India Pakistan War : దేశవ్యాప్తంగా మూడ్రోజులు ఏటిఎంలు క్లోజ్... నిజమేనా?
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్న సోషల్ మీడియాలో ఓ ప్రచారం జోరందుకుంది. దేశవ్యాప్తంగా 2-3 రోజులు బ్యాంక్ ఏటిఎంలు క్లోజ్ కానున్నాయన్నది దీని సారాంశం. మరి ఇందులో నిజమెంతంటే...

India Pakistan War
India Pakistan War : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్ధాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక తాజాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరుదేశాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. భారత్-పాకిస్థాన్ పరస్పరం క్షిపణులు, డ్రోన్స్ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి నుండి పరిస్థితి మరింత దిగజారింది... భారత ఆర్మీ స్థావరాలే టార్గెట్ గా పాకిస్థాన్ దాడులకు తెగబడుతోంది. ఈ దాడులను సమర్ధవంతంగా తిప్పికొడుతూ ప్రతిదాడులకు దిగుతోంది భారత్.
ఇలా భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రికతల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ఒకటే దేశవ్యాప్తంగా ఏటిఎం బంద్స్. దేశంలో ఉద్రిక్త పరిస్థితుల వేళ బ్యాంకులు ఏటిఎంలను మూసివేయనున్నాయనే ప్రచారం జోరందుకుంది. మూడు రోజులపాటు ఏటిఎంలు క్లోజ్ కానున్నాయని సోషల్ మీడియాతో పాటు మిగతా మాధ్యమాల్లోనూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటించింది.
PIB Fact Check
దేశవ్యాప్తంగా ఏటిఎంలు మూతపడనున్నాయన్న ప్రచారం పిఐబి ఫ్యాక్ట్ చెక్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగాని, బ్యాంకులు గానీ ఏటిఎంల మూసివేతపై ప్రకటన చేయలేదని... ఇదంతా తప్పుడు ప్రచారమని పిఐబి తేల్చింది. ఇలాంటి తప్పుడు సమాచారంతో ప్రజలు ఆందోళనకు గురికావద్దని.. అధికారిక సమాచారాన్నే నమ్మాలని పిఐబి సూచించింది.
PIB Fact Check
ఇక సోషల్ మీడియాతో పాకిస్థాన్ ప్రేరిత తప్పుడు సమాచారంతో భారత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిఐబి హెచ్చరించింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై నకిలీ సమాచార ప్రవాహం పెరుగుతోందని పేర్కొంది. ముఖ్యంగా భారత సాయుధ దళాలు మరియు ప్రస్తుతం కొనసాగుతున్న భారత్-పాకిస్తాన్ పరిస్థితికి సంబంధించి వస్తున్న సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిఐబి సూచించింది.
PIB Fact Check
సోషల్ మీడియాలో సందేహాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే అధికారిక వాట్సాప్ నంబర్ +91 8799711259 లేదా మెయిల్ ఐడీ (factcheck@pib.gov.in)(mailto:factcheck@pib.gov.in)ని ఉపయోగించి తమకు సమాచారం అందించాలనా పిఐబి ప్రకటించింది.
atms will close
ఇదిలాఉంటే పాకిస్థాన్ లో మాత్రం యుద్దభయంతో ప్రజలు బ్యాంకులు, ఏటిఎంల ముందు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్దమవుతున్న ప్రజలు బ్యాంకులోని డబ్బులను విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో బ్యాంకులు విత్ డ్రా పై లిమిట్ విధించినట్లు... కొంతమొత్తంలోనే డబ్బు ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పాక్ స్టాక్ మార్కెట్ కుప్పకూలగా యుద్దభయంతో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దెబ్బతినేలా కనిపిస్తోంది.