అమెరికా ఎన్ని రకాల వీసాలు ఇస్తుంది? ఏ పని మీద వెళ్తే ఏ వీసా జారీ చేస్తారో తెలుసా!
అమెరికా వీసాల రకాలు, అర్హతలు, గడువులు, దరఖాస్తు విధానం, గ్రీన్ కార్డ్ లాటరీ వంటి ముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

అమెరికా వీసా
ప్రపంచంలోని అత్యంత అధునాతన దేశాల్లో ఒకటైన అమెరికా వెళ్లాలనేవాళ్లు ప్రతి సంవత్సరం లక్షల్లో ఉంటారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వైద్యం, బంధువులను కలవడం వంటి అనేక కారణాలతో భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు అమెరికా ప్రయాణిస్తుంటారు. కానీ, అమెరికా వెళ్లేందుకు సరైన వీసా తీసుకోవడం తప్పనిసరి. అందులోనూ మనం వెళ్లే ఉద్దేశం, అక్కడ ఉండే కాలవ్యవధిని బట్టి వీసా రకం మారుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా వీసాలపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు రకాల వీసా
అమెరికా ప్రధానంగా రెండు రకాల వీసాలు జారీ చేస్తుంది. ఒకటి తాత్కాలిక ప్రయాణాల కోసం ఇచ్చే వలసేతర వీసాలు. రెండవది అక్కడ శాశ్వతంగా స్థిరపడే వారికి ఇచ్చే వలస వీసాలు.
తాత్కాలిక వీసాలు – ప్రయాణ, విద్య, ఉద్యోగ అవసరాలకు
B1/B2 వీసాలు
B1: వ్యాపార సమావేశాలు, కాన్ఫరెన్సులు
B2: పర్యటన, కుటుంబ కలయిక, వైద్య చికిత్స
గడువు: సాధారణంగా 10 ఏళ్ల వాలిడిటీ, ఒక్కోసారి 6 నెలల పాటు మాత్రమే అమెరికాలో ఉండే అనుమతి
రెన్యువల్: కొత్తగా దరఖాస్తు చేయాలి
F1 వీసా (విద్యార్థుల కోసం)
ఉద్దేశం: అమెరికాలో ఫుల్ టైమ్ కోర్సు చదవడం
అవసరమైన పత్రం: ఐ-20 ఫారం (అమెరికా విద్యాసంస్థల నుండి)
వీసా గడువు: కోర్సు ముగిసే వరకు + OPT (Optional Practical Training) అవకాశం
H1B వీసా (ఉద్యోగం కోసం)
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అనుభవం
అవసరం: అమెరికా కంపెనీ నుంచి ఆఫర్ లెటర్
లాటరీ: ఏటా కేవలం 85,000 మందికే లాటరీ ద్వారా
గడువు: 3 సంవత్సరాలు, గరిష్టంగా 6 సంవత్సరాలు
L1 వీసా ..J1 వీసా
L1 వీసా (కంపెనీ అంతర్గత బదిలీకి)
L1A: మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌లకు – గరిష్టంగా 7 ఏళ్లు
L1B: స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉన్నవారికి – గరిష్టంగా 5 ఏళ్లు
అవసరం: కంపెనీలో కనీసం 1 సంవత్సరం పనిచేసి ఉండాలి
J1 వీసా (ఎక్స్చేంజ్ విజిటర్ వీసా)
ఉద్దేశం: విద్యా, శిక్షణ, పరిశోధన
అర్హత: యుఎస్ ప్రభుత్వం గుర్తించిన ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లో చేరాలి
గడువు: 18 నెలల నుంచి ఇంకా పొడిగించుకునే అవకాశం
వలస వీసాలు – శాశ్వత నివాసం కోసం (Green Card)
కుటుంబ ఆధారిత వీసాలు
అమెరికా పౌరులు, గ్రీన్ కార్డు హోల్డర్లు తమ జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులను స్పాన్సర్ చేయవచ్చు
ఉద్యోగ ఆధారిత వీసాలు (EB1 – EB5)
EB1: అసాధారణ ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు
EB2: హయ్యర్ డిగ్రీలు ఉన్నవారు, ప్రత్యేక నైపుణ్యం కలవారు
EB3: స్కిల్డ్ వర్కర్లు
EB4: మతపరమైన సేవకులు
EB5: కనీసం $5 మిలియన్ పెట్టుబడి పెట్టే వారు – గోల్డ్ కార్డ్ (2025 ట్రంప్ పాలసీ)
డైవర్సిటీ లాటరీ వీసా
తక్కువ వలస వెళ్తున్న దేశాల పౌరులకు మాత్రమే
భారత్‌కు ఇది వర్తించదు
వీసా దరఖాస్తు ఎలా?
DS-160 ఆన్‌లైన్ ఫారం నింపాలి
వీసా ఫీజు చెల్లించాలి
ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి
అవసరమైన పత్రాలు:
పాస్‌పోర్ట్
ఫోటోలు
ప్రయాణ వివరాలు
ఆర్థిక ఆధారాలు
విద్య/ఉద్యోగ ధృవీకరణ పత్రాలు