ప్రపంచంలోనే పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ఈ దేశానిదే? అమెరికాదో, రష్యాదో కాదు... భారత్ బలమెంత?
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా... కానీ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ మాత్రం ఆ దేశానిది కాదు. అలాగని ఏ రష్యాదో, చైనాదో కూడా కాదు... ఓ చిన్న దేశం పాస్ పోర్ట్ ప్రపంచంలోనే పవర్ ఫుల్. ఆ దేశమేదో తెలుసా? అలాగే భారత పాస్ పోర్ట్ బలమెంత?

హెన్లీ పాస్ పోర్ట్ సూచీ 2025
India : మనం విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్, వీసా తప్పనిసరి. అయితే కొన్నిదేశాలకు పాస్ పోర్ట్ ఒక్కటి ఉంటే చాలు... వీసా లేకున్నా వెళ్లవచ్చు. మరికొన్ని దేశాలు ఇండియన్స్ కి ముందుగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడికి వెళ్ళాక తీసుకునే సదుపాయం కల్పిస్తున్నాయి... దీన్ని వీసా ఆన్ అరైవల్ అంటారు. ఇంకొన్ని దేశాలు భారతీయులకు ఇ-వీసా సదుపాయం కల్పిస్తున్నారు. అంటే ఆ దేశ ఎంబసీకి వెళ్లకుండా కేవలం ఆన్ లైన్ లో వీసా పొందవచ్చు.
మొత్తంగా కేవలం పాస్ పోర్ట్ ఉంటేచాలు... వీసా అవసరం లేకుండా భారతీయులు 59 దేశాలను వెళ్లవచ్చు. ఆయా దేశాలతో సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విదేశీ విధానాలను బట్టి భారతీయులకు ఇలా వీసా ఫ్రీ ఎంట్రీకి అవకాశం ఇస్తున్నాయి. దీంతో భారత్ శక్తివంతమైన పాస్ పోర్ట్ జాబితాల్లో మరింత మెరుగైన స్ధానం సాధించింది.
హెన్లీ పాస్ పోర్ట్ సూచీ 2025 లో భారత్ స్థానమెంత?
ప్రపంచ దేశాల పాస్ పోర్ట్స్ లో ఏది బలమైందో, ఏది బలహీనమైందో హెన్లీ పాస్ పోర్ట్ సూచీ తెలియజేస్తుంది. తాజాగా హెన్లీ పాస్ పోర్ట్ సూచీ 2025 విడుదలయ్యింది. ఇందులో గతంలో భారతీయ పాస్ పోర్ట్ 80వ స్థానంలో నిలవగా ప్రస్తుతం ఇది 77వ స్థానానికి చేరింది. అంటే భారతీయ పాస్ పోర్ట్ గతంలో పోలిస్తే మరింత శక్తివంతంగా మారిందన్నమాట.
శక్తివంతమైన పాస్ పోర్ట్స్ కలిగిన టాప్ 5 దేశాలు
1. సింగపూర్
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలు అనగానే అమెరికా, రష్యా, చైనా పేర్లు వినిపిస్తాయి. కానీ పవర్ ఫుల్ పాస్ట్ పోర్ట్స్ జాబితాలో ఈ దేశాలు వెనకబడి ఉన్నాయి. మరి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశమేదో తెలుసా?.. సింగపూర్. ఈ దేశ పౌరులు ప్రపంచంలోని ఏ దేశానికైనా ఎలాంటి ముందస్తు అనుమతి అంటే వీసా లేకుండా వెళ్లవచ్చు.. కేవలం పాస్ట్ పోర్ట్ ఉంటే చాలు.
సింగపూర్ పాస్ట్ పోర్ట్ తో 193 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణం చేయవచ్చని హెన్లీ పాస్ పోర్ట్ సూచీ-2025 ప్రకటించింది. గతంలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ వంటి దేశాలు ఈ సింగపూర్ తో పోటీపడేవి... కానీ ఈసారి వీటన్నింటిని వెనక్కినెట్టి పవర్ ఫుల్ పాస్ పోర్ట్ కలిగిన దేశాల జాబితాలో సింగపూర్ మొదటిస్థానంలో నిలిచింది.
ఈ దేశాల పాస్ట్ పోర్ట్స్ చాలా పవర్ ఫుల్..
2. జపాన్, దక్షిణ కొరియా :
హెన్లీ పాస్ పోర్ట్ సూచీ 2025 లో జపాన్, ఉత్తర కొరియా సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశ పౌరులు కేవలం పాస్ పోర్ట్ కలిగివుంటేచాలు 190 దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీకి అనుమతిస్తాయి.
3. ప్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్, ఫిన్లాండ్ దేశాలు శక్తివంతమైన పాస్ పోర్ట్ జాబితాలో మూడో స్థానంలో నిలిచాయి. ఈ దేశాలకు చెందిన పౌరులు 189 దేశాలకు వీసా లేకుండానే వెళ్లిరావచ్చు.
పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ లిస్ట్ లో అమెరికా స్థానమెంత?
4. ఆస్ట్రేలియా, బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్, నార్వే, పోర్చుగల్, స్వీడన్ దేశాల శక్తివంతమైన పాస్ పోర్ట్స్ కలిగిన దేశాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాయి.
5. న్యూజిలాండ్, గ్రీస్ ఐదోస్థానంలో నిలిచాయి. యూకే 6, అమెరికా 10 స్థానానికి పరిమితం అయ్యాయి. యూకే పాస్ పోర్ట్ పై 186, అమెరికా పాస్ పోర్ట్ పై 182 దేశాలకు వీసా లేకుండా వెళ్లిరావచ్చు. హెన్లీ పాస్ పోర్ట్ సూచీలో అప్ఘానిస్తాన్ చివరిస్థానంలో నిలిచింది... ఈ దేశ పాస్ పోర్ట్ కలిగినవారు కేవలం 25 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లవచ్చు.
భారత పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్న దేశాలివే
భారతీయ పాస్ పోర్ట్ కలిగినవారికి ప్రపంచంలోని 59 దేశాలుకు వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశం కల్పిస్తున్నాయి. ఇందులో థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, పిలిప్పిన్స్, మారిషన్, ఖతార్, మకావు, ఫిజి, లావోస్ , బార్బడోస్, బొలివియా, కుక్ ఐల్యాండ్, ఇథియోపియా, జమైకా, కజకిస్థాన్, మడగాస్కర్ వంటి దేశాలున్నాయి. ఇక మన పొరుగుదేశాలు జపాన్, భూటాన్, శ్రీలంక కూడా వీసా ఫ్రీ ఎంట్రీకి అనుమతిస్తాయి.
రష్యా, అజర్ బైజాన్, అర్మేనియా, ఉజ్జెకిస్తాన్ వంటి దేశాలు భారతీయులకు ఇ-వీసా సదుపాయం కల్పిస్తాయి. అంటే ఈ దేశ రాయబార కార్యాలయాలకు వెళ్లకుండా ఆన్ లైన్ లోనే వీసాను పొందవచ్చు. ఇక మాల్దీవ్స్, బహ్రెయిన్, ఇరాన్ వంటి దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తాయి. అంటే ఆ దేశానికి వెళ్ళాక వీసా పొందవచ్చు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హెన్లీ పాస్ పోర్ట్ సూచీ 2025 లో భారత్ ర్యాంకు మెరుగుపడింది... కానీ వీసా ఫ్రీ దేశాల సంఖ్య తగ్గింది. గతంలో భారతీయ పాస్ పోర్ట్ కలిగివున్నవారు 62 దేశాలకు వీసా లేకుండానే వెళ్లే అవకాశం ఉండేది.. కానీ ఈ జాబితాలో మూడుదేశాలు తగ్గాయి. ఇప్పుడు కేవలం 59 దేశాలకు మాత్రమే భారతీయ పౌరులు వీసా లేకుండా వెళ్లిరావచ్చు.