- Home
- National
- Agni Prime Missile: పాకిస్థాన్ ఇక కాచుకో.. రైళ్ల నుంచి క్షిపణులను ప్రయోగించిన తొలి దేశం మనదే
Agni Prime Missile: పాకిస్థాన్ ఇక కాచుకో.. రైళ్ల నుంచి క్షిపణులను ప్రయోగించిన తొలి దేశం మనదే
Agni Prime Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. తొలిసారి రైలు నుంచి క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ద్వారా చరిత్ర సృష్టించింది. అగ్ని ప్రైమ్ అని పిలిచే ఈ క్షిపణికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రైలు ఆధారిత క్షిపణి ప్రయోగంలో సరికొత్త చరిత్ర
భారతదేశం రైలు నుంచి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన తొలి దేశంగా చరిత్రలోకి అడుగుపెట్టింది. DRDO రూపొందించిన అగ్ని-ప్రైమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ (Rail-Based Mobile Launcher) నుం,ఇ పరీక్షించారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారత రక్షణ సామర్థ్యానికి ఒక కొత్త మైలురాయిగా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. "భారతదేశం రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి మధ్యస్థ-శ్రేణి అగ్ని-ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీని పరిధి 2,000 కిలోమీటర్ల వరకు ఉంది, అత్యాధునిక ఫీచర్లతో దీనిని రూపొందించారు" అని ఆయన తెలిపారు.
DRDO, సాయుధ దళాల విభాగాలకు అభినందనలు
ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి DRDO, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC), సాయుధ దళాలను అభినందించారు."ఈ ప్రయోగం భారతదేశాన్ని రైలు ఆధారిత క్షిపణి ప్రయోగ సామర్థ్యాన్ని కలిగి ఉన్న గణనీయమైన దేశాల సమూహంలో చేర్చింది". అని రక్షణ శాఖ మంత్రి చెప్పుకొచ్చారు.
అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రత్యేకతలు ఏంటంటే.?
* పరిధి: దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ప్రభావితం చేయగలదు.
* మొబైల్ సౌలభ్యం: రైలు నెట్‌వర్క్‌లో సులభంగా ప్రయాణించగల సామర్థ్యం.
* రాడార్ దాటగల సామర్థ్యం: శత్రు రాడార్‌ల నుంచి తప్పించుకునే అధిక సామర్థ్యం దీని సొంతం.
* నావిగేషన్ వ్యవస్థ: అత్యంత ఖచ్చితమైన లక్ష్య నిర్ధారణ సామర్థ్యం.
* విద్యుత్-సాంకేతిక లక్షణాలు: అత్యాధునిక మిషన్ సిస్టమ్‌లను అమర్చారు.
భారత రక్షణ రంగంలో కీలక అడుగు
అగ్ని-ప్రైమ్ రైలు ఆధారిత ప్రయోగం భారత రక్షణ రంగంలో కొత్త దిశను సృష్టిస్తోంది. తక్షణ క్షిపణి ప్రయోగ సామర్థ్యం, రాడార్ దాటగల సామర్థ్యం, అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్ ద్వారా దేశ సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థ మరింత బలపడుతుంది. ఈ ప్రయత్నం భవిష్యత్తులో మరిన్ని రైలు-ప్రేరణ క్షిపణి ప్రాజెక్టులకు మార్గదర్శకంగా నిలుస్తుంది.