MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపి, 15 ముక్కలు చేసింది.. సినిమా ట్విస్టులను తలదన్నే రియల్‌ స్టోరీ.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపి, 15 ముక్కలు చేసింది.. సినిమా ట్విస్టులను తలదన్నే రియల్‌ స్టోరీ.

ఇంటిలో వ్యతిరేకించినా ఆమె చేయి పట్టుకున్నాడు. ఏడు జన్మల పాటు కలిసి ఉంటానని ప్రమాణం చేస్తూ నుదుటిన సింధూరం దిద్దాడు. కానీ ఆ పనే ఆయన మరణానికి కారణమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే శత్రువుగా మారింది. మెర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ ది.  

2 Min read
Author : Narender Vaitla
| Updated : Mar 20 2025, 06:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Meerut Murder Case

Meerut Murder Case

ఇంటిలో వ్యతిరేకించినా ఆమె చేయి పట్టుకున్నాడు. ఏడు జన్మల పాటు కలిసి ఉంటానని ప్రమాణం చేస్తూ నుదుటిన సింధూరం దిద్దాడు. కానీ ఆ పనే ఆయన మరణానికి కారణమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే శత్రువుగా మారింది. మెర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ ది. 

వివరాల్లోకి వెళితే.. మార్చి 3, 2025న సౌరభ్ రాజ్‌పుత్‌ను దారుణంగా హత్య చేశారు. అతని శరీరాన్ని 15 ముక్కలు చేసి ఒక డ్రమ్ములో వేసి, పైన సిమెంట్ కాంక్రీటుతో నింపారు. ఇంత దారుణంగా హత్య చేసింది అతని భార్య ముస్కాన్. ఈ దుర్మార్గంలో ఆమెకు సహాయం చేసింది ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా. ఇద్దరూ ఇప్పుడు కటకటాల వెనుక ఉన్నారు, తమ నేరాన్ని అంగీకరించారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22

సౌరభ్ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు: 

బ్రహ్మపురి ప్రాంతానికి చెందిన సౌరభ్ రాజ్‌పుత్ 2016లో ముస్కాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల వారు హాజరు కాలేదు. 2019లో ముస్కాన్ ఒక పాపకు జన్మనిచ్చింది. ఇందిరా నగర్‌లో ఇద్దరూ నివసించారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో ముస్కాన్‌ జీవితంలోకి సాహిల్ శుక్ అనే వ్యక్తి వచ్చాడు. ఇద్దరూ 8వ తరగతిలో కలిసి చదువుకున్నారు. సాహిల్ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ముస్కాన్‌ను కలిసిన తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది, ఆ తర్వాత ముస్కాన్ కూడా డ్రగ్స్‌కు బానిసైంది.

విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సౌరభ్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు?

సాహిల్, ముస్కాన్‌ల మధ్య సంబంధం గురించి సౌరభ్‌కు తెలిసింది. 2021లో అతను విడాకుల కోసం పిటిషన్ కూడా దాఖలు చేశాడు. కానీ చిన్న పాప ఉండటంతో కుటుంబ సభ్యులు అతనికి నచ్చజెప్పారు. దీంతో అతను విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత సౌరభ్‌ మళ్లీ మెర్చంట్ నేవీ ఉద్యోగంలో చేరాడు. విధిలో భాగంగా సౌరభ్‌ లండన్ వెళ్ళాడు. భర్త లండన్ వెళ్లడంతో ముస్కాన్, సాహిల్ మరింత దగ్గరయ్యారు. 

అత్యంత దారుణంగా హత్య: 

సౌరభ్ పాస్‌పోర్ట్ గడువు ముగియనుండటంతో దానిని పునరుద్ధరించుకోవడానికి ఫిబ్రవరి 24న భారతదేశానికి వచ్చాడు. భర్త వస్తున్నాడని తెలుసుకున్న ముస్కన్‌ భర్తను లేకుండా చేద్దామని కుట్ర పన్నింది. ఇద్దరూ ముందుగా మత్తు మందులు కొన్నారు, ఒక కత్తి కూడా తీసుకున్నారు. మార్చి 3 రాత్రి ముస్కాన్ సౌరభ్ ఆహారంలో మత్తు మందులు కలిపింది. అతను స్పృహ కోల్పోయిన తర్వాత సాహిల్ అతన్ని పట్టుకున్నాడు, ముస్కాన్ కత్తితో అనేకసార్లు పొడిచింది. అతను చనిపోయిన తర్వాత ఇద్దరూ సౌరబ్‌ శరీరాన్ని ముక్కలు చేసి డ్రమ్ములో నింపి సిమెంటుతో పూడ్చారు.

ముస్కాన్ ఎలా దారికింది.? 

శవాన్ని దాచిన తర్వాత ముస్కాన్ తన కూతురిని తల్లి దగ్గర వదిలి సాహిల్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లింది. మార్చి 17న తిరిగి వచ్చిన తర్వాత 6 సంవత్సరాల కూతురు నాన్న గురించి అడిగినప్పుడు ముస్కాన్ ఒక పథకం ప్రకారం సౌరభ్ హత్య నేరాన్ని అత్తమామలపై వేసింది. ఆ తర్వాత సౌరభ్ బంధువులు ముస్కాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో ముస్కాన్ తన నేరాన్ని అంగీకరిస్తూ శవాన్ని ఎక్కడ దాచిందో చెప్పింది. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved