రూపాయికే విమాన ప్రయాణం.. ఇండిగో ఫ్లైట్ స్పెషల్ ఆఫర్, ఎవరికంటే..
Flight: విమానంలో ప్రయాణించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే అధిక ధరల కారణంగా కొందరికి ఇది కలగానే మిగిలిపోతుంది. కానీ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అదిరిపోయే అవకాశాన్ని తీసుకొచ్చింది.

రూపాయికే విమాన ప్రయాణం
ఇండిగో కంపెనీ చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. ‘ఇన్ఫాంట్ ఫ్లై ఎట్ రూ.1’ పేరుతో, 0-24 నెలల వయసు ఉన్న పసికందుల కోసం కేవలం ఒక రూపాయి చెల్లించి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
ఎవరు అర్హులు.?
3 రోజులు వయసు నుంచి 2 సంవత్సరాల (24 నెలల) వరకు ఉన్న పసికందులు ఇందుకు అర్హులు. చెక్-ఇన్ సమయంలో తల్లిదండ్రులు వయసును నిర్ధారించే డాక్యుమెంట్స్‌ను చూపించాలి. ఉదాహరణకు: బర్త్ సర్టిఫికేట్, హాస్పిటల్ డిశ్చార్జ్ కార్డ్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్. వయసు ధృవీకరణ పత్రాలు లేకపోతే, పూర్తి టికెట్ ధర చెల్లించాల్సి వస్తుంది.
టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?
ఈ ఆఫర్ ఇండిగో అధికారిక వెబ్‌సైట్ (goIndiGo.in) ద్వారా మాత్రమే వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని, ప్రయాణ సమయంలో చెక్-ఇన్ వద్ద వయసు ధృవీకరణ పత్రాలు చూపించాలి.
ఎంత మంది చిన్నారులకు అనుమతి ఉంటుంది.?
ఎయిర్‌బస్ A320: గరిష్ఠంగా 12 పసికందులు.
ATR విమానాలు: గరిష్ఠంగా 6 పసికందులు.
ఒక్క పసికందుకు ఒక్క తల్లిదండ్రి మాత్రమే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రుల కోసం సౌలభ్యం
పసికందులతో ప్రయాణించడం పెద్ద సవాలే కాబట్టి, ఇండిగో ఈ ఆఫర్ ద్వారా తల్లిదండ్రుల భారం తగ్గించడానికి సహాయం చేస్తున్నారు. అన్ని సౌకర్యాలు విమానంలో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.