8th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ... భారీగా జీతాలు పెరిగే ఛాన్స్, ఎంతో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ వేతన సంఘం ఏర్పాటుతో ఏం జరగనుంది?
8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే గుడ్ న్యూస్ వినే అవకాశం వుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. దీని సిపార్సుల ఆధారంగానే ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. అందువల్లే 8వ వేతన సంఘం ఏర్పాటు, అది చేసే సిఫారసులు గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఆసక్తిగా వేచిచూస్తున్నారు.
8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత మినిమం బేసిక్ పే ను రూ.18,000 నుండి రూ.34,500 కు పెంచే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. మరి 8వ వేతన సంఘం సిపార్సులు ఎలా వుంటాయో చూడాలి.
8th Pay Commission
అసలు ఏమిటీ పే కమీషన్ :
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఫించనుదారులకు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా జీతాలను, అలవెన్సులను, పెన్షన్ ప్యాకేజీలను సవరించడానికి ఏర్పాటుచేసేవే ఈ పే కమీషన్స్ (వేతన సంఘాలు). ప్రస్తుతకాలంలో మనిషి జీవన వ్యయాలు రోజురోజులు కు పెరుగుతున్నాయి... దీంతో ఆర్థిక అవసరాలు ఎక్కువయ్యాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక అవసరాలను తగ్గట్లుగా జీతాలను, అలవెన్సులను నిర్ణయించే బాధ్యత ఈ పే కమీషన్ కు అప్పగిస్తుంది ప్రభుత్వం.
పదేళ్లకు ఓసారి వేతన సంఘాన్ని ఏర్పాటుచేసి ఉద్యోగుల జీతాలు, అలవెన్సులను సవరిస్తారు. ఇలా ప్రస్తుతం 7వ వేతన సంఘం సిపార్సులు అమలులో వున్నాయి. 2014లో ఈ పే కమీషన్ ను ఏర్పాటుచేయగా 2016 నుండి సిపార్సులు అమల్లోకి వచ్చాయి. అంటే 2026 తో పదేళ్ల కాలం పూర్తవుతుంది. కాబట్టి 8వ వేతన సంఘం సిపార్సులను అమలుచేయాల్సి వుంటుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాలు ముగియగానే అంటే వచ్చే సంవత్సరం ఆరంభంలోనే వేతన సంఘాన్ని ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 2026 జనవరి నుండి 8వ వేతన సంఘం సిపార్సులను అమలు చేయనున్నారు.
8th Pay Commission
భారీగా జీతాలు పెరిగే అవకాశం :
8వ వేతన సంఘం అమలుతో తమ జీతాలు భారీగా పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశతో వున్నారు. 7వ వేతన సంఘం 23శాతం జీతాలను పెంచగా ఈసారి అంతకంటే ఎక్కువే వుంటుందని భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మినిమం బేసిక్ పే రూ.34,500 గా నిర్దారించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
ఈ 8వ వేతన సంఘం సిపార్సులు తమకు ఆర్థికంగా బాగా లబ్ది చేకూరుస్తాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. సాలరీతో పాటు అలవెన్సులు కూడా భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలు బాగా పెరుగుతున్నాయి... కాబట్టి భవిష్యత్ 10 ఏళ్లను దృష్టిలో వుంచుకుని వేతన సంఘం సిపార్సులు వుండాలని ఉద్యోగులు కోరుతున్నారు.