MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • ఏడాదంతా కురవాల్సిన వర్షం 24 గంటల్లోనే కురిసిందా..! దేశ చరిత్రలోనే రికార్డు వర్షపాతమా! ఎన్ని మిల్లిమీటర్లో తెలుసా?

ఏడాదంతా కురవాల్సిన వర్షం 24 గంటల్లోనే కురిసిందా..! దేశ చరిత్రలోనే రికార్డు వర్షపాతమా! ఎన్ని మిల్లిమీటర్లో తెలుసా?

ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షం కురిస్తే, దేశ చరిత్రలోనే నిలిచిపోయేలా కుండపోత వాన పడితే, ఇదే పరిస్థితి ప్రస్తుతం కొన్నిప్రాంతాల్లో నెలకొంది. 24 గంటల్లో ఏకంగా 1000 మి.మీ వర్షం కురిసిందా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 23 2026, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుండపోత కాదు అంతకు మించిన వర్షాలు
Image Credit : Gemini AI

కుండపోత కాదు అంతకు మించిన వర్షాలు

Heavy Rains : ప్రకృతి కోపగిస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందో చెప్పడానికి గుజరాత్‌లో ఇటీవల కురుస్తున్న వర్షాలే నిదర్శనం. ముఖ్యంగా సౌత్ గుజరాత్ లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి... నదులు, వాగులు వంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి..జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారిపోయాయి. దేశ చరిత్రలోనే ఇప్పటివరకు నమోదైన అత్యంత భారీ వర్షాల రికార్డులను బద్దలుగొట్టేలా ఈ వానలు ఉన్నాయంటేనే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా ఒక ప్రాంతంలో ఏడాది పొడవునా పడాల్సిన మొత్తం వర్షం కేవలం ఒకే ఒక్క రోజులో కురిస్తే.. అదీ కొన్ని గంటల వ్యవధిలోనే కురిస్తే ఆ పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. సరిగ్గా అలాంటి అరుదైన, వినాశకరమైన వాతావరణ పరిస్థితులే గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో నెలకొన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉమేర్‌గావ్‌ను ముంచెత్తిన కుండపోత
Image Credit : Gemini AI

ఉమేర్‌గావ్‌ను ముంచెత్తిన కుండపోత

గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ జిల్లా ఉమేర్‌గావ్‌ ప్రాంతంలో 2026 జూలై 22న మేఘాలకు చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం విరుచుకుపడింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇక్కడ ఏకంగా 1064 మిలీమీటర్ల (106.4 సెంటీమీటర్లు) వర్షపాతం నమోదైంది. ఈ స్థాయిలో వర్షం కురవడంతో ఉమేర్‌గావ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లు, వీధులు, రోడ్లు చెరువులను తలపించగా, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.

Related Articles

Related image1
Heavy Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇక ఈ 9 జిల్లాల్లో వర్ష బీభత్సమే, బిఅలర్ట్
Related image2
Hyderabad Rains : గోల్కొండ బోనాన్ని తడిపిన వానచినుకులు.. ఈ సాయంత్రం నగరంలో జోరువానలే, ఈ ప్రాంతాల్లో అలర్ట్
35
తెలంగాణ వార్షిక సగటు వర్షపాతం ఎంతో తెలుసా?
Image Credit : ANI

తెలంగాణ వార్షిక సగటు వర్షపాతం ఎంతో తెలుసా?

గుజరాత్ లోని ఉమేర్‌గావ్ లో కురిసిన ఈ కుండపోత వర్షం తీవ్రత ఎంతటిదో అర్థం కావాలంటే మన తెలంగాణ రాష్ట్ర సగటు వర్షపాతంతో పోల్చి చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఏడాది పొడవునా పడే సగటు వర్షపాతం సుమారు 800 మిలీమీటర్ల నుండి 900 మిలీమీటర్లు. అంటే తెలంగాణ ప్రజలు ఒక ఏడాది మొత్తం చూసే వర్షాన్ని.. ఉమేర్‌గావ్ వాసులు ఒక్క రోజులోనే అనుభవించారు.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒకే రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం 649.8 మిలీమీటర్లు. 2023 జూలై 27న ములుగులో ఈ వర్షం కురిసింది. మన రాష్ట్రంలో ఇది ఆల్‌టైమ్ రికార్డు అయినప్పటికీ, గుజరాత్‌లోని ఉమేర్‌గావ్‌లో కురిసిన 1064 మి.మీ వర్షపాతంతో పోలిస్తే అది దాదాపు సగం మాత్రమే కావడం విశేషం.

45
భారతదేశంలో ‘టాప్ 3’ వర్షపాత రికార్డులివే
Image Credit : AFP

భారతదేశంలో ‘టాప్ 3’ వర్షపాత రికార్డులివే

భారతదేశ వాతావరణ చరిత్రను తిరగేస్తే... ఒకే రోజులో 1000 మిలీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం అత్యంత అరుదైన సంఘటన. 2026 జూలై 23న ఉమేర్‌గావ్‌లో కురిసిన వర్షం భారత్‌లో నమోదైన ఒకే రోజు అత్యధిక వర్షపాతాల్లో మూడో స్థానంలో నిలిచింది.

భారతదేశంలో అత్యధిక వర్షపాతానికి నిలయమైన మేఘాలయలోని చిరపుంజి (సోహ్రా)లో 1995లో నమోదైన 1563.3 మి.మీ వర్షపాతం ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత లక్షద్వీప్‌లోని అమినిదీవి (1168.5 మి.మీ) రెండో స్థానంలో నిలవగా, ఉమేర్‌గావ్ ఘటన మూడో స్థానాన్ని ఆక్రమించింది.

55
మారిన వాతావరణ సరళి – శాస్త్రవేత్తల విశ్లేషణ
Image Credit : Gemini AI

మారిన వాతావరణ సరళి – శాస్త్రవేత్తల విశ్లేషణ

ఇటీవలి కాలంలో రుతుపవనాల సరళి తీవ్రంగా మారుతోంది. చాలా తక్కువ సమయంలోనే విపరీతమైన వర్షపాతం కురిసే క్లౌడ్ బర్స్ట్ (Cloudburst) తరహా ఘటనలు పెరుగుతున్నాయి. భూతాపం (Global Warming) పెరగడం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో మార్పులు రావడం వల్ల మేఘాలలో తేమను పట్టి ఉంచే సామర్థ్యం పెరిగి, అనుకూల పరిస్థితులు ఏర్పడగానే ఒక్కసారిగా ఆ నీరు అంతా కిందకు జారిపడుతోంది.

వల్సాద్ వంటి తీర ప్రాంతాల్లో అరేబియా సముద్రం నుంచి వచ్చిన తీవ్రమైన తేమ గాలులు, స్థానిక వాతావరణ పీడన వ్యత్యాసాలతో కలవడం వల్లే ఉమేర్‌గావ్‌లో ఈ స్థాయి జలప్రళయం సంభవించిందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

గుజరాత్‌లోని ఉమేర్‌గావ్‌లో కురిసిన 1064 మి.మీ వర్షపాతం కేవలం ఒక గణాంకం లేదా రికార్డు మాత్రమే కాదు. ఇది భవిష్యత్తులో రాబోయే తీవ్రమైన వాతావరణ మార్పులకు సజీవ సాక్ష్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణాలు, నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుచుకోవడం, విపత్తు నిర్వహణ సన్నాహక చర్యలను మరింత పటిష్టం చేసుకోవడం ద్వారా మాత్రమే ఇలాంటి సహజ విపత్తుల నుంచి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలమని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Modi: మ‌రోసారి విదేశాల‌కు ప్ర‌ధాని మోదీ.. ప‌ర్య‌ట‌న ల‌క్ష్యం ఏంటంటే.?
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన వందలాది మృ*తదేహాలు | Asianet News Telugu
Recommended image3
Now Playing
భారీ వరదల తర్వాత నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి | Drone Visuals | Nepal Flash Floods | From Devi Ghat
Related Stories
Recommended image1
Heavy Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇక ఈ 9 జిల్లాల్లో వర్ష బీభత్సమే, బిఅలర్ట్
Recommended image2
Hyderabad Rains : గోల్కొండ బోనాన్ని తడిపిన వానచినుకులు.. ఈ సాయంత్రం నగరంలో జోరువానలే, ఈ ప్రాంతాల్లో అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved