MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • Car: ఈవీ లేదా సీఎన్‌జీ.. ఈ రెండింటిలో ఏ కారు కొనుగోలు చేస్తే లాభమో తెలుసా.?

Car: ఈవీ లేదా సీఎన్‌జీ.. ఈ రెండింటిలో ఏ కారు కొనుగోలు చేస్తే లాభమో తెలుసా.?

Car: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కారు కొనాలనుకునే చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) లేదా సీఎన్‌జీ (CNG) కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే దీర్ఘకాలంలో ఏది ఎక్కువ లాభం ఇస్తుంది? నిర్వహణ ఖర్చు ఏదిలో తక్కువ? 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 26 2026, 08:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంధన ఖర్చులో ఈవీదే పైచేయి
Image Credit : Gemini AI

ఇంధన ఖర్చులో ఈవీదే పైచేయి

కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో సీఎన్‌జీ కారుతో పోలిస్తే ఎలక్ట్రిక్ కారు ధర సాధారణంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఎక్కువగా ఉంటుంది. కానీ దీర్ఘకాల వినియోగంలో పరిస్థితి మారుతుంది. ఒక వ్యక్తి ఏడాదికి సుమారు 15,000 కిలోమీటర్లు ప్రయాణిస్తే, 15 ఏళ్లలో మొత్తం 2,25,000 కిలోమీటర్లు ప్రయాణించినట్లవుతుంది.

ఇంట్లోనే ఈవీని ఛార్జ్ చేస్తే సగటున కిలోమీటరుకు రూ.1.5 వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన 15 ఏళ్లలో మొత్తం విద్యుత్ ఖర్చు సుమారు రూ.3.37 లక్షలు మాత్రమే అవుతుంది. అదే సీఎన్‌జీ కారుకు కిలోమీటరుకు సుమారు రూ.4 ఖర్చు వస్తే, 15 ఏళ్లలో దాదాపు రూ.9 లక్షలు ఇంధనానికే వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ఇంధన వ్యయంలో మాత్రమే ఈవీ ద్వారా సుమారు రూ.5.5 లక్షల వరకు ఆదా చేసే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నిర్వహణ ఖర్చులో కూడా ఎలక్ట్రిక్ కారే ముందంజ
Image Credit : stockPhoto

నిర్వహణ ఖర్చులో కూడా ఎలక్ట్రిక్ కారే ముందంజ

ఇంధన ఖర్చుతో పాటు వాహన నిర్వహణ కూడా ముఖ్యమైన అంశమే. సీఎన్‌జీ కారులో ఇంజిన్, గేర్‌బాక్స్, క్లచ్ వంటి అనేక యాంత్రిక భాగాలు ఉంటాయి. అందువల్ల ఇంజిన్ ఆయిల్ మార్చడం, ఫిల్టర్లు మార్చడం, సీఎన్‌జీ కిట్ తనిఖీలు చేయించడం వంటి పనులకు తరచూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ కారులో మాత్రం సంప్రదాయ ఇంజిన్ ఉండదు. ప్రధానంగా బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే ఉంటాయి. దీంతో ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన అవసరం ఉండదు. నిర్వహణ ఖర్చు కూడా సీఎన్‌జీ కారుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.

Related Articles

Related image1
Tech: ఛార్జర్‌లా కనిపించే హిడెన్ కెమెరా.. 1080P వీడియో, మోషన్ డిటెక్షన్‌తో పాటు మరెన్నో ఫీచర్లు
Related image2
Alcohol: మందుబాబుల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. ఖాళీ సీసాలు ఇస్తే డ‌బ్బులిస్తారు, ఒక్కో బాటిల్‌కు ఎంతంటే.?
35
బ్యాటరీ ఖర్చు.. ఈవీకి ఉన్న ప్రధాన సవాలు
Image Credit : Google

బ్యాటరీ ఖర్చు.. ఈవీకి ఉన్న ప్రధాన సవాలు

అన్ని అంశాల్లో ఈవీకి ప్రయోజనాలు ఉన్నప్పటికీ, బ్యాటరీ ఖర్చు మాత్రం ప్రధానమైన అంశంగా పరిగణించాలి. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలకు 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. ఒకవేళ వాహనాన్ని 15 సంవత్సరాలు ఉపయోగించాలని భావిస్తే, జీవితకాలంలో కనీసం ఒకసారి బ్యాటరీ మార్చాల్సిన అవసరం రావచ్చు. ప్రస్తుతం బ్యాటరీ మార్పిడి ఖర్చు సుమారు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాల ప్రణాళికలో ఈ ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

45
రీ-సేల్ విలువలో సీఎన్‌జీ కార్లకు ఆధిక్యం
Image Credit : Gemini AI

రీ-సేల్ విలువలో సీఎన్‌జీ కార్లకు ఆధిక్యం

వాహనాన్ని కొన్నేళ్ల తర్వాత విక్రయించాలనుకునే వారికి రీ-సేల్ విలువ కూడా కీలకం. ప్రస్తుతం పాత సీఎన్‌జీ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మంచి ధరకు విక్రయించే అవకాశం ఉంటుంది. అయితే పాత ఎలక్ట్రిక్ కారు విలువ ఎక్కువగా బ్యాటరీ పరిస్థితిపైనే ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ పనితీరు బాగుంటే మంచి ధర రావచ్చు. లేకపోతే రీ-సేల్ విలువ తగ్గే అవకాశం ఉంటుంది.

55
దీర్ఘకాలంలో ఏది మంచి ఎంపిక?
Image Credit : google

దీర్ఘకాలంలో ఏది మంచి ఎంపిక?

రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారు, ఇంధనంతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఎలక్ట్రిక్ కారు మంచి ఎంపికగా మారవచ్చు. అయితే ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉండటంతో పాటు భవిష్యత్తులో బ్యాటరీ మార్పిడి ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరోవైపు తక్కువ పెట్టుబడితో కారు కొనాలనుకునే వారు, రీ-సేల్ విలువకు ప్రాధాన్యం ఇచ్చేవారు సీఎన్‌జీ కారును ఎంచుకోవచ్చు. కాబట్టి మీ ప్రయాణ అవసరాలు, బడ్జెట్, వినియోగ కాలాన్ని పరిశీలించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Car: పెట్రోల్ కారులో డీజిల్ కొట్టిస్తే ఏం జ‌రుగుతుంది.? వెంట‌నే ఏం చేయాలి.?
Recommended image2
Maruti Suzuki: మారుతి సుజుకి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్.. కార్లపై రూ. 2.15 లక్షల దాకా డిస్కౌంట్
Recommended image3
Cheapest Tesla EV India: ఇండియాలోకి టెస్లా చీపెస్ట్ ఈవీ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లు!
Related Stories
Recommended image1
Tech: ఛార్జర్‌లా కనిపించే హిడెన్ కెమెరా.. 1080P వీడియో, మోషన్ డిటెక్షన్‌తో పాటు మరెన్నో ఫీచర్లు
Recommended image2
Alcohol: మందుబాబుల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. ఖాళీ సీసాలు ఇస్తే డ‌బ్బులిస్తారు, ఒక్కో బాటిల్‌కు ఎంతంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved