MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Kara Movie Review: కర మూవీ రివ్యూ.. ధనుష్‌, మమితా బైజుల సినిమా ఎలా ఉందంటే?

Kara Movie Review: కర మూవీ రివ్యూ.. ధనుష్‌, మమితా బైజుల సినిమా ఎలా ఉందంటే?

Kara Movie Review: `కుబేర`తో తెలుగు ఆడియెన్స్ ని మెప్పించిన ధనుష్‌ ఇప్పుడు `కర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఎలా ఉందంటే? 

4 Min read
Author : Aithagoni Raju
Published : Apr 30 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ధనుష్‌ `కర` మూవీ రివ్యూ
Image Credit : Asianet News

ధనుష్‌ `కర` మూవీ రివ్యూ

ధనుష్‌.. ఇప్పుడు కోలీవుడ్‌ హీరో మాత్రమే కాదు, టాలీవుడ్‌ హీరోగానూ నిలబడుతున్నాడు.  `సార్‌`, `కుబేర`తో ధనుష్‌కి తెలుగులో మంచి మార్కెట్‌, ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఆయన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్‌ అవుతుంటుంది. ఇప్పుడు ఆయన `కర` అనే చిత్రంలో నటించారు. విఘ్నేష్‌ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. కేఎస్‌ రవికుమార్‌, సూరజ్‌ వింజరమూడు వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌ బ్యానర్పై ఇషరి కె గణేష్‌ నిర్మించారు. దీన్ని విఘ్నేశ్వర ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సీహెచ్‌ సతీష్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం నేడు గురువారం(ఏప్రిల్‌ 30)న విడుదలైంది. మరి మరోసారి ధనుష్‌కి హిట్‌ పడిందా? మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
కర మూవీ కథ
Image Credit : Asianet News

కర మూవీ కథ

కరస్వామి(ధనుష్‌) ఒక దొంగ. టౌన్‌లో ఓ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనానికి పాల్పడి దొరికిపోతాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి చితకబాదుతారు. ఈ కేసుని డీఎస్‌పీ ప్రభాకరన్‌(సూరజ్‌ వింజరమూడు) డీల్‌ చేస్తాడు. తాను దొంగని పట్టుకున్నట్టుగా క్రెడిట్‌ కొట్టేయాలని ప్లాన్‌ చేస్తుంటాడు. కానీ స్టేషన్‌లోనే ఆ డీఎస్‌పీని కొట్టి పారిపోతాడు కరస్వామి. ఇక దొంగతనాలు చేయోద్దని నిర్ణయించుకుని ఇంటికెళ్లి తన భార్య సెల్లి (మమితా బైజు)తో కలిసి ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు. కానీ చాలీచాలని జీతంతో ఇళ్లు గడవడం కష్టమవుతుంది. దీంతో సొంతంగా మెస్‌ పెట్టాలనుకుంటారు. కానీ బ్యాంక్‌ వాళ్లు లోన్‌ ఇవ్వరు. లోన్‌ కావాలంటే భూమిపట్టా కావాలని అడగ్గా, ఆ పట్టా పేపర్స్ కోసం తన సొంతూరు వస్తాడు. తండ్రి కందస్వామి (కేఎస్‌ రవికుమార్‌) కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అన్నీ మర్చిపోయి కొడుకుని చేరదీస్తాడు. కానీ భూమి అమ్మాలని ఫోర్స్ చేయగా, ఆ పేపర్స్ బ్యాంక్‌లో ఉన్నాయని, వాటిని తాకట్టు పెట్టి ట్రాక్టర్‌ లోన్‌ తీసుకున్నానని చెబుతాడు. యుద్ధం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ షార్టేజ్‌ వచ్చి అవి పడా ఉంటాయి. పంటలు పండకపోవడంతో లోన్‌ కట్టలేరు. దీంతో భూమి జప్తు చేస్తారు. ఆ టైమ్‌లోనే కరస్వామి ఇచ్చిన షాక్‌కి కందస్వామి కన్నుమూస్తాడు. ఆయన్ని తమ భూమిలో సమాధి చేయడానికి బ్యాంక్‌లు ఒప్పుకోవు. అప్పుకడితేనే ఆ భూమిలో అంత్యక్రియలు నిర్వహించాలని కండీషన్‌ పెడతాయి. మరి ఆ లోన్‌ కట్టేందుకు కరస్వామి ఏం చేశాడు? రైతు బ్యాంకులు ఎలా మోసం చేస్తున్నాయి? బ్యాంక్‌లపై కరస్వామి చేసిన తిరుగుబాటు ఏంటి? అందులో సక్సెస్‌ అయ్యాడా? కరస్వామి లోన్‌ కట్టాడా? తండ్రిని తన భూమిలో అంత్యక్రియలు నిర్వహించాడా? ఈ సినిమాలో చూపించిన నిజాలేంటి? అనేది మిగిలిన కథ.

Related Articles

Related image1
Ramu Rathod Remuneration: పారితోషికం డబుల్‌ చేసిన రాము రాథోడ్‌.. ఒక్క పాటకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
Related image2
Tollywood Record: ఓకే ఏడాది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇండస్ట్రీ హిట్స్.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన సినిమాలివే
37
కర మూవీ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

కర మూవీ ఎలా ఉందంటే?

రైతుల సమస్యల నేపథ్యంలో రూపొందిన ఎమోషనల్‌ డ్రామా `కర`. బ్యాంకులు చేసే మోసాలను ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఎంతో మంది రైతులను, అమాయకులను బ్యాంక్‌లు చేసే మోసాలను కళ్లకి కట్టినట్టు చూపించారు. ప్రధానంగా ట్రాక్టర్‌ లోన్స్ పేరుతో జరిగే మోసాలను ఇందులో ఆవిష్కరించారు. కానీ అటు ఇటుగా అన్ని రకాల లోన్లకి ఇలానే జరుగుతుందనేది నిజం. ఈ విషయంలో దర్శకుడు విఘ్నేష్‌ రాజాని అభినందించాల్సిందే. సినిమా మొదట దొంగతనం సీన్లతో ప్రారంభమవుతుంది. దొంగతనం చేసే అంశాలు, పోలీసు స్టేషన్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత హీరో తన భార్యతో కలసి హోటల్‌లో పనిచేయడం, వారి దారుణమైన పరిస్థితిని ఆవిష్కరించిన తీరు బాగుంది. ఎమోషనల్‌గా ఉంటుంది. పేదవాళ్ల జీవితాలు ఎలా ఉంటాయనేది కళ్లకి కట్టినట్టు ఆవిష్కరించారు. ఆ తర్వాత హీరో సొంతూరు వెళ్లి పేరెంట్స్ ని కలిసినప్పుడు వచ్చే ఎమోషనల్‌ సీన్లు ఆద్యంతం భావోద్వేగానికి గురి చేస్తాయి. ఊర్లో రైతుల దీన పరిస్థితి, బ్యాంకుల అప్పులు, పంట నష్టం వంటి సీన్లు మన రియల్‌ లైఫ్‌ జీవితాలను కళ్ల ముందు కనిపించినట్టుగా ఉంటుంది. ఫస్టాఫ్‌ చాలా టైట్‌ స్క్రీన్‌ ప్లేతో సాగుతుంది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ఆద్యంతం కట్టిపడేస్తాయి. తండ్రి మరణంతో కొడుకు పడే వేదన, తన భూమిలోనే తండ్రిని పూడ్చలేని పరిస్థితి, బ్యాంకులు చేసే అన్యాయం ఎమోషనల్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ హీటెక్కించేలా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో బ్యాంక్‌ లోన్‌ తీర్చడానికి హీరో పడే తపన, బాధ, అందుకోసం మళ్లీ ఆయన దొంగగా మారడం, ఈ క్రమంలో చోటు చేసుకునే పరిణామాలు ఉత్కంఠగా సాగుతాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచుతుంది. బ్యాంక్‌లకు, పోలీసులకు, హీరోకి మధ్య టామ్‌ అండ్‌ జెర్రీలా సాగే సీన్లు ఆద్యంతం రసవత్తరంగా ఉంటాయి.  బ్యాంక్‌ రాబరీ సీన్లు సీట్‌ ఎడ్జ్ లా సాగుతాయి. క్లైమాక్స్ మరింత ఉత్కంఠకు గురిచేస్తుంది. అందులోనే కొన్ని ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ముగింపు బాగుంది. సినిమాలో ట్రాక్టర్‌ లోన్లు, విలన్‌ చివరికి ట్రాక్టర్‌ యాక్సిడెంట్‌తోనే చనిపోవడం, అదే సమయంలో మూవీలో కమల్‌ హాసన్‌ `తేవర్‌ మగన్‌` రిఫరెన్స్ సీన్లు, బ్యాంక్ లోన్లకి సంబంధించిన కొత్త యాంగిల్‌ని చూపించిన తీరు బాగుంది.

47
కర మూవీలో మైనస్‌ లు ఏంటంటే?
Image Credit : Asianet News

కర మూవీలో మైనస్‌ లు ఏంటంటే?

సినిమా స్లోగా సాగుతుంది. కథలో ఇంటెన్సిటీని, ఎమోషన్స్ ని క్యారీ చేయడం కోసం స్లోగా నడిపించినట్టు ఉంటుంది. బ్యాంక్‌ రాబరీ సీన్లు రిపీట్‌గా అనిపిస్తాయి. కథ అక్కడక్కడే తిరిగినట్టుగా ఉంటుంది.  కథ సీరియస్‌గా సాగడంతో డ్రై ఫీల్‌ తెప్పిస్తుంది. పోలీసుల విచారణ కూడా లాజిక్‌ లెస్‌గా ఉంటుంది. అంతగా ఆకట్టుకోలేదు. కొన్ని సీన్లు ఊహించేలా ఉంటాయి. రైతుల సమస్యలకు సంబంధించి మరింత బాగా చూపించాల్సింది. అందులోని ఎమోషన్స్ ని బలంగా చూపిస్తే ఇంకా బాగుండేది.

57
కర మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

కర మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

కరస్వామిగా ధనుష్‌ అదరగొట్టాడు. సినిమా ప్రారంభం నుంచే ఆయన పాత్రలో జీవించారు. మనకు ఎక్కడా ధనుష్‌ కనిపించడు. అంతే సహజంగా, అంతే బాగా చేసి మెప్పించాడు. దొంగగా చాలా ఇంటెన్స్, ఎమోషన్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు ధనుష్‌. ఆయన భార్య పాత్రలో మమితా బైజు డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించింది. రియాలిటీకి దగ్గరగా ఆమె పాత్ర ఉంది, ఉన్నంతసేపు అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. తండ్రి కందస్వామి పాత్రలో కేఎస్‌ రవికుమార్‌ నటన అదిరిపోయింది. ఆయన పాత్రలోని ఎమోషన్స్ కదిలిస్తాయి. ఎమోషన్స్ కి గురి చేస్తాయి. పోలీస్‌ ఆఫీర్‌గా సూరజ్‌ వింజరమూడు అదరగొట్టారు. ప్రారంభంలో ఆయన పాత్ర సీరియస్‌గా ఉంటుంది. తర్వాత కొంత ఫన్నీగా ఉంటుంది. బ్యాంక్‌ మేనేజర్‌ గా జయరాం అదరగొట్టారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

67
కర సినిమా టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

కర సినిమా టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

థెని ఈశ్వర్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్‌గా 1990ని తలపించేలా ఉంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం ఫర్వాలేదు. బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. శ్రీజిత్‌ సారంగ్‌ ఎడిటింగ్‌  ఇంకా షార్ప్ చేయాల్సింది. దర్శకుడు విఘ్నేష్‌ రాజా ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని అంతే ఎమోషనల్‌గా, అంతే ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు. బ్యాంక్‌ లోన్ల విషయంలో జరిగే అన్యాయాలకు సంబంధించిన అంశాలను కళ్లకి కట్టినట్టు చూపించారు. ముల్లుని ముల్లుతోనే తీయాలనే కాన్సెప్ట్ బాగుంది. ఇంకా షార్ప్ గా, ఎంగేజింగ్‌గా, ఎమోషనల్‌గా తీసుకెళ్తే సినిమా అదిరిపోయేది. కానీ అందరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. ఒక సామాజిక స్పృహ కలిగిన మూవీ `కర` అని చెప్పొచ్చు.

77
ఫైనల్‌ నోట్‌
Image Credit : Asianet News

ఫైనల్‌ నోట్‌

రైతు సమస్యలు, లోన్ల పేరుతో బ్యాంకులు చేసే అన్యాయాలను కళ్లకి కట్టినట్టు చూపించిన మూవీ `కర`. మంచి ఎమోషనల్‌ డ్రామా. 

రేటింగ్‌: 3

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Horror Movie: పాతికేళ్ల క్రితం వచ్చిన హర్రర్ మూవీ ఇది, ఒంటరిగా చూసే ధైర్యం చేయద్దు
Recommended image2
Balakrishna: చిరంజీవికి షాకిచ్చేలా బాలయ్య కొత్త సినిమాల లిస్ట్.. ఒక్క దెబ్బతో మొత్తం మారిపోయింది
Recommended image3
Sneha in Swimming Pool: స్విమ్మింగ్‌ పూల్‌లో స్నేహని ఇలా చూసి ఉండరు
Related Stories
Recommended image1
Ramu Rathod Remuneration: పారితోషికం డబుల్‌ చేసిన రాము రాథోడ్‌.. ఒక్క పాటకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
Recommended image2
Tollywood Record: ఓకే ఏడాది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇండస్ట్రీ హిట్స్.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved