MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • CJP: ఇది మొద‌టి వికెట్ మాత్ర‌మే.. పోరాటం ఇంకా ఉంది. కాక్రోచ్ పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న

CJP: ఇది మొద‌టి వికెట్ మాత్ర‌మే.. పోరాటం ఇంకా ఉంది. కాక్రోచ్ పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న

CJP: కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) పేరుతో మొద‌లైన విద్యార్థి ఉద్యమం అనుకున్న‌ది సాధించింది. నీట్ పేప‌ర్ లీక్‌కు బాధ్య‌తవ‌హిస్తూ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థి లోకం దండెత్త‌గా ఎట్ట‌కేల‌కు మంత్రి రాజీనామా చేశారు.

3 Min read
Author : Narender Vaitla
Published : Jul 25 2026, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విద్యార్థుల ఉద్యమానికి కీలక ఫలితం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
Image Credit : Cockroach is Back/X

విద్యార్థుల ఉద్యమానికి కీలక ఫలితం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామాన్ని విద్యార్థి ఉద్యమం సాధించిన విజయంగా పేర్కొంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) హర్షం వ్యక్తం చేసింది. పార్టీ అధికారిక సోషల్ మీడియాల్లో "ఇది ఒక్క నాయకుడి విజయం కాదు.. దేశంలోని ప్రతి విద్యార్థి గెలిచిన రోజు" అని పేర్కొంది. ప్రధాన్ రాజీనామా వార్త వెలువడిన వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. నినాదాలతో అక్కడి వాతావరణం మార్మోగింది. ఈ విజయాన్ని ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనంగా సీజేపీ నేతలు అభివర్ణించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శాంతియుత పోరాటమే బలం.. అభిజీత్ దీప్కే స్పందన
Image Credit : stockPhoto

శాంతియుత పోరాటమే బలం.. అభిజీత్ దీప్కే స్పందన

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ శాంతియుత నిరసనల ద్వారా కూడా ప్రభుత్వాలను నిర్ణయాలు మార్చేలా చేయవచ్చని ఈ ఉద్యమం నిరూపించిందన్నారు. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గమే తమకు స్ఫూర్తి అని చెప్పారు. "యువత గళం వినిపిస్తే ప్రజాస్వామ్యంలో మార్పు సాధ్యమే. ఈ విజయం ఏ రాజకీయ పార్టీది కాదు. దేశ భవిష్యత్తు కోసం పోరాడిన విద్యార్థులది" అని ఆయన పేర్కొన్నారు. అయితే తమ పోరాటం ఇక్కడితో ముగిసిపోలేదని స్పష్టం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవడం, ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను పూర్తిగా ఉపసంహరించడం, విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు చేపట్టడం, ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థుల‌కు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా వంటి డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. అదే ఉద్దేశంతో కొవ్వొత్తుల ర్యాలీకి కూడా పిలుపునిచ్చారు.

Related Articles

Related image1
ఇదొక్కటి ఉంటే చాలు.. కారులోనే ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు. ధ‌ర కూడా త‌క్కువే
Related image2
మీరు హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొండి.. మీ పైస‌లే, పైస‌ల‌ను సంపాదిస్తాయి
35
ఎవ‌రీ అభిజీత్ దీప్కే ఎవరు?
Image Credit : X

ఎవ‌రీ అభిజీత్ దీప్కే ఎవరు?

సీజేపీ ఆవిర్భావం వెనుక ప్రధాన లక్ష్యం విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రశ్నించడం. కేవలం రెండు నెలల క్రితమే అభిజీత్ దీప్కే ఈ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు. సోషల్ మీడియాలో వేగంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ, నీట్‌ పేపర్‌ లీక్‌ అంశాన్ని కేంద్రంగా చేసుకుని విద్యార్థులను ఒకే స్టేజ్ పైకి తీసుకురావడంలో విజయవంతమైంది.

జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అనేక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా మద్ధతు తెలపడంతో ఉద్యమానికి మరింత బలం చేకూరింది. అనంతరం నిర్వహించిన "చలో పార్లమెంట్" కార్యక్రమం సైతం దేశం దృష్టిని ఆక‌ర్షించింది. 30 ఏళ్ల అభిజీత్ దీప్కే మహారాష్ట్రలోని పుణెలో జర్నలిజం అభ్యసించారు. అనంతరం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. సామాజిక అంశాలపై చురుకైన ప్రచారకర్తగా ఆయనకు గుర్తింపు ఉంది.

This is the first wicket. We won't stop here. This is just the beginning. I salute all students, all the volunteers who have been sitting here for the last 36 days pic.twitter.com/4qerlaMP6v

— Cockroach is Back (@Cockroachisback) July 25, 2026

45
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
Image Credit : X

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

మంత్రి రాజీనామా తమ డిమాండ్లలో ఒకటి మాత్రమే నెరవేరిందని సీజేపీ చెబుతోంది. ఇకపై తమ దృష్టి విద్యా వ్యవస్థలో పారదర్శకత పెంపుపై ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, పరీక్షా భద్రతను బలోపేతం చేసే విధానాలు, బాధ్యత వహించే అధికారులపై కఠిన చర్యలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టపరమైన చర్యలపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ భావిస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యా నిపుణులతో కలిసి విస్తృత స్థాయి చర్చలు నిర్వహించి విద్యా సంస్కరణల కోసం కార్యాచరణ రూపొందించే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

Today’s victory is a powerful testament to the extraordinary foresight of Dr. B.R. Ambedkar and the framers of our Constitution. 

Decades ago, Babasaheb envisioned a nation where power flowed directly from the people, and he engineered the framework to make that possible. Jai… pic.twitter.com/AMC54ku05r

— Cockroach is Back (@Cockroachisback) July 25, 2026

55
ఒక్క నీట్‌తోనే ఆగిపోతుందా?.. వ్యవస్థలోని లోపాలపై సీజేపీ పోరాటం కొనసాగుతుందా?
Image Credit : Asianet News

ఒక్క నీట్‌తోనే ఆగిపోతుందా?.. వ్యవస్థలోని లోపాలపై సీజేపీ పోరాటం కొనసాగుతుందా?

నీట్ పేపర్ లీక్ ఉద్యమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సీజేపీ ఇకపై కేవలం ఒకే అంశానికి పరిమితమవుతుందా, లేక ప్రజా సమస్యలను ప్రశ్నించే విస్తృత ఉద్యమంగా మారుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం ఇప్పటివరకు చేసిన ప్రకటనలను పరిశీలిస్తే, విద్యా రంగంలో పారదర్శకత, ప్రభుత్వ నియామక పరీక్షల నిర్వహణ, అవినీతి, పరిపాలనా వైఫల్యాలు వంటి వ్యవస్థాగత సమస్యలపై కూడా తమ పోరాటాన్ని విస్తరించాలని సంకేతాలు ఇస్తోంది. అయితే ఉద్యమ పార్టీగా కొనసాగుతుందా, లేక ఎన్నికల రాజకీయాల్లోకి కూడా అడుగుపెడుతుందా అన్న అంశంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. నీట్ లీక్ అంశం ద్వారా విద్యార్థుల్లో ఏర్పడిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, తమ ఉద్యమాన్ని దీర్ఘకాలిక ప్లాట్ ఫామ్ గా మార్చుకోవడం సీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్‌గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే నెలల్లో పార్టీ చేపట్టే కార్యక్రమాలే దాని భవిష్యత్ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
రాజకీయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎవ‌రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌.? ఆయ‌న బ్యాగ్రౌండ్ ఏంటి.? రాజ‌కీయాల్లోకి ఎలా వ‌చ్చారు.?
Recommended image2
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే అంటూ
Recommended image3
PM Modi: ఆ వీడియోలు మోదీ మాట్లాడినవి కావు.. వైరల్ వీడియోలపై క్లారిటీ
Related Stories
Recommended image1
ఇదొక్కటి ఉంటే చాలు.. కారులోనే ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు. ధ‌ర కూడా త‌క్కువే
Recommended image2
మీరు హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొండి.. మీ పైస‌లే, పైస‌ల‌ను సంపాదిస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved