Highest Female Population Countries: ఈ దేశాల్లో పురుషులు తక్కువ.. మహిళలు ఎక్కువ !
Top 10 Countries with More Women Than Men: పురుషుల కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. అయితే, పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి. అలాంటి టాప్ 10 దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉక్రెయిన్
రష్యాతో యుద్ధం ప్రారంభమయ్యే ముందు ఉక్రెయిన్ జనాభాలో ఎక్కువ మంది మహిళలు ఉన్న టాప్ 10 దేశాలలో ఒకటిగా ఉంది. యుద్ధం కారణంగా పెద్ద సంఖ్యలో ఉక్రేనియన్ సైనికులు మరణించారు. దీంతో ఇక్కడ మహిళలు, పురుషుల జనాభాలో వ్యత్యాసం మరింత పెరిగింది. 2019లో ఉక్రెయిన్‌లో మహిళలు జనాభాలో 53.67% మంది ఉన్నారు. 2021లో ఇక్కడ ప్రతి 100 మంది మహిళలకు 86.33 మంది పురుషులు ఉన్నారు.
2. రష్యా
ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమయ్యే ముందు రష్యాలో మహిళల కంటే పురుషుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే, యుద్ధంలో వేలాది మంది రష్యన్ సైనికులు మరణించారు. దీని కారణంగా పురుషుల జనాభా మరింత తగ్గింది. 2021లో ఒక నివేదిక ప్రకారం రష్యాలో ప్రతి 100 మంది మహిళలకు 86.8 మంది పురుషులు ఉన్నారు.
3. నేపాల్
భారతదేశ పొరుగు దేశమైన నేపాల్‌లో ప్రతి 100 మంది మహిళలకు కేవలం 84.55 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ జనాభాలో మహిళల భాగం 54.19% ఉంది. 2019లో నేపాల్ జనాభా 29,137,000. ఇందులో 1.57 కోట్లకు పైగా మహిళలు, 1.33 కోట్లకు పైగా పురుషులు ఉన్నారు.
4. హాంకాంగ్
2019లో హాంకాంగ్‌లో మహిళల జనాభా నిష్పత్తి 54.12%గా నమోదైంది. 2021 నివేదిక ప్రకారం ఇక్కడ ప్రతి 100 మంది మహిళలకు దాదాపు 84.48 మంది పురుషులు నివసిస్తున్నారు.
5. కురాకావో
కురాకావోలో నివసించే ప్రతి 100 మంది మహిళలకు కేవలం 92 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. 2019లో ఈ దేశ మొత్తం జనాభా 1.64 లక్షలకు పైగా ఉంది. ఇందులో దాదాపు 89 వేల మంది మహిళలు, 75 వేల మంది పురుషులు ఉన్నారు.
6. మార్టినిక్
మార్టినిక్ దేశంలో 2021లో మహిళా-పురుష నిష్పత్తి 100 మంది మహిళలకు దాదాపు 85.01 మంది పురుషులుగా ఉన్నారు. 2019 నివేదిక ప్రకారం ఇక్కడ జనాభా 3.75 లక్షలకు పైగా ఉంది. ఇందులో దాదాపు 2 లక్షల మంది మహిళలు ఉన్నారు.
7. లాట్వియా
లాట్వియా జనాభాలో 53.91% మంది మహిళలు ఉన్నారు. 2019లో ఇక్కడ జనాభా దాదాపు 1,886,000. ఇందులో దాదాపు 1,017,000 మంది మహిళలు, 869,000 మంది పురుషులు ఉన్నారు.
8. గ్వాడెలూప్
2019లో గ్వాడెలూప్‌లో దాదాపు 53.88% మంది మహిళలు ఉన్నారు. 2019లో ఇక్కడ జనాభా దాదాపు 4 లక్షలు. ఇందులో 2.16 లక్షల మంది మహిళలు, 1.85 లక్షల మంది పురుషులు ఉన్నారు. 2021 నివేదిక ప్రకారం ఇక్కడ ప్రతి 100 మంది మహిళలకు దాదాపు 89.2 మంది పురుషులు ఉన్నారు.
9. లిథువేనియా
2019లో లిథువేనియా జనాభాలో దాదాపు 53.72% మంది మహిళలు ఉన్నారు. 27.22 లక్షలకు పైగా జనాభాలో 14.62 లక్షల మంది మహిళలు, 12.60 లక్షల మంది పురుషులు ఉన్నారు. 2021 నాటికి ఇక్కడ ప్రతి 100 మంది మహిళలకు 86.18 మంది పురుషులు ఉన్నారు.
10. బెలారస్
ఇక్కడ 2020లో ప్రతి 100 మంది మహిళలకు 87.12 మంది పురుషులు ఉన్నారు. జనాభా 94.49 లక్షలకు పైగా ఉంది. ఇందులో 50.50 లక్షల మంది మహిళలు, 43.99 లక్షల మంది పురుషులు ఉన్నారు.