MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • జియో యూజర్స్ కి గుడ్ న్యూస్.. సేఫ్ జర్నీ కోసం న్యూ అలర్ట్ సిస్టమ్, ఎలా పనిచేస్తుందో తెలుసా?

జియో యూజర్స్ కి గుడ్ న్యూస్.. సేఫ్ జర్నీ కోసం న్యూ అలర్ట్ సిస్టమ్, ఎలా పనిచేస్తుందో తెలుసా?

Safety Alert System : తమ యూజర్స్ సేప్టీ కోసం రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలు జరిగే అవకాశముంటే ముందే పసిగట్టి యూజర్స్ ని అలర్ట్ చేయనుంది. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?  

2 Min read
Author : Arun Kumar P
Published : Dec 04 2025, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సేప్టీ అలర్ట్ సిస్టమ్
Image Credit : Meta AI

సేప్టీ అలర్ట్ సిస్టమ్

Safety Alert System : ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి... కర్నూల్, చేవెళ్ల వంటి బస్సు ప్రమాదాలు ఏస్థాయిలో ప్రాణనష్టం కలిగించాయో చూశాం. చిన్నచిన్న తప్పుల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ క్రమంలో ప్రమాదాల నియంత్రణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీ జియో సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి. అదే "సేప్టీ అలర్ట్ సిస్టమ్''.

25
జియోతో NHAI ఒప్పందం
Image Credit : Pinterest

జియోతో NHAI ఒప్పందం

NHAI, రిలయన్స్ జియో కలిసి మొబైల్ ఆధారిత రోడ్డు భద్రతా హెచ్చరికల వ్యవస్థ కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగానే 'సేప్టీ అలర్ట్ సిస్టమ్' ను తీసుకువస్తున్నాయి. జియో 4G-5G నెట్‌వర్క్‌ను ఉపయోగించే ఈ వ్యవస్థ పనిచేయనుంది… రోడ్డు పక్కన ప్రత్యేక పరికరాలు అవసరం లేవు. ఈ వ్యవస్థ పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ఇది NHAI 'రాజ్‌మార్గ్‌ యాత్ర' యాప్, ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 1033తో అనుసంధానమై ఉంటుంది. ఈ ప్రయత్నం భవిష్యత్తులో భారత రోడ్డు భద్రతా ప్రమాణాలను మారుస్తుందని భావిస్తున్నారు.

Related Articles

Related image1
Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు గుండె నొప్పి వస్తే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి?
Related image2
IMD Rain Alert : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఈ మూడు జిల్లాల్లో అల్లకల్లోలమే..!
35
రోడ్డు ప్రమాదాలకు చెక్...
Image Credit : Getty

రోడ్డు ప్రమాదాలకు చెక్...

NHAI, జియో ఒప్పందం అమల్లోకి వస్తే నేషనల్ హైవేలపై ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. జియో యూజర్లకు ప్రయాణ సమయంలో నేరుగా భద్రతా హెచ్చరికలు అందుతాయి. దేశంలోని 50 కోట్లకు పైగా జియో యూజర్లకు పొగమంచు ప్రాంతాలు, ప్రమాదకర ప్రదేశాలు, జంతువులు తిరిగే చోట్లు, ఆకస్మిక మలుపుల గురించి ఎస్ఎంఎస్, వాట్సాప్, కాల్స్ ద్వారా ముందుగానే సమాచారం అందుతుంది. మొదట కొన్ని హైవేలపై పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలని NHAI, జియో భావిస్తున్నాయి.

45
ఆటోమేటిక్ గా అలర్ట్
Image Credit : stockPhoto

ఆటోమేటిక్ గా అలర్ట్

రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రయాణ భద్రతను మెరుగుపరచడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. ప్రయాణికుల లొకేషన్, ప్రయాణ దిశను గమనించి, సంబంధిత హెచ్చరికలను ఆటోమేటిక్‌గా పంపే సామర్థ్యం దీనికి ఉంది. టెక్నాలజీతో జాతీయ రహదారుల భద్రతను మెరుగుపరచడంలో ఇది ఒక కొత్త ప్రమాణాన్ని సృష్టిస్తుందని NHAI తెలిపింది.

55
కోట్లాదిమంది జియో యూజర్స్ కి ప్రయోజనం
Image Credit : Freepik

కోట్లాదిమంది జియో యూజర్స్ కి ప్రయోజనం

ఈ హెచ్చరికల వ్యవస్థను రాజ్‌మార్గ్‌యాత్ర యాప్, 1033 హెల్ప్‌లైన్‌తో అనుసంధానిస్తారు. దీనివల్ల ప్రయాణికులు రోడ్డు పరిస్థితి, అత్యవసర సహాయం, హెచ్చరికలను ఒకేచోట పొందగలరు. ఈ సేవ దేశవ్యాప్తంగా అమలయ్యాక కోట్లాదిమంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారని NHAI (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) చెబుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
భారతీయ టెలికాం
యుటిలిటీ
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image2
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Recommended image3
గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి.. రూరల్ ఎకానమీ దిశగా కీలక ముందుడుగు
Related Stories
Recommended image1
Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు గుండె నొప్పి వస్తే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి?
Recommended image2
IMD Rain Alert : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఈ మూడు జిల్లాల్లో అల్లకల్లోలమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved