MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • కన్నెపొర చిరిగినంత మాత్రాన ఆమెదే తప్పు అంటే ఎలా.? హైకోర్టు సంచలన తీర్పు

కన్నెపొర చిరిగినంత మాత్రాన ఆమెదే తప్పు అంటే ఎలా.? హైకోర్టు సంచలన తీర్పు

Law: అత్యాచార కేసుల విచారణలో బాధితురాలి హెల్త్ రిపోర్ట్ ఆధారంగా తీసుకుని ఆమె వాంగ్మూలాన్ని తిరస్కరించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. హైమెన్ (క‌న్నెపొర‌) చిరిగిపోయి ఉందనే ఒక్క కారణంతో బాధితురాలి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం సరికాదని పేర్కొంది.

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 28 2026, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
44 ఏళ్ల నాటి అత్యాచార కేసులో తీర్పు
Image Credit : Gemini AI

44 ఏళ్ల నాటి అత్యాచార కేసులో తీర్పు

ఈ కేసు 1982లో ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించినది. పొలానికి వెళ్లిన 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు నమోదయ్యాయి. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెపై దాడి కూడా చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు 1983లో ఇద్దరు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం వారిలో ఒకరు హైకోర్టును ఆశ్రయిస్తూ అప్పీల్ దాఖలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హెల్త్ రిపోర్ట్ ఆధారంగా నిందితుడి వాదన
Image Credit : AI-image

హెల్త్ రిపోర్ట్ ఆధారంగా నిందితుడి వాదన

అప్పీల్ విచారణలో నిందితుడి తరఫు న్యాయవాది హెల్త్ రిపోర్ట్ ను ప్రస్తావించారు. బాధితురాలి హైమెన్ ఇప్పటికే చిరిగిపోయి ఉందని, అందువల్ల ఆమె చెప్పిన వాంగ్మూలంపై సందేహం వ్యక్తం చేయాలని కోర్టును కోరారు. ఈ అంశాన్ని ఆధారంగా తీసుకుని నిందితుడికి అనుమాన ప్రయోజనం కల్పించాలని వాదించారు.

Related Articles

Related image1
Used Car: దేశంలో ఎక్కువ మంది కొంటున్న సెకండ్ హ్యాండ్ కారు ఏంటో తెలుసా.?
Related image2
Car: ఈవీ లేదా సీఎన్‌జీ.. ఈ రెండింటిలో ఏ కారు కొనుగోలు చేస్తే లాభమో తెలుసా.?
34
హైమెన్ చిరగడానికి అనేక కారణాలు ఉంటాయి: కోర్టు
Image Credit : Asianet News

హైమెన్ చిరగడానికి అనేక కారణాలు ఉంటాయి: కోర్టు

ఈ వాదనను తిరస్కరించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైమెన్ చిరగడం అంటే తప్పనిసరిగా లైంగిక సంబంధం జరిగినట్టే అని భావించడం శాస్త్రీయంగా సరైనది కాదని పేర్కొంది. క్రీడలు ఆడటం, సైక్లింగ్ చేయడం, జిమ్నాస్టిక్స్, గుర్రపు స్వారీ, కఠినమైన శారీరక శ్రమ లేదా ప్రమాదవశాత్తూ గాయపడటం వంటి అనేక కారణాలతో కూడా హైమెన్ చిరిగే అవకాశం ఉంటుందని కోర్టు వివరించింది. కొంతమంది మహిళల్లో పుట్టుకతోనే హైమెన్ లేకపోవచ్చు లేదా అది ఎక్కువగా సాగిపోయే స్వభావం కలిగి ఉండవచ్చని కూడా గుర్తు చేసింది. అత్యాచారం వంటి ఘటనలు ఎక్కువగా ఏకాంత ప్రదేశాల్లో జరుగుతాయని, అందువల్ల ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం సహజమేనని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలి వాంగ్మూలం విశ్వసనీయంగా ఉన్నప్పుడు కేవలం హెల్త్ రిపోర్ట్ ఆధారంగా దానిని తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది.

44
బెయిల్ రద్దు.. 10 రోజుల్లో లొంగిపోవాలని ఆదేశం
Image Credit : X

బెయిల్ రద్దు.. 10 రోజుల్లో లొంగిపోవాలని ఆదేశం

ఈ కేసులో అప్పీల్‌ను కొట్టివేసిన హైకోర్టు, ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను యథాతథంగా కొనసాగించింది. ఇప్పటివరకు బెయిల్‌పై ఉన్న నిందితుడి బెయిల్‌ను కూడా రద్దు చేసింది. మిగిలిన శిక్షను అనుభవించేందుకు 10 రోజుల్లోగా ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని నిందితుడిని ఆదేశించింది. కోర్టు తన తీర్పులో మరో కీలక అంశాన్ని ప్రస్తావించింది. అత్యాచారం అనేది చట్టపరమైన నిర్వచనం కలిగిన నేరం. అది కేవలం వైద్య పరీక్షల ఆధారంగా మాత్రమే నిర్ధారించే విషయం కాదని, అందువల్ల బాధితురాలి విశ్వసనీయ వాంగ్మూలానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
న్యాయ స‌ల‌హాలు
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చెన్నైలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం విజయ్ | CM Vijay Inaugurates National Pulse Polio
Recommended image2
Now Playing
Ketan Agarwal murder case: కేతన్ మ*ర్డర్ మిస్టరీ.. విగ్ వివాదం నిజమేనా? | Asianet News Telugu
Recommended image3
Now Playing
పోలియో చుక్కలు వేసి బొమ్మను బహుమతిగా ఇచ్చిన సీఎం విజయ్ | CM Vijay launches TN pulse polio campaign
Related Stories
Recommended image1
Used Car: దేశంలో ఎక్కువ మంది కొంటున్న సెకండ్ హ్యాండ్ కారు ఏంటో తెలుసా.?
Recommended image2
Car: ఈవీ లేదా సీఎన్‌జీ.. ఈ రెండింటిలో ఏ కారు కొనుగోలు చేస్తే లాభమో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved