Government Jobs : కేవలం ఇంటర్ పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం.. నెలనెలా రూ.1,77,500 సాలరీ..!
Government Jobs : నెలనెలా లక్షల జీతంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మీకు అన్ని అర్హతలు, ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేసుకొండి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Government Jobs : భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ (Inland Waterways Authority of India)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఎల్‌డీసీ, సర్వేయర్‌తో సహా మొత్తం 14 ఖాళీల భర్తీకి ప్రకటన వెలువవడింది. ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగి నోటిఫికేషన్ లో పేర్కొన్న అన్ని అర్హతలు కలిగివుంటే వెంటనే అప్లై చేసుకోవచ్చు.
భర్తీచేసే ఉద్యోగాలు, విద్యార్హతలు, వయోపరిమితి
12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులున్నాయి. మొత్తం 4 ఖాళీలున్నారు. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇప్పటికే ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండటమే కాదు టైపింగ్ స్కిల్స్ కలిగివుండాలి. వయస్సు 27 ఏళ్లు మించకూడదు.
డిగ్రీ అర్హతతో జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ - 9 పోస్టులు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ - 1 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి... వీటిని భర్తీచేయనున్నారు. వీటికి కూడా వయోపరిమితి 27 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్లు కలిగినవారికి వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 07 అక్టోబర్ 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 05 నవంబర్ 2025
దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఉండదు. ఇతరులకు రూ.500 ఫీజు ఉంటుంది.
పోస్టులను బట్టి CBT (కంప్యూటర్ బెస్డ్ టెస్ట్), స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది.
సాలరీలు
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) : నెలకు రూ.19,900 నుండి రూ. 63,200 వరకు సాలరీ ఉంటుంది. ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.
జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ : రూ.1,12,400 సాలరీ, ఇతర అలవెన్సులు ఉంటాయి.
సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ : రూ.1,77,500 సాలరీతో పాటు ఇతర అతవెన్సులు ఉంటాయి.