MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • INDIA Bloc Protest: సీజేఐ నో చెప్పినా ఆగని ఇండియా కూటమి నిరసనలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?

INDIA Bloc Protest: సీజేఐ నో చెప్పినా ఆగని ఇండియా కూటమి నిరసనలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?

INDIA Bloc Protest: దేశరాజధానిలో హై అలర్ట్ నెలకొంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీలో ఇండియా కూటమి సుప్రీంకోర్టు మార్చ్ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీజేఐ అనుమతి నిరాకరించినా కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 12 2026, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియా కూటమి సుప్రీం మార్చ్.. ఢిల్లీలో హైఅలర్ట్
Image Credit : Asianet News

ఇండియా కూటమి సుప్రీం మార్చ్.. ఢిల్లీలో హైఅలర్ట్

ఢిల్లీలో ఇండియా కూటమి నాయకులు సుప్రీంకోర్టు వరకు పెద్ద ఎత్తున మార్చ్ కు సిద్ధమయ్యారు. 24 అక్బర్ రోడ్ వద్ద ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఈ మార్చ్‌లో పాల్గొనేందుకు ఉదయం నుంచే వివిధ రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుంటున్నారు.

అయితే, ఇండియా కూటమి నాయకులు, నేతలతో భేటీకి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నో చెప్పారు. విపక్షాలు లేవనెత్తాలనుకుంటున్న అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ, ప్రజలు పెద్ద ఎత్తున ఈ మార్చ్‌లో పాల్గొనాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భద్రతా చర్యలు.. మెట్రో స్టేషన్ల మూసివేత
Image Credit : Asianet News

భద్రతా చర్యలు.. మెట్రో స్టేషన్ల మూసివేత

ఇండియా కూటమి మార్చ్ దృష్ట్యా ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ మెట్రో రెల్ కార్పొరేషన్ (DMRC) సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరు ముఖ్యమైన మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసింది. పటేల్ చౌక్, జనపత్, రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియేట్, బరాఖంబా రోడ్ స్టేషన్లు ఇందులో ఉన్నాయి.

మరోవైపు, కన్నాట్ ప్లేస్, జంతర్ మంతర్, మండి హౌస్ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలను భారీగా మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశారు.

35
రాహుల్ గాంధీ ప్రెస్ మీట్.. మల్లికార్జున ఖర్గే పిలుపు
Image Credit : ANI

రాహుల్ గాంధీ ప్రెస్ మీట్.. మల్లికార్జున ఖర్గే పిలుపు

ఈ భారీ నిరసన ప్రదర్శనకు ముందు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ 'చలో ఢిల్లీ' మార్చ్‌లో పాల్గొనాలని ఆయన ఆదివారం సోషల్ మీడియా నుంచి కోరారు.

మరోవైపు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్యాహ్నం 1 గంటకు కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో అందరూ సమావేశం కావాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు కర్ణాటక భవన్, హిమాచల్ భవన్, నేతల నివాసాలలో సమావేశమై వ్యూహాలు చర్చించారు.

45
ప్రతిపక్ష ముఖ్యమంత్రులు.. నేతల తీవ్ర విమర్శలు
Image Credit : Asianet News

ప్రతిపక్ష ముఖ్యమంత్రులు.. నేతల తీవ్ర విమర్శలు

ఈ నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మాట్లాడుతూ, ప్రజల గొంతును ఎట్టి పరిస్థితుల్లోనూ వినాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీజేఐని ఆశ్రయించడం మినహా తమకు వేరే మార్గం లేదని, దేశంలో ఓటు హక్కును కాపాడుకునేందుకు పోరాటం ఆగదని చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ మాట్లాడుతూ, గత రెండేళ్లుగా కాంగ్రెస్ ఈ అంశంపై గళం విప్పుతోందని, బీజేపీ ఓట్లను చోరీ చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటోందని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా మాట్లాడుతూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

55
సీజేపీ న్యాయపోరాటం
Image Credit : Asianet News

సీజేపీ న్యాయపోరాటం

మరోవైపు, కాక్రోచ్ జనత పార్టీ (CJP) నేతలు మాట్లాడుతూ.. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు పోలీసుల అనుమతి కోరనున్నట్లు తెలిపారు. లేనిపక్షంలో మళ్లీ ఆందోళన చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. అలాగే, జంతర్ మంతర్‌ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ అమిత్ మహాజన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రాహుల్ గాంధీ
నరేంద్ర మోదీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi: ఇది మ‌నం కోరుకునే భార‌త్ కాదు.. రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image2
CJP Protest: ఢిల్లీ నిరసనల నేపథ్యంలో.. కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Recommended image3
Elon Musk: ముఖేష్ అంబానీని ప్ర‌ధానితో పోల్చిన మ‌స్క్‌.. అస‌లేంటీ వివాదం.?
Related Stories
Recommended image1
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్ ప్రత్యేకతలు ఇవే
Recommended image2
రూ.12 వేలకే 5G ఫోన్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. ఫ్లిప్‌కార్ట్ ధమాకా డీల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved