MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • National
  • Korean Love Game: అస‌లేంటీ కొరియ‌న్ ల‌వ‌ర్ గేమ్‌.. మ‌నుషుల ప్రాణాలు ఎలా తీస్తోంది.?

Korean Love Game: అస‌లేంటీ కొరియ‌న్ ల‌వ‌ర్ గేమ్‌.. మ‌నుషుల ప్రాణాలు ఎలా తీస్తోంది.?

Korean Love Game: గాజియాబాద్​కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ చేసుకున్న వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొరియన్ లవ్​ గేమ్​కు బానిసలుగా మారడం వల్లే వీళ్లు ప్రాణాలు వదిలారని తేలింది. ీ నేపథ్యంలో అసలేంటీ గేమ్ తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 06 2026, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
‘కొరియన్ లవర్ గేమ్’ అంటే ఏంటి?
Image Credit : Gemini AI

‘కొరియన్ లవర్ గేమ్’ అంటే ఏంటి?

ఇది సాధారణంగా కనిపించే వినోద గేమ్ కాదు. కొరియన్ కల్చర్, K-డ్రామా, K-పాప్ ప్రభావంతో రూపొందించిన ఆన్‌లైన్ టాస్క్-బేస్డ్ లవ్ గేమ్‌ల శైలి ఇది. ఈ గేమ్‌లో ప్లేయర్‌కు ఓ వర్చువల్ లవర్ ఉంటాడు. అతడు లేదా ఆమె ప్రేమతో మాట్లాడటం, మెసేజ్‌లు పంపటం, ప్రత్యేకంగా ఫీల్ అయ్యేలా చేస్తుంటారు. చిన్న వయసు పిల్లలు, టీనేజర్లు భావోద్వేగంగా త్వరగా కనెక్ట్ అయ్యేలా ఈ గేమ్‌లు డిజైన్ చేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గేమ్‌లో టాస్కులు ఎలా ఇస్తారు?
Image Credit : ChatGPT

గేమ్‌లో టాస్కులు ఎలా ఇస్తారు?

మొదట్లో ఈ గేమ్ చాలా సాధారణంగా ఉంటుంది. రోజూ ఒక టైమ్‌కు చాట్ చేయాలి, మీ రోజు ఎలా గడిచిందో చెప్పాలి, కొన్ని భావోద్వేగ మెసేజ్‌లు పంపాలి. ఇలా మొదలయ్యే టాస్కులు, క్రమంగా వ్యక్తిగత స్థాయికి వెళ్తాయి. “నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?” “ఈ పని చేయకపోతే నేను బాధపడతాను” అనేలా మానసిక ఒత్తిడి పెంచుతారు. ఇక్కడే పిల్లలు ఆ గేమ్‌ను నిజమైన సంబంధంగా భావించడం మొదలుపెడతారు.

Related Articles

Related image1
బుల్లెట్ ట్రైన్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం.. ఇక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఖాయం
Related image2
OTT: ఈ సినిమా ఒంట‌రిగా ఉన్న‌ప్పుడే చూడండి.. రొమాన్స్‌, ట్విస్టులతో మ‌తిపోవాల్సిందే. ఎక్కడ చూడొచ్చు..
35
ఈ గేమ్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?
Image Credit : ChatGPT

ఈ గేమ్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?

వర్చువల్ ప్రపంచం, నిజ జీవితానికి మధ్య గీత మసకబారినప్పుడే అసలు ప్రమాదం మొదలవుతుంది. కొన్ని గేమ్‌లలో టాస్కులు మరింత ప్రమాదకరంగా మారుతాయి. ఒంటరిగా ఉండమని చెప్పడం, కుటుంబం నుంచి దూరంగా ఉండమని సూచనలు, తమను తాము హానిచేసుకునేలా భావోద్వేగంగా ప్రేరేపించడం. ఇది గతంలో సంచలనం సృష్టించిన బ్లూ వేల గేమ్ తరహాలోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి కొరియన్-థీమ్ గేమ్ ప్రమాదకరం కాదు. కానీ కొన్ని ప్లాట్‌ఫామ్‌లు ఈ ప్యాటర్న్ ను తప్పుగా వాడుతున్నాయి.

45
పిల్లలు ఎందుకు సులభంగా బలవుతారు?
Image Credit : Getty

పిల్లలు ఎందుకు సులభంగా బలవుతారు?

పిల్లల మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ప్రేమ, అటెన్షన్, అర్థం చేసుకునే వ్యక్తి అనే భావన వాళ్లను త్వరగా ఆకర్షిస్తుంది. కరోనా తర్వాత మొబైల్ వినియోగం పెరగడం కూడా ఈ ప్రమాదాన్ని ఎక్కువ చేసింది. గాజియాబాద్ ఘటనలోనూ, ముగ్గురు సోదరీమణులు చాలా కాలంగా గేమ్‌లకు అలవాటుపడి, ఒకరికొకరు పూర్తిగా డిపెండ్ అయ్యారని ప్రాథమిక విచారణలో తెలిసింది.

55
తల్లిదండ్రులు పిల్లలను ఎలా కాపాడాలి?
Image Credit : Getty

తల్లిదండ్రులు పిల్లలను ఎలా కాపాడాలి?

ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

తల్లిదండ్రులు చేయాల్సినవి:

* పిల్లల మొబైల్ వినియోగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు.

* ఏ గేమ్ ఆడుతున్నారు, దాని కంటెంట్ ఏంటి తెలుసుకోవాలి

* పిల్లలతో రోజూ మాట్లాడే అలవాటు ఉండాలి

* అకస్మాత్తుగా ఒంటరిగా ఉండటం, మౌనంగా మారటం లాంటి మార్పులు గమనించాలి

* అవసరమైతే డిజిటల్ పేరెంటల్ కంట్రోల్స్ ఉపయోగించాలి

* స్కూల్స్, టీచర్లు కూడా పిల్లల్లో మార్పులు గమనించి పేరెంట్స్‌కు చెప్పాలి

* ముఖ్యంగా, పిల్లలకు మొబైల్ కంటే తల్లిదండ్రుల అనుబంధమే భద్రత అనే విషయం మనం గుర్తుంచుకోవాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Anant Ambani: చెరువులోనే బతుకుతున్న బాలుడు.. ముంబైకి తీసుకెళ్లిన అనంత్ అంబానీ
Recommended image2
India Skills Report 2026: ఉద్యోగాలు సాధించడంలో ఆ రాష్ట్ర యువతే టాప్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
Recommended image3
Now Playing
పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
Related Stories
Recommended image1
బుల్లెట్ ట్రైన్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం.. ఇక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఖాయం
Recommended image2
OTT: ఈ సినిమా ఒంట‌రిగా ఉన్న‌ప్పుడే చూడండి.. రొమాన్స్‌, ట్విస్టులతో మ‌తిపోవాల్సిందే. ఎక్కడ చూడొచ్చు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved