MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏకంగా 16 రోజులు హాలిడేస్.. ఫుల్ లిస్ట్ ఇదిగో

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏకంగా 16 రోజులు హాలిడేస్.. ఫుల్ లిస్ట్ ఇదిగో

Bank Holidays: వచ్చే దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు, వారాంతపు లీవ్‌లతో అక్టోబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. ఆర్‌బీఐ విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో పండుగలను బట్టి 15 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 30 2026, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అక్టోబర్ నెలలో ఏకంగా 15 రోజులు బ్యాంకులు బంద్
Image Credit : chatgpt

అక్టోబర్ నెలలో ఏకంగా 15 రోజులు బ్యాంకులు బంద్

అక్టోబర్ నెలలో దసరా, దుర్గాపూజ, గాంధీ జయంతి వంటి పెద్ద పండుగలు వరుసకట్టాయి. పండుగల హడావుడితో పాటు బ్యాంక్ పనులు కూడా చాలా మందికి ఉంటాయి. అయితే ఈ అక్టోబర్‌లో బ్యాంకులకు వెళ్లి పనులు పూర్తి చేసుకోవాలనుకునే వారికి ఒక ముఖ్యమైన అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 2026లో శని, ఆదివారాలు, పండుగల సెలవులతో కలిపి మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూసివుండనున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి ఈ సెలవులలో మార్పులు కూడా ఉంటాయి.

మరి ఏ ఏ రోజుల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి? ఏపీ,తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవుల వివరాలు ఏంటి? డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయా లేదా? అనే వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణ, ఏపీలో వరుసగా బ్యాంక్ సెలవులు
Image Credit : Getty

తెలంగాణ, ఏపీలో వరుసగా బ్యాంక్ సెలవులు

ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో అక్టోబర్ నెలలో వచ్చే ప్రధాన సెలవులు చాలానే ఉన్నాయి. బ్రాంచ్‌కు వెళ్లే ముందు ఈ తేదీలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

• అక్టోబర్ 2 (శుక్రవారం): మహాత్మా గాంధీ జయంతి (దేశవ్యాప్తంగా జాతీయ సెలవు)

• అక్టోబర్ 4 (ఆదివారం): వారంతపు సెలవు

• అక్టోబర్ 10 (రెండో శనివారం): బ్యాంకులకు సాధారణ సెలవు

• అక్టోబర్ 11 (ఆదివారం): వారంతపు సెలవు (బతుకమ్మ పండుగ ప్రారంభం)

• అక్టోబర్ 18 (ఆదివారం): వారంతపు సెలవు

• అక్టోబర్ 19 (సోమవారం): మహా అష్టమి / దుర్గాపూజ / దసరా సెలవు (పలు ప్రాంతాల్లో)

• అక్టోబర్ 20 (మంగళవారం): దసరా / విజయదశమి (దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో బంద్)

• అక్టోబర్ 21 (బుధవారం): విజయదశమి / దుర్గాపూజ (పలు ప్రాంతాల్లో)

• అక్టోబర్ 24 (నాలుగో శనివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు మూసివేత

• అక్టోబర్ 25 (ఆదివారం): వారంతపు సెలవు

35
దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతీయ సెలవులు
Image Credit : Gemini

దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతీయ సెలవులు

బ్యాంక్ సెలవులు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. ప్రాంతీయ పండుగలను బట్టి ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఆర్బీఐ సెలవులను ప్రకటిస్తుంది.

• అక్టోబర్ 17: మహా సప్తమి సందర్భంగా అగర్తలాలో సెలవు.

• అక్టోబర్ 22, 23: దుర్గాపూజ / దసైన్ పండుగ వల్ల గ్యాంగ్‌టక్‌లో వరుసగా రెండు రోజులు బ్యాంకులు బంద్.

• అక్టోబర్ 26: లక్ష్మీపూజ, మహర్షి వాల్మీకి జయంతి, యాక్సెసిబిలిటీ డే సందర్భంగా జమ్మూ, శ్రీనగర్, చండీగఢ్, సిమ్లా, అగర్తలాలో సెలవు.

• అక్టోబర్ 29: కర్వా చౌత్ సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు.

• అక్టోబర్ 31: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో బ్యాంకులు పనిచేయవు.

45
డిజిటల్ బ్యాంకింగ్ సూపర్ హిట్.. నో టెన్షన్
Image Credit : ChatGPT

డిజిటల్ బ్యాంకింగ్ సూపర్ హిట్.. నో టెన్షన్

పండుగల సీజన్ కావడంతో బ్యాంకులకు సెలవులు ఎక్కువగానే ఉన్నాయి. కానీ, సాధారణ కస్టమర్లు అసలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. బ్రాంచ్ తలుపులు మూసి ఉన్నప్పటికీ డిజిటల్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి.

• యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ సేవలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ యథావిధిగా పనిచేస్తాయి.

• నెట్ బ్యాంకింగ్: ఆన్‌లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం, బిల్లులు చెల్లించడం వెంటనే పూర్తవుతాయి.

• ఏటీఎంలు: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎం సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.

55
ఈ పనులు ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి
Image Credit : getty

ఈ పనులు ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి

ఆన్‌లైన్ సేవలు పనిచేసినా, కొన్ని ప్రత్యక్ష బ్రాంచ్ పనులకు మాత్రం ఆటంకం కలగవచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కి నేరుగా వెళ్లి చేయాల్సిన పనులను ముందే ప్లాన్ చేసుకోవడం బెస్ట్.

• పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్

• డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీయడం

• బ్యాంక్ లాకర్ యాక్సెస్ చేయడం

• కేవైసీ (KYC) అప్‌డేట్, చెక్ క్లియరింగ్ పనులు

చెక్ క్లియరింగ్ వంటి సేవల్లో సెలవుల వల్ల కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మీ ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ పనులను పైన పేర్కొన్న హాలిడే లిస్ట్ ఆధారంగా ముందే పూర్తి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
October 1 Rule Changes: ఎల్పీజీ సబ్సిడీ నుంచి ఎస్‌బీఐ ఏటీఎం వరకు.. అక్టోబర్ 1 నుంచి మారనున్న టాప్ 10 రూల్స్
Recommended image2
Gold Price Hike: కొంపముంచిన పసిడి.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం...కొనుగోలుదారులకు షాక్
Recommended image3
Diwali Gold Buying: దీపావళికి బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టపోతారు
Related Stories
Recommended image1
October 1 Rule Changes: ఎల్పీజీ సబ్సిడీ నుంచి ఎస్‌బీఐ ఏటీఎం వరకు.. అక్టోబర్ 1 నుంచి మారనున్న టాప్ 10 రూల్స్
Recommended image2
APPSC: ఏపీపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఓటీపీఆర్ అప్‌డేట్ స్టార్ట్.. ఎలా చేసుకోవాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved