Credit : Google

శబ్ధ కాలుష్య నివారణ కొరకు 3 లక్షల noise barriers

ఆపరేషన్ సమయంలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు 3 లక్షల noise barriers ను వైడక్ట్‌ల వెంట ఏర్పాటు చేశారు. గుజరాత్‌లో ఇప్పటివరకు 157 కిమీ ఆర్సీ ట్రాక్ బెడ్ నిర్మాణం పూర్తైంది. ప్రాజెక్ట్‌లో భాగంగా బుల్లెట్ రైలు స్టేషన్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి రైలు, రోడ్డు ఆధారిత రవాణా వ్యవస్థలతో అనుసంధానమవుతాయి. ప్రయాణికుల కోసం ఆధునిక సదుపాయాలు కల్పించనున్నారు. రోలింగ్ స్టాక్ డిపోలు మహారాష్ట్ర, గుజరాత్‌లలో అభివృద్ధి చెందుతున్నాయి.

55
India's first Bullet Train: ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.1.08 లక్షల కోట్లు
Image Credit : Google

India's first Bullet Train: ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.1.08 లక్షల కోట్లు

ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లు, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు తల తలగా రూ.5,000 కోట్లు చెల్లిస్తాయి. మిగిలిన మొత్తం జపాన్ ప్రభుత్వం 0.1 శాతం వడ్డీతో రుణంగా అందిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved