MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ramu Rathod Remuneration: పారితోషికం డబుల్‌ చేసిన రాము రాథోడ్‌.. ఒక్క పాటకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

Ramu Rathod Remuneration: పారితోషికం డబుల్‌ చేసిన రాము రాథోడ్‌.. ఒక్క పాటకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

ఫోక్‌ సింగర్‌ రాము రాథోడ్‌ పాడిన జానపద పాటలు యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. అలాగే ఇప్పుడు సినిమా పాటలతోనూ బిజీ అవుతున్నాడు. మరి ఒక్క పాట పాడితే రాము రాథోడ్‌ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో తెలుసా.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 29 2026, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాము రాథోడ్ ప్రస్థానం
Image Credit : starmaa

రాము రాథోడ్ ప్రస్థానం

తెలంగాణ జానపద సంగీత ప్రపంచంలో రాము రాథోడ్ ఒక సంచలనం. మారుమూల పల్లె నుంచి వచ్చిన ఈ అద్భుతమైన గాయకుడు, జానపద గీతాలకు ఒక కొత్త ఊపిరి పోశారు. బంజారా నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, ఆయన పాడిన పాటలు కులమతాలకు అతీతంగా ప్రతి ఇంట్లోనూ మార్మోగుతున్నాయి. పక్కా గ్రామీణ యాసలో, ఎంతో సహజత్వంతో కూడిన ఆయన గాత్రం శ్రోతలను అలరిస్తోంది.  ముఖ్యంగా యూట్యూబ్  లో ఆయన విడుదల చేసిన పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి, ఆయనను రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చేశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాటలో జీవం.. పల్లె పదాల వైభవం
Image Credit : JioHotstar

పాటలో జీవం.. పల్లె పదాల వైభవం

రాము రాథోడ్ కేవలం ఒక గాయకుడు మాత్రమే కాదు, పాటలోని భావాన్ని తన గొంతుతో పలికించే గొప్ప కళాకారుడు. ఆయన పాటల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పల్లెల్లో ఉండే కల్మషం లేని ప్రేమలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా 'తెలంగాణ జానపదాలు' (Folk Songs) అంతరించిపోతున్న తరుణంలో, ఆధునిక సంగీతాన్ని జోడించి యువతకు చేరువ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పల్లె కన్నీరు పెట్టినా, ప్రేమికుల మధ్య విరహం కలిగినా.. రాము రాథోడ్ పాట వింటే ఆ భావం నేరుగా గుండెకు తాకుతుంది.

Related Articles

Related image1
Kara Movie First Review: ధనుష్‌ `కర` మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చింది.. హైలైట్స్ ఇవే, కానీ మైనస్‌ ఏంటంటే?
Related image2
Tollywood Record: ఓకే ఏడాది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇండస్ట్రీ హిట్స్.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన సినిమాలివే
35
రాము రాథోడ్‌ పాపులర్‌ సాంగ్స్
Image Credit : youtube/@rathodtunes

రాము రాథోడ్‌ పాపులర్‌ సాంగ్స్

రాము రాథోడ్‌ పాడిన `రాను బొంబాయికి రాను` పాట యూట్యూట్‌నే షేక్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి 80కోట్లకు వ్యూస్‌ వచ్చాయి. జానపద పాటల్లో ఇది టాప్‌లో ఉంది. ఈ పాటతో పాపులర్‌ అయ్యాడు రాము రాథోడ్‌. దీంతోపాటు `రింగు రింగుల జుట్టు దాన`, `సొమ్మ సిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ`, `సిరులైనా సరిపోతాయా`, `డీజే పిల్లా` వంటి పాటలతో పాపులర్‌ అయ్యాడు రాము రాథోడ్‌. దీంతో అతను `బిగ్‌ బాస్‌ తెలుగు 9`లోకి వచ్చాడు. ఉన్నన్ని రోజులు నవ్వించే ప్రయత్నం చేశాడు. విచిత్రమైన ప్రవర్తనతో నవ్వులు పూయించాడు. ఆ తర్వాత తనే ఎలిమినేట్‌ అయ్యాడు. బిగ్‌ బాస్‌ షో రాము రాథోడ్‌కి విశేషమైన గుర్తింపుని తెచ్చింది. ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. అంతేకాదు సినిమా పాటలతోనూ అలరిస్తున్నాడు.

45
రాము రాథోడ్‌ పారితోషికం
Image Credit : JioHotstar

రాము రాథోడ్‌ పారితోషికం

రాము రాథోడ్‌ ఇప్పుడు సినిమా పాటలతోనూ బిజీ అవుతున్నాడు. ఇటీవలే ఆయన `బ్యాండ్‌ మేళం` చిత్రంలో `తిప్పుతున్నావే` అనే పాటని ఆలపించాడు. సినిమా ఆడలేదుగానీ, పాట మాత్రం దుమ్మురేపుతోంది. ఇంకా ట్రెండింగ్‌లో ఉంది. మరి సినిమా పాటలకు రాము రాథోడ్‌ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడనేది చూస్తే, ఒక్కో పాటకి ఆయన యాభై వేల వరకు అందుకుంటున్నాడట. పాపులర్‌ అయిన సింగర్స్ రూ.1.50లక్షల నుంచి రెండు లక్షలు తీసుకుంటున్నారు. కానీ రాము రాథోడ్‌ ఇప్పటి వరకు యాభై వేలు మాత్రమే తీసుకున్నాడట. కానీ `తిప్పుకున్నావే` పాటతో తను కూడా పారితోషికం పెంచాడట. ఇప్పుడు లక్ష రూపాయలు అడుగుతున్నాడట. కొత్తగా రాము రాథోడ్‌ పాట పాడితే లక్ష రూపాయలు చెల్లించుకోవాల్సిందే. అయితే చాలా పేదరికం నుంచి వచ్చిన రాము రాథోడ్‌ ఇప్పుడు ఒక్కో పాటకి లక్ష రూపాయలు తీసుకునే స్థాయికి ఎదగడం గొప్ప విషయమనే చెప్పాలి. అది ఆయన పెరిగిన స్థాయిని, ఆయనకున్న డిమాండ్‌ని తెలియజేస్తుందని చెప్పొచ్చు. ‌

55
కళాకారుడిగా సమాజం పట్ల బాధ్యత
Image Credit : Jiosaavn

కళాకారుడిగా సమాజం పట్ల బాధ్యత

రాము రాథోడ్ తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఒక సామాన్యమైన స్థితి నుంచి వచ్చి, ఈరోజు జానపద కళకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం వెనుక ఎంతో కృషి ఉంది. ఇతర వర్ధమాన కళాకారులను ప్రోత్సహించడంలో కూడా ఆయన ముందుంటారు. తెలంగాణ ప్రభుత్వం, వివిధ సాంస్కృతిక సంస్థలు ఆయన ప్రతిభను గుర్తించి అనేక పురస్కారాలతో గౌరవించాయి. జానపదం ఉన్నంత కాలం రాము రాథోడ్ గొంతు మారుమోగుతూనే ఉంటుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja: మట్టి వాసనను ప్రపంచానికి చూపించిన లెజెండ్రీ డైరెక్టర్.. భారతీరాజా ఇకలేరు
Recommended image2
Naga Chaitanya: సమంతతో మూవీ రిజెక్ట్ చేసిన చైతు, బ్యాడ్ లక్..3 సినిమాలు, ముగ్గురు హీరోలకు సూపర్ హిట్లు
Recommended image3
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Kara Movie First Review: ధనుష్‌ `కర` మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చింది.. హైలైట్స్ ఇవే, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image2
Tollywood Record: ఓకే ఏడాది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇండస్ట్రీ హిట్స్.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved