- Home
- National
- Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌లోకి తీసుకొచ్చేందుకు కిర్రాక్ ప్లాన్ వేశాడు.. చివర్లో ఊహించని ట్విస్ట్
Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌లోకి తీసుకొచ్చేందుకు కిర్రాక్ ప్లాన్ వేశాడు.. చివర్లో ఊహించని ట్విస్ట్
Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో అర్థం అవ్వడం లేదు. ప్రపంచంలో ఏ మూలన ఏ వింత జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఇలాంటి ఓ వీడియో ఆసక్తికరమైన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

అబ్బాయిల హాస్టల్‌లోకి అమ్మాయిలు, అమ్మాయిల హాస్టల్‌లోకి అబ్బాయిలు ఎంట్రీ ఇవ్వడం సినిమాల్లో చూస్తుంటాం. కొన్నిసార్లు నిజ జీవితంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. కొద్ది రోజుల కిందట గర్ల్స్ హాస్టల్‌కి అబ్బాయిలు వచ్చిన వీడియో వైరల్ అయింది. ఇప్పుడు దీనికి పూర్తి వ్యతిరేకంగా ఓ ఘటన జరిగింది. హర్యానాలోని సోనిపత్‌లో ఉన్న ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. ఓ అమ్మాయి వీల్ బ్యాగ్‌లో దాక్కొని హాస్టల్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ సెక్యూరిటీ సిబ్బంది తెలివిగా పసిగట్టడంతో అమ్మాయి ప్లాన్ ఫెయిల్ అయింది.
Viral Video
వైరల్ వీడియోలో ఏముందంటే?
ఓ కుర్రాడు పెద్ద వీల్ సూట్‌కేస్‌ను తీసుకొని హాస్టల్‌లోకి వస్తున్నాడు. కానీ ఎంట్రెన్స్ దగ్గర సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి సూట్‌కేస్‌ను ఓపెన్ చేయించారు. సూట్‌కేస్ తెరవగానే అందులో ఓ అమ్మాయి కూర్చొని ఉంది. ఈ సీనంతా హాస్టల్‌లో ఉన్న కొందరు తమ మొబైల్‌లో రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఈ వీడియోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు అన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్టూడెంట్స్ వీడియో తీస్తుంటే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమించడం తప్పులేదు కానీ ఇలా ప్రేయసి జీవితంతో చెలగాటం ఆడడం ఎంత మాత్రం మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే సూట్‌కేస్‌లో వచ్చిన అమ్మాయి అదే యూనివర్సిటీకి చెందిన అమ్మాయో కాదో తెలియదు. వైరల్ అవుతున్న వీడియోలో అమ్మాయి ముఖం కూడా సరిగ్గా కనిపించడం లేదు. ఈ జంటపై యూనివర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకుందో తెలియదు.
ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఇప్పుడు సూట్‌కేసులు బట్టలు పెట్టుకోవడానికి కాకుండా ఇలాంటి పనులకు బాగా ఉపయోగపడుతున్నాయి. మీ హాస్టల్‌లో పెద్ద సూట్‌కేసులు పదే పదే బయటకు, లోపలికి వెళ్తుంటే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అని కామెంట్ చేశాడు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఈ వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.