MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు

హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు

Bullet Trains: వందే భార‌త్ రైళ్ల‌తో భార‌త రైల్వే వ్య‌వ‌స్థ‌ను మార్చిన ఇండియ‌న్ రైల్వే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్‌తో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. దేశంలోనే తొలి స్వదేశీ బుల్లెట్ ట్రైన్‌ను తయారు చేసే దిశగా కీలక ముందడుగు పడింది.  

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 26 2026, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్వదేశీ బుల్లెట్ ట్రైన్ తయారీ ప్రారంభం
Image Credit : Gemini AI

స్వదేశీ బుల్లెట్ ట్రైన్ తయారీ ప్రారంభం

బెంగళూరులోని BEML సంస్థ ‘ఆదిత్య ప్లాంట్’లో దేశంలోనే మొదటి స్వదేశీ బుల్లెట్ ట్రైన్ B-28 తయారీ పనులు ప్రారంభమయ్యాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఇది భారత్ రైల్వే చరిత్రలో ఒక పెద్ద మైలురాయి గా భావిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2024లో వచ్చిన కాంట్రాక్ట్
Image Credit : Gemini

2024లో వచ్చిన కాంట్రాక్ట్

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిజైన్, తయారీ, కమిషనింగ్ పనుల కోసం 2024 అక్టోబర్‌లో BEML‌కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రెండు హై-స్పీడ్ ట్రైన్‌సెట్స్ తయారు చేయనున్నారు. ఈ ట్రైన్‌ల గరిష్ట వేగం గంటకు 280 కిలోమీటర్లు ఉండనుంది. ఈ రైలు హైద‌రాబాద్‌లో అందుబాటులోకి వ‌స్తే గంట‌లో విజ‌య‌వాడ వెళ్లిపోవ‌చ్చ‌న్న‌మాట‌. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ. 866 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు.

35
ఎప్పుడు అందుబాటులోకి రానుంది.?
Image Credit : Gemini

ఎప్పుడు అందుబాటులోకి రానుంది.?

మొదటి ట్రైన్‌సెట్ 2027 మార్చి నాటికి సిద్ధం అవుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ట్రయల్ రన్స్ ప్రారంభమవుతాయి. 2027 ఆగస్టు నాటికి ఈ బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే ఇంకొన్ని సంవత్సరాల్లోనే భారత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రయాణం సాధ్యమవుతుంది.

45
తొలి ట్రైన్ ఎక్క‌డ న‌డ‌వ‌నుంది.?
Image Credit : Gemini

తొలి ట్రైన్ ఎక్క‌డ న‌డ‌వ‌నుంది.?

మొదటిగా ఈ బుల్లెట్ ట్రైన్‌ను సూరత్, వాపీ మధ్య సుమారు 97 కిలోమీటర్ల మార్గంలో నడపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో భాగంగా ఉంటుంది. ఈ రూట్ ద్వారా హై-స్పీడ్ ట్రైన్ సేవలు పరీక్షించి తరువాత విస్తరించే అవకాశం ఉంది.

55
ట్రైన్ ప్రత్యేకతలు ఏంటి?
Image Credit : x

ట్రైన్ ప్రత్యేకతలు ఏంటి?

ఈ బుల్లెట్ ట్రైన్‌లో పూర్తి ఎసీ చెయిర్ కార్ కోచులు ఉంటాయి. సీట్లు 360 డిగ్రీలు తిరిగేలా, ముందుకు వెనక్కి బెండ్ అయ్యేలా రూపొందించ‌నున్నారు. ప్రయాణికులకు వినోదం కోసం ఆన్‌బోర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు అందించ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హై-స్పీడ్ రైలు టెక్నాలజీలో జపాన్ వంటి దేశాలపై ఆధారపడకుండా భారత్ స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Home Decor: మీ పాత చీరల‌తో ఇంటిని అందంగా మార్చేయండి.. ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలిసి ఉండ‌దు
Recommended image2
వారంలో ఒక్కరోజే ఉండే హైదరాబాద్ చోర్ బజార్. ఎక్కడుంది.? ఎలా వెళ్లాలి.? రూ. 3 వేలకు ఐఫోన్ ఏంటి అసలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved