MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే

Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే

Beers Price Drop : మందుబాబులకు గుడ్ న్యూస్. రూ.185 ధర కలిగిన కింగ్‌ఫిషర్ బీర్ ఇప్పుడు రూ.110కే దొరుకుతోంది. దాదాపు అన్ని బీర్లపై గరిష్ఠంగా రూ.75 వరకు ధర తగ్గింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 18 2026, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మందు ధరలు తగ్గాయోచ్...
Image Credit : Gemini AI

మందు ధరలు తగ్గాయోచ్...

వేసవి వచ్చిందంటే చాలు బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. మండుటెండల్లో చల్లచల్లని బీర్ తాగేందుకు చాలామంది ఇష్టపడతారు.. ముఖ్యంగా యువత ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇటీవలకాలంలో ఆల్కహాల్ ధరలు బాగా పెరగడంతో చాలామంది బీర్లకు దూరమయ్యారు... ఇలాంటివారికి తాజాగా గుడ్ న్యూస్ అందింది. ఒక్క బీర్ పై ఏకంగా రూ.20 నుండి రూ.75 వరకు తగ్గింది... సరిగ్గా వేసవి ఎండలు ముదిరిన వేళ ఇలా ధరలు తగ్గించడంతో మందుబాబులు ఆనందానికి అవధులు లేవు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
తెలుగోళ్లకు పండగే పండగ...
Image Credit : Getty

తెలుగోళ్లకు పండగే పండగ...

ఇప్పటికే వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి... దీంతో ఆటోమేటిగ్గా నిత్యావసరాల ధరలు కూడా మండిపోతున్నాయి. దీంతో యావత్ దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం మందుబాబులకు చల్లని కబురు చెప్పింది. ఈ రాష్ట్రంలో బీర్ల ధరలను భారీగా తగ్గించింది... కొన్ని బ్రాండ్లపై రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.75 వరకు ధర తగ్గింది.

ఎండలు మండిపోతున్న వేళ చల్లటి బీర్ తాగాలనుకునేవారికి ధరల తగ్గింపుతో పండగే. ముఖ్యంగా బీర్ ప్రియులకు సంబరాలు చేసుకునేంత ఆనందంలో ఉన్నారు. అయితే కేవలం కన్నడ ప్రజలకే కాదు కొందరు తెలుగోళ్లకు కూడా బీర్ల ధరల తగ్గింపుతో ఉపశమనం లభించనుంది. 

కర్ణాటక బార్డర్లోని తెలంగాణ జిల్లాలు నారాయణపేట, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి ప్రజలు కర్ణాటక వెళ్లి తక్కువధరలో బీర్లు తాగే అవకాశం ఉంటుంది. ఇక కర్ణాటకతో బార్డర్ పంచుకునే ఏపీ జిల్లాలు కర్నూల్, చిత్తూరు, అనంతపురం ప్రజలకు కూడా బీర్ల ధరలు తగ్గింపు ఉపయోగపడనుంది. ఇలా కర్ణాటకకు అత్యంత సమీపంలోని తెలుగు ప్రాంతాల మందుబాబులకు బీర్ల ధరల తగ్గింపుతో డబ్బులు ఆదా కానున్నాయి. ఇది వారికి మరింత కిక్ ఇవ్వనుంది. 

Related Articles

Related image1
Petrol Diesel Price: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడే ఎందుకు పెంచారు? కారణాలు చూస్తే షాక్ అవుతారు !
Related image2
Beer: నురుగు రాకుండా గ్లాసులో బీర్ ఎలా పోయాలో తెలుసా? 90 శాతం మందికి ఈ ట్రిక్ తెలియ‌దు
35
ఏ బీర్ ధర ఎంత..?
Image Credit : Gemini AI

ఏ బీర్ ధర ఎంత..?

కర్ణాటక ప్రభుత్వం ఆల్కహాల్ పై కొత్త పన్ను (ఆల్కహాల్ ఇన్ బేవరేజస్) అనే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అంటే ఆల్కహాల్ శాతాన్ని బట్టి పన్ను విధించే పద్ధతిని ప్రారంభించింది. ఈ మార్పు వల్లే బీర్ కంపెనీలు తమ బ్రాండ్ల ధరలను తగ్గించాయి... మే 11 నుండి ఏకంగా 20 నుండి 25 శాతం ధరల తగ్గింపు అమల్లోకి వచ్చింది.

కింగ్‌ఫిషర్ (ప్రీమియం, అల్ట్రా) : రూ.185 నుంచి రూ.110కి తగ్గింపు (రూ.75 తగ్గింది).

హీనెకెన్ సిల్వర్ (650 ml) : రూ.270 నుంచి రూ.195కి తగ్గింపు (రూ.75 తగ్గింది).

హీనెకెన్ అల్ట్రా బీర్ : రూ.225 నుంచి రూ.150కి తగ్గింపు (రూ.75 తగ్గింది).

బడ్ వైజర్ ప్రీమియం : రూ.225 నుంచి రూ.205కి తగ్గింది (రూ.20 తగ్గింపు).

యుబీ (UB - యునైటెడ్ బ్రూవరీస్) ఎక్స్‌పోర్ట్ బీర్ ధర కూడా రూ.25 తగ్గింది.

45
ఫారిన్ విస్కీ ధరలు కూడా తగ్గింపు..
Image Credit : Gemini AI

ఫారిన్ విస్కీ ధరలు కూడా తగ్గింపు..

కేవలం బీర్ల ధరలే కాదు ఫారిన్ విస్కీ ధరలు కూడా కర్ణాటకలో భారీగా తగ్గాయి. ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యే కొన్ని ప్రీమియం విస్కీ బాటిల్స్ పై ఏకంగా 20 శాతం ధరలు తగ్గాయి. జానీ వాకర్ బ్లాక్ లేబుల్, చివాస్ రీగల్ ఫుల్ బాటిల్ (750 ML) ధరలు రూ.5,190 నుండి రూ.4,100 కు తగ్గాయి. ఈ తగ్గింపు అధిక ఆదాయం, ప్రీమియం బ్రాండ్ మందు సేవించే వర్గాలకు ఊరటనిస్తోంది.

55
లోకల్ బ్రాండ్స్ మందు ధరల పెంపు..
Image Credit : X/Ranjith83839146

లోకల్ బ్రాండ్స్ మందు ధరల పెంపు..

బీర్లు, ప్రీమియం విస్కీ ధరలు తగ్గినా లోకల్ విస్కీతో పాటు ఇతర ఆల్కహాల్ ధరలను పెరిగాయి. ముఖ్యంగా తక్కువ ధర ఉండే మందు రేట్లను పెంచి అల్పాదాయ వర్గాలకు షాక్ ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం. ఇండియన్ మేడ్ లిక్కర్ ఒరిజినల్ ఛాయిస్, బ్యాగ్ పైపర్ వంటి బడ్జెట్ విస్కీ బాటిల్ ధరలు 25 శాతం వరకు పెరిగాయి. అంటే తక్కువ ధర మందు మరింత ప్రియం కానుందన్నమాట. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Recommended image2
Now Playing
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Recommended image3
Best Roads In The World: అమెరికాా కాదు.. చైనా కాదు.. ప్రపంచంలో బెస్ట్ రోడ్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే !
Related Stories
Recommended image1
Petrol Diesel Price: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడే ఎందుకు పెంచారు? కారణాలు చూస్తే షాక్ అవుతారు !
Recommended image2
Beer: నురుగు రాకుండా గ్లాసులో బీర్ ఎలా పోయాలో తెలుసా? 90 శాతం మందికి ఈ ట్రిక్ తెలియ‌దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved