- Home
- National
- Foxconn: భారత్‌లో మరో భారీ పెట్టుబడి.. 300 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తున్న ఫాక్స్‌కాన్. ఎక్కడో తెలుసా?
Foxconn: భారత్‌లో మరో భారీ పెట్టుబడి.. 300 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తున్న ఫాక్స్‌కాన్. ఎక్కడో తెలుసా?
భారతదేశంలో మరో భారీ పెట్టుబడికి ముందడుగు పడుతోంది. తైవాన్‌కు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ భారత దేశంలో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఏకంగా 300 ఎకరాల భూమిని కొనుగోలు చేయనుంది. ఇంతకీ ఈ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.? ప్లాంట్‌లో ఏం తయారు చేయనున్నారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
అమెరికా, చైనాల మధ్య మొదలైన ట్రేడ వార్ భారత్‌కు కలిసొస్తుందా.? అంటే పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. వీటికి బలం చేకూర్చుతూ.. యాపిల్‌కు భాగస్వామిగా పనిచేసే ప్రముఖ తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ త్వరలో భారత్‌లో మరో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.
Foxconn
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా వద్ద యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో 300 ఎకరాల భూమిని కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ విషయాన్ని ఏప్రిల్ 14న ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ ప్లాంట్ ఉత్తర భారతదేశంలో ఫాక్స్‌కాన్‌కు ఇది మొదటిది. అయితే ఇప్పటికే బెంగళూరులో ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ నిర్మాణంలో ఉంది. బెంగళూరు ప్లాంట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్దగా మారబోతోంది.
ఇండియాలో సప్లైచైన్‌ను ఏర్పాటుచేసేందుకు ఫాక్స్‌కాన్, యాపిల్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. చైనాపై అమెరికా తదితర దేశాలు విధిస్తున్న టారిఫ్‌లను తప్పించుకోవడమే వీరి ఉద్దేశంగా భావిస్తున్నారు. అయితే గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌లో ఏ వస్తువులు తయారవుతాయనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.
ఈ భూమి హెచ్‌సిఎల్-ఫాక్స్‌కాన్ సెమీ కండక్టర్ అసెంబ్లీ ప్లాంట్ వద్దకు దగ్గరలోనే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే జేవార్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో 50 ఎకరాల భూమిని కేటాయించింది. గత మార్చిలో భారత సెమీకండక్టర్ మిషన్ (ISM) మొదటి దశలో పెండింగ్‌లో ఉన్న కొన్ని ప్రాజెక్టులకు మంజూరు దశలో ప్రభుత్వం ఉందని వార్తలు వచ్చాయి.