- Home
- Business
- Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా సరే.. మీరు టోల్ చార్జీలు కట్టాల్సిన పనిలేదు, ఎలాగంటే..
Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా సరే.. మీరు టోల్ చార్జీలు కట్టాల్సిన పనిలేదు, ఎలాగంటే..
Toll Plaza: జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే వారు కచ్చితంగా టోల్ చార్జీలు చెల్లించాలని తెలిసిందే. అయితే కొంతమందికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. ఎవరెవరికి ఈ మినహాయింపు వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

టోల్ చార్జీల నుంచి మినహాయింపు ఎవరికీ ఉంటుంది?
భారత్‌లో జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వాటితో పాటు టోల్ ప్లాజాల సంఖ్య కూడా పెరిగింది. సాధారణంగా ప్రతి వాహనం టోల్ చెల్లించాల్సిందే. కానీ కొన్ని ప్రత్యేక వర్గాల వారికి, కొన్ని వాహనాలకు ప్రభుత్వం టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది.
టోల్ ప్లాజాకు దగ్గరగా నివసిస్తే ఉచిత ప్రయాణం
మీ ఇల్లు టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉంటే టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ఈ సౌకర్యం కల్పిస్తోంది. ఇందుకు మీ నివాసం ఆ పరిధిలోనే ఉందని నిరూపించే అధికారిక పత్రాలు చూపించాల్సి ఉంటుంది. 2024 సెప్టెంబర్ 24 నుంచి అమలులోకి వచ్చిన “టర్న్-ది-డిస్టెన్స్-ది-టోల్” విధానం ప్రకారం, GNSS సిస్టమ్ ఉన్న వాహనాలు 20 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే టోల్ ఫీజు వర్తించదు.
ప్రభుత్వ వాహనాలకు పూర్తి మినహాయింపు
టోల్ ఫీజు మినహాయింపు సాధారణ ప్రజలకే కాదు, ప్రభుత్వ వాహనాలకు కూడా ఉంటుంది. వీటిలో..
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల వాహనాలు
* పోలీస్ వాహనాలు
* అంబులెన్స్‌లు
* అగ్నిమాపక వాహనాలు
* ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాహనాలు
* విపత్తుల సమయంలో పనిచేసే NDRF వాహనాలు
ఈ వాహనాలన్నీ టోల్ చెల్లించకుండా ప్రయాణించవచ్చు.
ద్విచక్ర వాహనాలు, పాదచారులకు టోల్ లేదు
దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు పూర్తిగా మినహాయించారు. అందువల్ల బైక్‌లు, స్కూటర్లకు ఫాస్టాగ్ అవసరం లేదు. అలాగే రహదారులపై నడిచే పాదచారులు కూడా ఎలాంటి టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు.
టోల్ నిబంధనల మార్పుతో ప్రజలకు ఊరట
మీ నివాసం టోల్ ప్లాజాకు ఎంత దగ్గరలో ఉందో చాలా కీలకం. 20 కిలోమీటర్ల పరిధిలో ఉంటే సరైన దరఖాస్తుతో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ టోల్ నిబంధనల మార్పు, జాతీయ రహదారుల సమీపంలో నివసించే ప్రజలకు పెద్ద ఊరటగా మారింది.

