Oldest Village: మన దేశంలో అత్యంత పురాతన గ్రామం... పాండవులు తిరిగిన నేల ఇది..!
Oldest Village: మన దేశంలో అత్యంత పురాతన గ్రామాలు ఏవో తెలుసా? పురాణాలతో సంబంధం ఉన్న గ్రామాలు మన దేశంలో ఉన్నాయని తెలుసా? ఆ గ్రామాలు ఏంటి? ఆ గ్రామంలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?

Oldest Villages
మన దేశంలో కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. ఎన్నో కొత్త ఊర్లు పుడుతుంటాయి. కొన్ని మాత్రం కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. కానీ వేల ఏళ్ల క్రితం రామాయణ, మహాభారత ఇతిహాసాలు, పురాణాలకు సంబంధించిన కొన్ని గ్రామాలు ఇప్పటికీ మన దేశంలో ఉన్నాయని తెలుసా? కేవలం చరిత్ర పుస్తకాలు లేదా తవ్వకాలలో బయటపడే శిథిలాలకే పరిమితం కాకుండా, నేటికీ జనాలతో నిండి ఉన్న అత్యంత పురాతన గ్రామాలు ఏవో తెలుసా?
1.కాంపిల్.. ద్రౌపది స్వయంవరం జరిగిన గ్రామం..
ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఉన్న కాంపిల్, ప్రాచీన కాలంలో దక్షిణ పాంచాల రాజ్యానికి చెందిన కాంపిల్యగా పిలిచేవారు. ద్రౌపది స్వయంవరం జరిగింది ఇదే గ్రామంలో కావడం విశేషం. ఇప్పటికీ ఇక్కడ ద్రౌపది కుండ్, రామేశ్వర నాథ్ ఆలయం ఉండటం విశేషం.
2.బర్నావా... పాండవులు ప్రాణాలతో బయటపడిన నేల
బాగ్ పత్ జిల్లాలోని బర్నావాకు మహాభారతంలోని ఒక సంఘటనతో విడదీయరాని సంబంధం ఉంది. కౌరవుల కుట్రను ఛేదించి పాండవులు, కుంతీదేవి ప్రాణాలతో తప్పించుకున్న వర్ణావత అనే ప్రాంతమే.. ఇప్పుడు బర్నావా గ్రామంగా నిలిచింది.
3. నైమిషారణ్యం..
ఋషుల కథాస్థలిగా నిలిచిన పవిత్ర భూమి సీతాపూర్ జిల్లాలో గోమతి నది ఒడ్డున ఉన్న నైమిషారణ్యాన్ని స్థానికంగా 'నీమ్‌సార్' అని పిలుస్తారు. ఋషులు, మునులు పురాణ కథలను పఠించిన పవిత్ర తపోభూమిగా, 33 కోట్ల దేవతలతో ముడిపడిన క్షేత్రంగా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆనవాలు ఇప్పటికీ ఈ గ్రామంలో కనిపిస్తూనే ఉంటాయి.
4. అయోధ్య..
శ్రీరాముడు పుట్టిన నగరం అయోధ్య. సరయూ నది తీరాన ఉన్న అయోధ్య.. పురాతన గ్రామాల్లో ఒకటి కావడం విశేషం. కాలక్రమేణా ఇది ఇప్పుడు పెద్ద నగరంగా ఎదిగినా…ఇక్కడి ఉత్సవాలు, తీర్థయాత్ర మార్గాలు, ఆలయాలు ఆ ప్రాచీన వారసత్వాన్ని నేటికీ కొనసాగిస్తున్నాయి.
5. శ్రావస్తి.. చరిత్ర, బౌద్ధ సంప్రదాయాల సంగమం ఈశాన్య ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి రామాయణ, మహాభారత కాలాల నుంచే ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత బుద్ధుడి బోధనలు, బౌద్ధ సంప్రదాయంతో ఇది మరింత పేరుగాంచింది. ఇక్కడ కనిపించే 'సహేత్-మహేత్' శిథిలాలు ఆనాటి ఆనవాళ్లు ఈ గ్రామంలో ఇప్పటికీ క్లియర్ గా కనిపిస్తాయి.











