MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Sabarimala: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. ఏఐ రాకతో శబరిమలలో భారీ మార్పులు

Sabarimala: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. ఏఐ రాకతో శబరిమలలో భారీ మార్పులు

Sabarimala Ayyappa Temple: శబరిమలలో ఇక ఏఐ మాయాజాలం మొదలైంది. శబరిమల అయ్యప్ప ఆలయంలో నవంబర్ నుండి భక్తుల రద్దీని నియంత్రించడానికి కేరళ పోలీసులు ఏఐ, డ్రోన్లు, ప్రెడిక్టివ్ సిస్టమ్స్ వాడనున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 22 2026, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శబరిమల అయ్యప్ప కొండపై హైటెక్ విప్లవం
Image Credit : Gemini

శబరిమల అయ్యప్ప కొండపై హైటెక్ విప్లవం

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ ఏడాది సరికొత్త, హైటెక్ అనుభూతి కలగబోతోంది. ప్రతి ఏటా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈసారి రద్దీని తట్టుకునేందుకు కేరళ పోలీస్, ట్రావెన్‌కూర్ దేవస్వం బోర్డు (TDB) నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోనున్నాయి.

దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇకపై డ్రోన్లు, ఏఐ కెమెరాలు, ప్రెడిక్టివ్ సిస్టమ్స్ ద్వారా భద్రతను, భక్తుల రద్దీని పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాది నవంబర్ నెల నుంచి ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహాకుంభమేళా తరహాలోనే ప్రత్యేక ప్లాన్
Image Credit : Asianet News

మహాకుంభమేళా తరహాలోనే ప్రత్యేక ప్లాన్

శబరిమల కొండ కేరళలోని పతనంతిట్ట జిల్లాలో దట్టమైన అడవుల మధ్య ఉంది. గత ఏడాది ఇక్కడ రికార్డు స్థాయిలో 51 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంత భారీ మొత్తంలో వచ్చే జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు, అధికారులకు ఎప్పుడూ పెద్ద టాస్కే. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఢిల్లీ, చెన్నై, ముంబై నగరాలకు చెందిన మూడు పెద్ద ఏఐ కంపెనీలు ఒక స్పెషల్ ప్రపోజల్ సిద్ధం చేశాయి. శనివారం జరిగిన ఒక హై-లెవల్ మీటింగ్‌లో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నవంబర్ నుంచి ఫేజ్ ల వారీగా ఈ ఏఐ సాంకేతికతను అమలు చేయనున్నారు.

పతనంతిట్ట జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్. ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం.. ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఇదివరకే మహాకుంభమేళా, ఇతర పెద్ద పెద్ద ఉత్సవాల్లో సక్సెస్‌ఫుల్‌గా వాడారు. కానీ శబరిమల భౌగోళిక పరిస్థితి వేరు. ఇది దట్టమైన అడవిలో ఉంది కాబట్టి ఇక్కడి కోసం ఒక ప్రత్యేకమైన ఏఐ సొల్యూషన్‌ను డిజైన్ చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య కో-ఆర్డినేషన్ పెంచడానికి, భక్తుల భద్రతను కరెక్ట్‌గా ప్లాన్ చేయడానికి ఈ సిస్టమ్ ఒక గేమ్ ఛేంజర్ కానుంది.

35
తప్పిపోయిన వారు ఈజీగా దొరికేస్తారు.. పార్కింగ్ కష్టాలకు చెక్
Image Credit : Asianet News

తప్పిపోయిన వారు ఈజీగా దొరికేస్తారు.. పార్కింగ్ కష్టాలకు చెక్

ఈ కొత్త టెక్నాలజీ వల్ల భక్తులకు చాలా లాభాలు ఉన్నాయి. సాధారణంగా శబరిమల భారీ రద్దీలో భక్తులు తమ కుటుంబ సభ్యులను మిస్ అవుతుంటారు. అయితే ఇకపై ఏఐ కెమెరాల సాయంతో తప్పిపోయిన వారిని చాలా ఈజీగా ట్రాక్ చేయవచ్చు.

అంతేకాదు, ఆలయం చుట్టుపక్కల ఉన్న 26 పార్కింగ్ గ్రౌండ్స్‌లో వాహనాల రాకపోకలను ఎలాంటి హ్యూమన్ ఇంటర్‌వెన్షన్ లేకుండా ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తారు. దీనివల్ల అక్కడ డ్యూటీలో ఉండే పోలీసుల పని భారం తగ్గి, వారు భద్రతపై మరింత ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం దొరుకుతుంది.

45
డ్రోన్లు, ప్రెడిక్టివ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి?
Image Credit : AI

డ్రోన్లు, ప్రెడిక్టివ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి?

ఈ మొత్తం హైటెక్ సిస్టమ్ కోసం ఏఐ కెమెరాలు, డ్రోన్లు, జీఐఎస్ మ్యాపింగ్‌తో ఒక పెద్ద నెట్‌వర్క్ తయారు చేస్తారు. ఈ సిస్టమ్ కేవలం వీడియో ఫీడ్‌ను అనలైజ్ చేయడమే కాకుండా, ఏ రూట్‌లో భక్తుల రద్దీ పెరగబోతోందో ముందే ఊహించి చెప్తుంది.

ఏదైనా ఒక పాయింట్ దగ్గర జనం ఎక్కువైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ వెళ్తుంది. అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసుల డిజిటల్ డివైజ్‌లకు మెసేజ్ వెళ్లడం వల్ల వారు వెంటనే అలర్ట్ అయి జనాన్ని వేరే రూట్ లోకి డైవర్ట్ చేస్తారు. దీనివల్ల తొక్కిసలాటలు లాంటి ప్రమాదాలు జరగకుండా ముందే ఆపవచ్చు.

55
వర్చువల్ క్యూ సిస్టమ్ రూల్స్ మారుతాయా?
Image Credit : our own

వర్చువల్ క్యూ సిస్టమ్ రూల్స్ మారుతాయా?

ఈ కొత్త టెక్నాలజీ వస్తోంది సరే.. మరి పాత నియమాలు మారిపోతాయా అని భక్తులకు డౌట్ రావచ్చు. అయితే ప్రస్తుతానికి అమల్లో ఉన్న వర్చువల్ క్యూ సిస్టమ్ మునుపటి లాగే కొనసాగుతుందని అధికారులు చెప్పారు. భక్తులు ఆలయానికి వెళ్లే ముందు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని తమ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

కాకపోతే, ఇప్పటివరకు భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇకపై ఏఐ ద్వారా రియల్ టైమ్ డేటా లభించడం వల్ల వెయిటింగ్ టైమ్ చాలా వరకు తగ్గుతుంది. ఈసారి శబరిమల యాత్ర మరింత డిజిటల్ అండ్ సేఫ్‌గా మారబోతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahul Gandhi: మరోసారి దద్దరిల్లిన దేశ రాజధాని.. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది.?
Recommended image2
Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Recommended image3
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?
Related Stories
Recommended image1
Best Honeymoon Destinations: హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 రొమాంటిక్ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి !
Recommended image2
Earth Facts: ఒక్క సెకండ్ లో భూమిపై ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచాన్ని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved