MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Layoffs : సాప్ట్ వేర్లను సాగనంపుతున్న టెక్ దిగ్గజాలు .. ఈ ఏడాది ఏ సంస్థ ఎంతమందిని తీసేసిందో తెలుసా?

Layoffs : సాప్ట్ వేర్లను సాగనంపుతున్న టెక్ దిగ్గజాలు .. ఈ ఏడాది ఏ సంస్థ ఎంతమందిని తీసేసిందో తెలుసా?

జాతీయ, అంతర్జాతీయ స్థాయి టెక్ కంపనీల్లో ఉద్యోగుల కోతలు ఆందోళనకరంగా మారాయి. కేవలం ఈ ఏడాది మొదటి అర్థభాగంలో అంటే ఇప్పటివరకు వేలాదిమందిని ఉద్యోగాల్లోంచి తీసేసారట. ఆ సంఖ్య ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఈ ఉద్యోగాల కోతలకు కారణమేంటో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : May 15 2025, 09:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Layoffs

Layoffs

Layoffs : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... ఇది ఆధునిక టెక్నాలజీలో మరో విప్లవమని చెప్పాలి. అదీ ఇదని లేదు... అన్ని రంగాల్లోనూ ఏఐ ఎంట్రీ ఇస్తోంది. మరీముఖ్యంగా టెక్ రంగంలో ఏఐ మరింత వేగంగా దూసుకువెళుతోంది. ఇది ఇప్పుడు ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఉద్యోగుల కంటే ఖచ్చితంగా, వేగంగా ఏఐ పనిచేస్తుండటంతో దిగ్గజ టెక్ కంపనీలు దీనివైపే మొగ్గు చూపుతున్నారు. సొంతంగా ఏఐని డెవలప్ చేసుకుని వాడుకుంటున్నారు. దీంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోయింది... కాబట్టి టెక్ కంపనీల్లో లేఆఫ్స్ పెరిగిపోయాయి.  

2025 మొదటి అర్థభాగంలో టెక్ రంగాన్ని ఉద్యోగాల కోతలు ఊపేసాయి. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే 126 టెక్ కంపెనీల్లో 53,100 మందికి పైగా ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారని layoffs.fyi ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ ఇలాగే కొనసాగి భవిష్యత్ లో మరింతగా ఉద్యోగాల కోతలు ఉంటాయని తెలిపారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Intel Layoffs

Intel Layoffs

ఈ కోతల జాబితాలో ముందున్నది అమెరికా చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం ఈ సంస్థ తమ ఉద్యోగులలో సుమారు 20% మందిని తొలగించబోతోందని సమాచారం. ఇది జరిగినట్లయితే లక్షల మందిని ప్రభావితం చేసే చర్య అవుతుంది. ఇంటెల్ ఇప్పటికే 15,000 మందిని తొలగించిన సంగతి తెలిసిందే. 

ఇంకొక పెద్ద కంపెనీ నార్త్‌వోల్ట్ కూడా భారీ ఉద్యోగాల కోతను ప్రకటించింది. యూరోపియన్ బ్యాటరీ తయారీ సంస్థ మార్చి చివరలో దాదాపు 2800 మందిని తొలగించింది. సంస్థ గత సంవత్సరం సెప్టెంబర్‌లో 1600 మందిని తొలగిస్తామని ప్రకటించిన సంగతి గుర్తుంచుకోవాలి.  

Related Articles

Related image1
Telangana Jobs : కేవలం 17 నెలల్లో లక్ష ఉద్యోగాలు..: తెలంగాణ సీఎం కీలక ప్రకటన
Related image2
గూగుల్ లేఅఫ్స్ 2025: హైదరాబాద్, బెంగళూరులో భారీగా ఉద్యోగాలు ఊడినట్టేనా?
36
Microsoft

Microsoft

2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తన వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలకు దిగింది. తాజాగా సంస్థ సుమారు 6,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది మైక్రోసాఫ్ట్ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 3 శాతానికి సమానం.

ఈ ఉద్యోగాల కోత సంస్థ పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా తీసుకున్నదని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన స్థాయిని పెంచడమేనని ప్రకటించింది.
 

46
Meta

Meta

మెటా సంస్థ కూడా ఉద్యోగాల కోతలో ముందుంది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని సంస్థలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు సుమారు 4000 మందిని తొలగించిందని layoffs.fyi వెబ్‌సైట్ తెలిపింది.
 

56
Google

Google

ఇక గూగుల్ విషయానికి వస్తే కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలోనే అమెరికాలో ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరిలో విభాగాల వారీగా కొంతమంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏప్రిల్ మధ్యలో వచ్చిన సమాచారం ప్రకారం గూగుల్ తన ప్లాట్‌ఫార్మ్స్ మరియు డివైసెస్ యూనిట్‌లో వందలాది మందిని తొలగించింది. ఉద్యోగ నిర్మూలనతో సంస్థ మరింత తేలికగా ముందుకు సాగాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
 

66
Layoffs

Layoffs

డెల్ 12,000 ఉద్యోగులు, పిడబ్ల్యూసి 1500 ఉద్యోగులు,  హెచ్పి 2000 ఉద్యోగులు, సేల్ ఫోర్స్ 1000 ఉద్యోగులు, క్లారా  700 ఉద్యోగులను ఏఐ ప్రభావితం చేసిందని తెలుస్తోంది. చెగ్ 22% ఉద్యోగులు,
డుయోలింగో 10 శాతం ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఐబిఎంలో కూడా లేఆప్స్ కొనసాగుతున్నాయి. 

ఈ కోతలు టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై మరోసారి ప్రశ్నలెత్తిస్తున్నాయి. 2025లో ఇప్పటివరకు వచ్చిన డేటా ప్రకారం, టెక్ ఉద్యోగుల మధ్య అస్థిరత కొనసాగుతుండటం స్పష్టమవుతోంది. మిగతా రంగాల్లో ఎలా ఉన్నా టెక్ రంగంపై మాత్రం ఏఐ ఎఫెక్ట్ గట్టిగానే ఉంది...ఇది ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Actor Salim Kumar Passes Away: మలయాళ ప్రముఖ నటుడు కన్నుమూత నివాళి అర్పించిన సీఎం వి.డి. సతీసన్
Recommended image2
Now Playing
Ujjain Mahakaleshwar Temple: ఉజ్జయిని మహాకాళేశ్వరుని భస్మ హారతి దర్శించారంటే కోటిజన్మల పుణ్యం
Recommended image3
Now Playing
Cockroach Janta Party Protest: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన జంతర్ మంతర్ వద్ద హై టెన్షన్
Related Stories
Recommended image1
Telangana Jobs : కేవలం 17 నెలల్లో లక్ష ఉద్యోగాలు..: తెలంగాణ సీఎం కీలక ప్రకటన
Recommended image2
గూగుల్ లేఅఫ్స్ 2025: హైదరాబాద్, బెంగళూరులో భారీగా ఉద్యోగాలు ఊడినట్టేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved