MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • India Pakistan : యుద్ధం వస్తే ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి?

India Pakistan : యుద్ధం వస్తే ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి?

యుద్ధం అంటేనే ప్రాణాలతో చెలగాటమే. యుద్ద సమయంలో మనం ఎలా స్పందిస్తామన్నదే అసలు విషయం. ప్రజలుగా మన బాధ్యతను నెరవేర్చితే, సైనికులకు కూడా ఉత్సాహం లభిస్తుంది. కాబట్టి యుద్ద సమయంలో మనల్ని మనం కాపాడుకోడానికి కాదు అవసరమైతే  దేశ రక్షణ కోసం దేనికైనా రెడీగా ఉండాలి. యుద్దం వస్తే  ఎలా స్పందించాలో తెలుసుకుందాం. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : May 07 2025, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
India Pakistan

India Pakistan

Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పూర్తిగా దెబ్బతిన్న భారత్-పాకిస్థాన్ సంబంధాలు తాజా ఆపరేషన్ తర్వాత తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య యుద్దమేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా ఎవరు ఎవరిపై అయినా దాడి చేయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. యుద్దమే జరిగితే కేవలం సైనికులకే కాదు సామాన్యుల ప్రాణాలకు రక్షణ ఉండదు. ఇలాంటి ప్రమాదకర సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ఏం చేయాలి? దేశరక్షణ కోసం మనవంతు సాయంగా ఏం చేయాలి? అనేది ఇక్కడ తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
india pakistan Tension

india pakistan Tension

1. ప్రభుత్వ సూచనలు పాటించడం : 

యుద్ద సమయంలో తమ దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయి. ఓవైపు సైనికులతో శత్రువులను ధీటుగా ఎదిరిస్తూనే మరోవైపు ప్రజలు ఈ యుద్దంవల్ల ఎఫెక్ట్ కాకుండా చర్యలు చేపడుతుంటారు. కాబట్టి యుద్ద సమయాల్లో ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పకుండా పాటించాలి. ఏ ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయో, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడ ఉండకూడదో వంటి సమాచారం అధికారికంగా వస్తుంది. వాటిని బట్టి ప్రణాళికలు వేసుకోవాలి. యుద్ద సమయంలో కంఫర్ట్ కంటే ప్రాణాలకు కాపాడుకోడానికే ప్రాధాన్యత ఇవ్వాలి.  

39
india pakistan Tension

india pakistan Tension

2. నిత్యావసరాలను ముందే సిద్దంచేసుకోవాలి :

ఇటీవల కరోనా సమయంలో లాక్ డౌన్ విధిస్తేనే నిత్యావసరాల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అలాంటిది యుద్ద సమయంలో మరింత ఉద్రిక్తత పరిస్థితులుంటాయి... కాబట్టి నిత్యావసరాల కొరత రావచ్చు. అందుకే యుద్దం జరిగే అవకాశం ఉందని తెలియగానే ఎక్కువరోజులకు సరిపడా వంట పదార్థాలను సేకరించి దాచుకోవాలి. ఇలా అహార పదార్థాలకు సంబంధించినవే కాదు మెడిసిన్స్ వంటి అత్యవసర వస్తువులను అదనంగా పెట్టుకోవాలి. కొంతకాలం బయటకు వెళ్లకపోయినా ఇంట్లోనే అన్ని నిత్యావసరాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. 

49
india pakistan Tension

india pakistan Tension

3. ధైర్యంగా ఉండాలి.  

యుద్ద పరిస్థితుల్లో మనోధైర్యం కోల్పోవద్దు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనుకుంటూ ఆందోళనకు గురికావచ్చు.  ముఖ్యంగా యుద్ద పరిస్థితుల గురించి వార్తలను చూసి బెంబేలెత్తిపోవడం... పేలుళ్లు, సైనిక కదలికలు చూసి భయపడకూడదు. ఈ భయం మీ కుటుంబాన్ని కూడా భయపెట్టవచ్చు. కాబట్టి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను అనే గుండెధైర్యంతో ఉండాలి. అవసరం అయితే కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పే స్థాయిలో ఉండాలి. భయంతో తీసుకునే తప్పులు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టవచ్చు... ఒక్కోసారి ప్రాణాంతకంగా మారవచ్చు.

59
india pakistan Tension

india pakistan Tension

4. తప్పుడు వార్తలు నమ్మవద్దు 

యుద్ద సమయంలో అక్కడలా జరిగింది.. ఇక్కడిలా జరిగిందనే తప్పుడు ప్రచారం వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తుంటాయి... కాబట్టి అన్నింటినీ గుడ్డిగా నమ్మకూడదు. అధికారంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి... తప్పుడు వార్తలు నిజమేనని నమ్మి ఇతరులకు షేర్ చేయకూడదు. దీనివల్ల ప్రజల మధ్య గందరగోళం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏదయినా వదంతు మనవరకు వచ్చినా దాన్ని అక్కడే ఆపాలి... ఇతరులకు చెప్పి మరింత వ్యాపింపచేయకూడదు.

69
india pakistan Tension

india pakistan Tension

5. దేశ భద్రతకు సహకరించాలి :

దేశం బాగుంటేనే మనం బాగుండేది... దేశమే లేకుంటే మనం కూడా ఉండం. కాబట్టి అత్యవసర సమయాల్లో ప్రభుత్వం కోరితే దేశ రక్షణకు రెడీ కావాలి.  ప్రభుత్వం, సైన్యం కోరిన సహాయం అందించాలి.  కొందరు వాలంటీర్‌లుగా పనిచేయవచ్చు... కొందరు ఆర్థిక సహాయం చేయవచ్చు. యువత అయితే పోలీసులకు, రెడ్ క్రాస్ లాంటి సంస్థలకు సహాయం చేయగలరు. ఇలా మనకు తోచిన సాయం చేసి క్లిష్ట సమయాల్లో దేశానికి తగిన సహకారం అందించారు. 

79
india pakistan Tension

india pakistan Tension

6. పిల్లలు, వృద్ధులు, స్త్రీల భద్రత:

యుద్ద సమయాల్లో ఎక్కువగా ప్రభావితం అయ్యేది పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు. ఇలాంటివారి రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారి కోసం సురక్షిత ప్రదేశాలు ఏర్పాట్లు చేయాలి. అవసరమైన వసతులు వారికి కల్పించాలి.   

89
india pakistan Tension

india pakistan Tension

7. అనవసర ప్రయాణాలు వద్దు

యుద్ద సమయంలో రహదారులు సురక్షితం కాదు..బయట ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. కాబట్టి ఇంట్లోనే ఉండటం మంచిది... ప్రయాణాలు పెట్టుకోవద్దు. యుద్ద సమయంలో ఎక్కువగా బయట ఉండటమంటే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లే. 

99
india pakistan Tension

india pakistan Tension

8. దేశం కోసం ఏకమవ్వాలి:

దేశం కోసం అంతా ఏకం కావాలి... కులమతాలు, వివాదాలు, రాజకీయాలు, పక్షపాతాలు పక్కనబెట్టి ఒకటిగా ఉండాలి. దేశ భద్రత ముందు మన వ్యక్తిగత విషయాలు చిన్నవే. కాబట్టి యుద్ద సమయంలో ఒకరికొకరు  సహకారం అందించుకునేందుకు ఏకం కావాలి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆపరేషన్ సింధూర్
భారత దేశం
పాకిస్తాన్
ప్రపంచం
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
టీవీ రంగంలో ఉద్యోగాలకు ముప్పు త‌ప్ప‌దా.. అదే జ‌రిగితే వేల మందిపై ప్రభావం
Recommended image2
రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్లు.. కాంగ్రెస్ సభపై బీజేపీ నేతల విమర్శలు
Recommended image3
Delhi: ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తోన్న ఢిల్లీ.. దేశ రాజ‌ధానిలో అస‌లేం జ‌రుగుతోంది?
Related Stories
Recommended image1
Now Playing
పాకిస్తాన్‌లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన వీడియోలు విడుదల | Operation Sindoor | Asianet News Telugu
Recommended image2
Now Playing
ఇది దేశం చేస్తున్న యుద్ధం కాంగ్రెస్ నాయకులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ | Operation Sindoor | Asianet
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved