MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Petrol Price : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. ఒకటి రెండు కాదు ఏకంగా 30 శాతమా..?

Petrol Price : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. ఒకటి రెండు కాదు ఏకంగా 30 శాతమా..?

టెక్నాలజీ గొప్పదే… కానీ సమస్య ఏంటంటే మెజారిటీ జనాలు గొర్రెలు. తెలివైనోడు టెక్నాలజీ ఉపయోగించి గొర్రెల్ని మరింత దారుణంగా దోచేస్తున్నాడు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపులో కూడా అదే జరుగుతోంది. 

4 Min read
Author : Amarnath Vasireddy
Published : Mar 21 2026, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మనం ఎటుపోతున్నాం...
Image Credit : ChaGPT

మనం ఎటుపోతున్నాం...

"శక్తి " హీనులం కాదు ...

"శక్తి " వంతులు కావాలి..!

మరో నాలుగు వారాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు... 25-30 % పెరిగే అవకాశం.

వంట గాస్ సంక్షోభం ... కనీసం సంవత్సరం దాక కొనసాగే పరిస్థితి !

ఎవరో జ్వాలను రగిలించారు.. మనందరం దానికి బలి అయిపోయాము..!

కాలం వెనక్కు వెళ్ళదు..

కానీ....

బతుకు పాఠం నేర్వాలంటే వెనక్కు ఒకసారి చూడాలి.

వందేళ్ల క్రితం ..

1. దొడ్లో ఆవులు, గేదెలు, గొర్రెలు.. వాటి పేడ పొలానికి ఎరువు... పిడకలు పాలు కాయడం లాంటివాటికి ఇంధనంగా...

2. ఊరి శివారుల్లో పొలం : పక్కనే చెరువు/ బావి/ కాలువ .. సేద్యానికి నీరు. చాలా చోట్ల మెట్ట పంటలు.

3. పొలంలో పండిన పంటలు .. అదే పొలం / దగ్గర్లో ఉన్న అడవినుంచి... సేకరించిన కట్టెలు / వంట చెరకు .. ఇంట్లో కట్టెల పొయ్యి .. వంట..

మరి ఇప్పుడో..?

25
తిండిలోనూ ఫ్యాషనే..
Image Credit : Pinterest

తిండిలోనూ ఫ్యాషనే..

కొర్రలు... అందు కొర్రలు .. అంటే "ఆమ్మో" అంటాము.

అదే ఓట్స్ అంటే "వావ్ .. హెల్ది బ్రేక్ఫాస్ట్" అంటాము.

కొర్రలు, సామలు.. అందు కొర్రలు.. మన పొలాల్లో పెద్దగా సాగు నీరు లేక పోయినా పండుతాయి.

అదే ఓట్స్ అయితే ఆస్ట్రేలియా/యుక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకోవాలి.

రాగులు జొన్నలు తింటే అనాగరికం. అదే ఇంపోర్ట్ చేసుకొన్న క్వినోవా తింటే హ్యాపెనింగ్..!

వారేవా .. ఏమి ఫేసు..!

రిఫైన్డ్ నూనెలు తింటే కాన్సర్ వస్తుంది అని ఒక డాక్టర్ గారు ఏడుస్తూ చెబుతున్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

యాభై ఏళ్ళ క్రితం ప్రతి ఊళ్ళో గానుగ. మెట్ట పొలాల్లో సైతం పండే వేరుశనిగ, నువ్వులు.. గానుగ నూనెలు.

ఇప్పుడు..? ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకొనే పాముల నూనె.. సారీ స్పెల్లింగ్ మిస్కెట్ .. పామ్ ఆయిల్.

రిఫైన్డ్ అయిపోయిన బతుకులు.

తిండిలో కూడా ఫ్యాషన్స్..

తెల్లన్నము నీకు లైకు ..

అది బాడీకి ఫామిలీ ప్యాకు..

నలబై ఏళ్లకే పడిపోదా బండికి బ్రేకు..??

Related Articles

Related image1
Cheapest Petrol : 55 పైసలకే డీజిల్, 2 రూపాయలకే పెట్రోల్.. ఈ దేశాల్లో ఫ్యూయల్ చాక్లెట్ కంటే చీఫ్ గురూ..!
Related image2
Petrol Price: దేశంలో పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధ‌ర‌లు.. ఏంటీ ప్రీమియం, సాధార‌ణ పెట్రోల్‌కి దీనికి తేడా ఏంటి.?
35
నిలకడ లేనిది అసలు అభివృద్ధి కాదు
Image Credit : Getty

నిలకడ లేనిది అసలు అభివృద్ధి కాదు

ఎక్కడో పండిన పంటలు .. మనకు చేరాలంటే... ఓడలు .. వాటికి ఇంధనం.

అక్కడితో ఆగిందా..?

ఇరవై ఏళ్ళ క్రితం దాక .. బ్రహ్మచారులు కూడా స్వయం పాకం. ఇప్పుడో..?

ఫ్యామిలీస్ ఫ్యామిలీస్.. స్విగ్గి జొమాటోపై పడి బతికేస్తున్నారు.

నువ్వు ఆర్డర్ ఇచ్చిన బోడి... ఒకటి రెండు ఐటమ్స్ ను హోటల్ నుండి తేవడానికి ఒక వ్యక్తి.

అతనికో యూనిఫామ్.

బైక్...

దానికి పెట్రోల్.

అది చిమ్మే పొగలు.

నువ్వు ఆర్డర్ ఇచ్చిన ఒక బిర్యానీ ప్యాకెట్ ను... నీ ఇంటికి తేవడానికి లీటర్ పెట్రోల్/డీజిల్ ఆవిరి .

రోడ్డుపై అర్థరాత్రి అయినా ఆగని ట్రాఫిక్ జామ్స్.

ఏమి బతుకు రా అయ్యా..??

అభివృద్ధి సరే .. అది నిలకడైందా..?

నిన్నటి దాక ఇదొక చర్చ.

ఇప్పుడు ఇక అప్షన్స్ లేదు.

ప్రతి సంక్షోభం ఒక అవకాశం.

ప్రకృతి కరెక్ట్ చేస్తోంది.

బతకడం ఇలా కాదు అని హెచ్చరిస్తోంది.

ఎవడో ప్లాన్ వేసి.. వాడి బిజినెస్ కోసం నీ బ్రెయిన్ వాష్ చేసి ఇదే అభివృద్ధి అని నిన్ను నమ్మించాడు.

నిలకడ కానిది అభివృద్ధి కాదు అని ప్రకృతి హెచ్చరిస్తోంది.

గ్లోబల్ స్థాయిలో నెలకొన్న ఎనర్జీ క్రైసిస్.

ధరలు పెరిగితే .. వినియోగం తగ్గించాలి.

లేకపోతే కొంప... గల్ఫ్ అయిపోతుంది.

45
ఇకనైనా మారదాం..
Image Credit : Social Media

ఇకనైనా మారదాం..

1 . ఇప్పటిదాకా పొలం ధర కోటి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూపు.

పంట పొలాల్ని ముక్కలు చేసి... రాతి కూసాలు.. ఇనుప తీగలతో బంధీ చేస్తున్న వైనం.

బీడు పొలాల్లో.. రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో... త్వరగా పెరిగే చెట్లు .. సుబాబుల్ .. మల్బర్రి , హిక్కోరి , ఆష్... యూకలిప్టస్ లాంటి చెట్లను పెంచాలి .

ఇవి త్వరగా ఎదిగి వంట చెరకుగా పనికొస్తాయి .

నిరుపయోగంగా పడున్న భూమి నుంచి ఆదాయమొస్తుంది.

2 . గ్రామాల్లో, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న చిన్న పట్టణాల్లో ... కట్టెల పొయ్యి .. బొగ్గు పొయ్యి ... తిరిగీ వినియోగం లోకి తేవాలి.

పట్టణాల్లో అపార్ట్మెంట్ లలో ఇది సాధ్యమా ?

మనసుంటే మార్గముంటుంది.

అవసరం మనిషిని నడిపిస్తుంది .

గ్యాస్ సిలిండర్ లేదని ఆకలి చావులు చస్తామా..?

ఒక్కో అపార్ట్మెంట్ కు సామూహిక వంట ఏర్పాట్లు. అక్కడ కట్టెల పొయ్యితో అన్నం.. సాంబార్.. వెజ్ ఫ్రై.. రసం... పెరుగు.

ఒక్కో ఫ్లాట్ లో సభ్యుల సంఖ్య బట్టి ఖర్చు .. అందరిదీ..

ఏవైనా స్పెషల్ డిషెస్ కావాలంటే ఎవరి ఫ్లాట్స్ లో వారు చేసుకోవచ్చు.

3. మరి స్విగ్గి జొమాటో లు ఏమై పోవాలి..?

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దొరక్క పొతే..? పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగితే..? ఇప్పుడు రూ.400 కు దొరుకుతున్న బిర్యానీ రూ.1000 అయితే .. ఎంత మంది ఆర్డర్ ఇస్తారు?

డెలివర్ బాయ్స్ .. పాపం.

కానీ ఈ ఫుడ్ ఆర్డర్స్ వల్ల మహమ్మారిలా విస్తరిస్తున్న కాన్సర్ ల మాటేంటి..?

కృతిమ రంగులు.. రసాయన రుచులు.. మైక్రో ప్లాస్టిక్కులు.

పిచ్చి పట్టినట్టు ఫుడ్ ఆర్డర్స్ చేసి రీల్స్ తో కాలక్షేపం చేసే జనాలు.

మహిళా సాధికారికతకు దీనికి సంభంధం ఉందా..?

మగాడు వంట చేస్తే చస్తడా..?

మహామహా చెఫ్స్ .. నలుడు భీముడు మగాళ్లే కదా..?

55
ఇంధన కొరతకు చెక్ పెట్టండిలా..
Image Credit : Pinterest

ఇంధన కొరతకు చెక్ పెట్టండిలా..

4. సోలార్ ఎనర్జీ వాడకం పెరగాలి... భారీగా పెరగాలి. వీలున్న చోటల్లా ఇంటి పైన సోలార్ ప్లాంట్స్ రావాలి.

5. గ్రామాల్లో గోబర్ గాస్ వినియోగం.... పట్టణాల్లో అవసరమున్న చోట్ల పైపెడ్ నాచురల్ గ్యాస్.

6. ప్రతోడికి ఒక బైక్ .. ఒక కారు. అదొక స్టేటస్ సింబల్.

జనాల్ని ఆలా బ్రెయిన్ వాష్ చేసేసారు.

బ్యాంకులు లోన్ లు ఇస్తాయి. కారులైతే కొనేశారు... మరి ఇప్పుడు పెట్రోల్ కొనడానికి ఎవరు లోన్స్ ఇస్తారు..?

సరే... ఇన్ని రోజులు గడిచింది.

ఇప్పుడు మాస్ ట్రాన్స్పోర్ట్ వైపు మొగ్గు చూపాలి.

ఒక బస్సులో నలబై మంది. అదే నలభై మంది నలభై కారుల్లో అయితే... రోడ్డు పై రద్దీ ఎంత? ఇంధనం వినియోగం ఎంత?

మెట్రో రైలు.. రైలు.. బస్సు వైపు వెళ్ళాలి.

7. అనవసర ప్రయాణాలు .. లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్.. లాంటివి తగ్గించుకోవాలి.

8. మనం తినే తిండి.. వేసుకొనే బట్టలు.. వినియోగించే వస్తువులు.. ఒకసారి సమీక్షించుకోవాలి. స్ధానికంగా ఉత్పత్తి అయ్యే వస్తువుల వైపు మొగ్గు చూపాలి.

ముప్పై అయిదేళ్ల క్రితం ప్రపంచీకరణ మొదలయ్యింది.

దీని వల్ల కలిగిన లాభాలు ఎన్నో.. నిజమే ..

కానీ కష్టాలు .. నష్టాలు... అపారం ..

అన్నింటికీ మించి ఇది నిలకడలేనిది అని నేటి ఎనర్జీ క్రైసిస్ తేల్చేసింది.

ఇరాన్ వాడు.. సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్ నెట్ కేబుల్స్ ను కోసేస్తాడట.

బాబ్బాబూ !.. ఆ పని చేసి పుణ్యం కట్టుకోరా..!

జనాలకు పట్టిన స్మార్ట్ ఫోన్... రీల్స్... ఓటిటి పిచ్చి... వదిలిపోతుంది.

టెక్నాలజీ గొప్పదే.. కానీ సమస్య ఏంటంటే ..

మెజారిటీ జనాలు గొర్రెలు.

తెలివైనోడు టెక్నాలజీ ఉపయోగించి గొర్రెల్ని మరింత మరింత దారుణంగా దోచేస్తాడు.

కరోనా సంక్షోభంతో జనాలకు కనువిప్పు కలుగుతుంది అనుకొన్నా..

కానీ జరిగింది సరిగ్గా బిన్నం.

ఇప్పుడు ....పెట్రోల్ ధరలు పెరిగితే?... గ్యాస్ దొరక్క పొతే ?.. గల్ఫ్ ఉద్యోగం .. స్విగ్గి ఓలా ఉద్యోగం ఊడితే .. ఎలారా భగవంతుడా ? ఈ సంక్షోభం రాకుండా చూడు!

అని మెజారిటీ అనుకొంటున్న సమయంలోనే ..

ఈ సంక్షోభాన్ని ఇంకా ముదరపెట్టి... కృతిమ కొరతలు సృష్టించి.. కోట్లు ఎలా దండుకోవాలి అని ప్లాన్స్ వేసుకొంటున్న కేటు బిజినెస్ గాళ్ళు ఎంతమందో.

నీ అభిమాన నాయకుడు.. పార్టీ.. వాడి వైపే నిలుస్తుంది . ఎందుకంటే వాడి దగ్గర డబ్బుంది .

సంక్షోభం నుంచి కూడా వాడు తివిరి తైలం తీస్తాడు .

కరోనా .. లక్షలు పలికిన సోది మందు.. కృతిమ కొరత .. అటు పై గొడవున్ల నిండా నోట్ల కట్టలు.. వాటితో .. గౌరవం .. గుర్తొచ్చిందా..?

నీ కుశాగ్ర బుద్ధే నీకు రక్ష .

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
భారత దేశం
ప్రపంచం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission : ఉద్యోగుల జీతాలు డబుల్.. ఎంత పెరుగుతుందో తెలుసా?
Recommended image2
Interesting Facts : ఏమిటీ.. ఇక్కడ వజ్రాల వర్షం కురుస్తుందా..!
Recommended image3
Summer Holidays : ఈ వేసవి సెలవుల్లో పిల్లలతో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? టాప్ 5 కూల్ డెస్టినేషన్స్ ఇవే
Related Stories
Recommended image1
Cheapest Petrol : 55 పైసలకే డీజిల్, 2 రూపాయలకే పెట్రోల్.. ఈ దేశాల్లో ఫ్యూయల్ చాక్లెట్ కంటే చీఫ్ గురూ..!
Recommended image2
Petrol Price: దేశంలో పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధ‌ర‌లు.. ఏంటీ ప్రీమియం, సాధార‌ణ పెట్రోల్‌కి దీనికి తేడా ఏంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved