MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మీరు హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొండి.. మీ పైస‌లే, పైస‌ల‌ను సంపాదిస్తాయి

మీరు హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొండి.. మీ పైస‌లే, పైస‌ల‌ను సంపాదిస్తాయి

Money Tips: చేతిలో రూ.30 లక్షలు ఉంటే చాలా మంది ముందుగా వ్యాపారం చేయాలని లేదా ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందో అని ఆలోచిస్తారు. అయితే వ్యాపారం అంటే లాభాలతో పాటు నష్టాల ప్రమాదం కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా భ‌యాలుంటాయి.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 25 2026, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇలా ప్లాన్ చేసుకుంటే జీరో రిస్క్
Image Credit : Gemini AI

ఇలా ప్లాన్ చేసుకుంటే జీరో రిస్క్

మార్కెట్ భ‌యాల‌కు తావులేకుండా మీ డ‌బ్బులే డ‌బ్బుల‌ను సంపాదిస్తే భ‌లే ఉంటుంది క‌దూ! అలాంటి ప‌థ‌కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ ద‌గ్గ‌ర ఉన్న రూ. 30 ల‌క్ష‌ల్లో మొదట రూ.15 లక్షలను పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో కనీసం రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. ఒక వ్యక్తి పేరుతో సింగిల్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ తెరిస్తే గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. ప్రస్తుతం దీనిపై వార్షిక వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు సుమారు రూ.9,250 వడ్డీ మీ సేవింగ్స్ అకౌంట్‌లో జమ అవుతుంది. ఐదేళ్లలో మొత్తం రూ.5,55,000 వరకు వడ్డీ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతి నెలా ఖర్చులకు ఒక స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మ‌రో రూ. 15 ల‌క్ష‌ల‌తో ఇలా చేయండి..
Image Credit : Asianet News

మ‌రో రూ. 15 ల‌క్ష‌ల‌తో ఇలా చేయండి..

మీ ఇంట్లో 60 సంవత్సరాలు పూర్తి చేసిన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఉంటే, వారి పేరుతో పోస్టాఫీస్‌లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో మరో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై వార్షికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.1,23,000 వడ్డీ వస్తుంది. ఈ పథకంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. అంటే ప్రతి త్రైమాసికానికి రూ.30,750 మీ ఖాతాలో జమ అవుతుంది. దీన్ని నెలవారీగా లెక్కిస్తే సగటున రూ.10,250 ఆదాయం లభిస్తుంది. ఐదేళ్లలో మొత్తం రూ.6,15,000 వరకు వడ్డీ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

Related Articles

Related image1
Motivational Story: నిజాయితీకి ఆలస్యం కావొచ్చు.. కానీ ఓటమి ఉండదు. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ
Related image2
Business Idea: నెల‌కు ల‌క్ష సంపాదించే అవ‌కాశం.. ట్రెండీ ఐడియా, ప్రైవేట్ థియేట‌ర్ బిజినెస్‌తో సాధ్య‌మే
35
నెల‌కు రూ. 20 వేల ఆదాయం
Image Credit : ChatGPT

నెల‌కు రూ. 20 వేల ఆదాయం

రూ.30 లక్షలను సమానంగా ఈ రెండు పథకాలలో విభజిస్తే వచ్చే ఆదాయం ఇలా ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా నెలకు సుమారు రూ.9,250కాగా.. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా నెలవారీ సగటున రూ.10,250 వ‌స్తుంది. అంటే మొత్తం కలిపి ప్రతి నెలా సుమారు రూ.19,500 నుంచి రూ.20,000 వరకు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రెండు పథకాలూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. అందువల్ల మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా వడ్డీ ఆదాయం పొందవచ్చు. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత అసలు పెట్టుబడిని కూడా తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

45
రిస్క్ తీసుకోవాలనుకోని వారికి ఇది మంచి ఎంపిక
Image Credit : Asianet News

రిస్క్ తీసుకోవాలనుకోని వారికి ఇది మంచి ఎంపిక

చాలామందికి వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్నా నష్టపోతామేమో అనే భయం ఉంటుంది. మరికొందరు షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో వచ్చే హెచ్చుతగ్గులను ఎదుర్కోవడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఈ విధమైన ప్రభుత్వ పొదుపు పథకాలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వారు, నెలనెలా ఖర్చులకు స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారు, కుటుంబ ఆర్థిక భద్రతను కోరుకునే వారు ఈ విధమైన పెట్టుబడులను పరిశీలించవచ్చు. అయితే SCSSలో పెట్టుబడి పెట్టాలంటే ఖాతాదారుడు అర్హత నిబంధనలను తప్పనిసరిగా పూర్తి చేయాలి.

55
ఈ విషయాలు గుర్తుంచుకోవాలి
Image Credit : Asianet News

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి

కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమీక్షిస్తుంది. అయితే సాధారణంగా ఖాతా ప్రారంభించిన సమయంలో అమల్లో ఉన్న వడ్డీ రేటే ఆ డిపాజిట్‌కు మెచ్యూరిటీ వరకు వర్తిస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు పోస్టాఫీస్ లేదా అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో తాజా నిబంధనలు, వడ్డీ రేట్లను ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇదొక్కటి ఉంటే చాలు.. కారులోనే ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు. ధ‌ర కూడా త‌క్కువే
Recommended image2
Business Ideas: డే కేర్ సెంట‌ర్‌.. ఇప్పుడిదే ట్రెండీ బిజినెస్‌. క్లిక్ అయితే ల‌క్ష‌ల్లో ఆదాయం ఖాయం
Recommended image3
ITR Filing Deadline 2026: ఐటీఆర్ ఫైలింగ్ డేట్.. ఇన్కమ్ టాక్స్ పెనాల్టీల నుంచి తప్పించుకోవడం ఎలా? ఈ 5 విషయాలు తెలుసుకోవాల్సిందే!
Related Stories
Recommended image1
Motivational Story: నిజాయితీకి ఆలస్యం కావొచ్చు.. కానీ ఓటమి ఉండదు. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ
Recommended image2
Business Idea: నెల‌కు ల‌క్ష సంపాదించే అవ‌కాశం.. ట్రెండీ ఐడియా, ప్రైవేట్ థియేట‌ర్ బిజినెస్‌తో సాధ్య‌మే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved