MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • భారత్, పాక్ లో ఎవరి ఆర్మీ బలం ఎంత? ఎవరి వద్ద ఎక్కువ యుద్దవిమానాలున్నాయి?

భారత్, పాక్ లో ఎవరి ఆర్మీ బలం ఎంత? ఎవరి వద్ద ఎక్కువ యుద్దవిమానాలున్నాయి?

అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇటీవల యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరుదేశాల సైనిక సామర్థ్యాల గురించి బాగా చర్చ జరిగింది. కాబట్టి ఏ దేశ సైనిక బలం ఎంతో తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : May 22 2025, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అసలు పాక్ వద్ద విమాన వాహక నౌకలే లేవా?

అసలు పాక్ వద్ద విమాన వాహక నౌకలే లేవా?

రష్యా నిర్మిత ఐఎన్ఎస్ విక్రమాదిత్య, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్ వద్ద ఉన్నాయి. ఈ రెండు క్రియాశీల విమాన వాహక నౌకలు భారత నౌకాదళానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే పాకిస్థాన్‌ వద్ద ఒక్క విమాన వాహక నౌక కూడా లేదు. 

భారత్ వద్ద 18 క్రియాశీల జలాంతర్గాములున్నాయి. అందులో అణుశక్తితో నడిచే అరిహంత్ తరగతి బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ వద్ద ఐదు జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి. అందులో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. 

భారత నౌకాదళంలో 150 నౌకలున్నాయి. పాకిస్థాన్ వద్ద కేవలం 9 ఫ్రిగేట్‌లు మాత్రమే ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యుద్ద విమానాలూ భారత్ వద్దే అధికం

యుద్ద విమానాలూ భారత్ వద్దే అధికం

భారత్ వద్ద 2,200 సైనిక విమానాలున్నాయి. పాకిస్థాన్ కంటే భారత వైమానిక దళం ఎల్లప్పుడూ ముందంజలో ఉంది. సుఖోయ్ Su-30MKI, రాఫెల్, మిరాజ్ 2000 వంటి ఆధునిక యుద్ధ విమానాలు భారత వైమానిక దళం వద్ద ఉన్నాయి. అత్యాధునిక అటాక్ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ వైమానిక దళం వద్ద 1,400 విమానాలున్నాయి. అందులోనూ చాలావరకు పనిచేయకుండా ఉన్నవే ఎక్కువ. 

35
యుద్ద ట్యాంకులు ఎవరివద్ద ఎన్ని?

యుద్ద ట్యాంకులు ఎవరివద్ద ఎన్ని?

భారత్ వద్ద 4,201 ట్యాంకులున్నాయి. పాకిస్థాన్ వద్ద 2,627 ట్యాంకులున్నాయి. భారత సైన్యం ఆధునిక ఫిరంగులను కలిగి ఉంది. పాకిస్థాన్ ఇటీవలే చైనా నుంచి SH-15 ఫిరంగులను కొనుగోలు చేసింది.

45
క్షిపణులు సామర్థ్యం

క్షిపణులు సామర్థ్యం

భారత్ వద్ద అగ్ని క్షిపణులు, బ్రహ్మోస్ క్షిపణులు వంటి అధునాతన క్షిపణులున్నాయి. ఇవి వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా చాలా ఖచ్చితత్వంతో చేధించగలవు. పాకిస్థాన్ క్షిపణి సామర్థ్యం చాలా పరిమితం. ఇటీవల భారత్ పై పాక్ మిస్సైల్స్ తో దాడిచేయగా ఒక్కటి కూడా లక్ష్యాన్ని చేధించలేకపోయింది. కానీ భారత క్షిపణులు అనుకున్న లక్ష్యాలను చేధించింది. దీన్నిబట్టి ఎవరి మిస్సైల్స్ ఎంత బలమైనవో అర్థం చేసుకోవచ్చు.   

55
రక్షణ బడ్జెట్ లోనూ భారత్ టాప్

రక్షణ బడ్జెట్ లోనూ భారత్ టాప్

భారత ఆర్థిక బలం, రక్షణ బడ్జెట్ పాకిస్థాన్ కంటే చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో భారత్ ను పాక్ తో పోల్చకపోవడమే మంచింది. భారత్ ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీపడి టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిస్తే పాక్ మాత్రం ఐఎంఎఫ్ వద్ద నిధులకోసం చేతులు చాస్తోంది. అలాంటిది ఆ దేశం రక్షణ రంగానికి ఎక్కువగా నిధులిస్తుందని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. 

ఇలా  నావికా, వైమానిక, సైనిక రంగాల్లో భారత్ పాకిస్థాన్ కంటే ముందంజలో ఉంది. భారత్ స్వతహాగా తన సైనిక బలాన్ని పెంచుకుంటే పాకిస్థాన్ ప్రతిసారీ చైనా, అమెరికాల, టర్కీ వంటి దేశాలనుండి సైనికసాయం పొందుతుంది.   

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
పాకిస్తాన్
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్
యుద్ధం
ఆపరేషన్ సింధూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Protest : సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్.. రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
Recommended image2
Rahul Gandhi: సీఈసీకి మోదీ రక్షణ.. ఢిల్లీని జైలుగా మార్చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
INDIA Bloc Protest: సీజేఐ నో చెప్పినా ఆగని ఇండియా కూటమి నిరసనలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
బ్రహ్మోస్ మిస్సైల్ ను పాక్ కాదు చైనా కూడా అడ్డుకోలేదు : అమెరికా రక్షణరంగ నిపుణుడు
Recommended image2
పాకిస్థాన్ లోనే కాదు ఉగ్రవాదులు ఎక్కడుంటే అక్కడికెళ్ళి కొడతాం: జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved