MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Industry Hits: ఓకే ఏడాది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇండస్ట్రీ హిట్స్.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన సినిమాలివే

Industry Hits: ఓకే ఏడాది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇండస్ట్రీ హిట్స్.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన సినిమాలివే

Industry Hits: టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఒకే ఏడాది మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. చిరుతో స్టార్ట్ చేస్తే, నాగార్జున ఎండ్‌ చేశాడు. ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 29 2026, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఒకే ఏడాది చిరు, బాలయ్య, నాగ్‌ ఇండస్ట్రీ హిట్స్
Image Credit : stockPhoto

ఒకే ఏడాది చిరు, బాలయ్య, నాగ్‌ ఇండస్ట్రీ హిట్స్

టాలీవుడ్‌లో సీనియర్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ ఒకప్పుడు తిరుగులేని సూపర్‌ స్టార్స్ గా రాణించారు. అదే సమయంలో వీరి మధ్య తీవ్ర పోటీ కూడా ఉండేది. ఆ పోటీని తట్టుకుని నిలబడ్డారు. వరుస విజయాలతో తిరుగులేని స్టార్స్ గా ఎదిగారు. అయితే ఓ ఏడాది మాత్రం ముగ్గురు హీరోలు ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు. బ్యాక్ టూ బ్యాక్‌ ఒకరి రికార్డులను మరొకరు తిరగరాశారు. ఆ ముగ్గురు చిరంజీవి, బాలయ్య, నాగార్జున. మరి అది ఏ ఏడాది? ఆ మూడు సినిమాలేంటి? అనేది చూస్తే.

24
అత్తకు యముడు అమ్మాయికి మొగుడుతో చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌
Image Credit : aha

అత్తకు యముడు అమ్మాయికి మొగుడుతో చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌

చిరంజీవి, బాలయ్య, నాగార్జున ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ఏడాది 1989. ఈ ఏడాది సంక్రాంతికి `అత్తకు యముడు అమ్మాయికి మొగుడు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు చిరంజీవి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో వాణిశ్రీ అత్తగా, విజయశాంతి ప్రియురాలిగా నటించింది. ఆ ఏడాది ఇది సంచలన విజయం సాధించింది. దాదాపు 14 సెంటర్లలో వంద రోజులు ఆడింది. ఇందులో చిరంజీవి కామెడీ, డాన్సులు అదిరిపోతాయి. పాటలకు ఆడియెన్స్ డాన్సులు వేయాల్సిందే. వసూళ్ల పరంగానూ దుమ్ముదులిపేసింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 

Related Articles

Related image1
Kara Movie First Review: ధనుష్‌ `కర` మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చింది.. హైలైట్స్ ఇవే, కానీ మైనస్‌ ఏంటంటే?
Related image2
Toxic Movie: 'టాక్సిక్' మళ్ళీ వాయిదా, కారణం ఇదే.. మరోసారి సస్పెన్స్ లో పెట్టిన యశ్‌
34
ముద్దుల మావయ్యతో బాలయ్య ఇండస్ట్రీ హిట్
Image Credit : etv win

ముద్దుల మావయ్యతో బాలయ్య ఇండస్ట్రీ హిట్

ఆ తర్వాత బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఆయన `ముద్దుల మావయ్య` చిత్రంలో నటించారు. దీనికి కోడి రామకృష్ణ దర్శకుడు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో బాలయ్య, విజయశాంతి జంటగా నటించారు. ఏప్రిల్‌ 7న విడుదలైన ఈ చిత్రం 29 సెంటర్లలో వంద రోజులు ప్రదర్శించబడింది. ఏకంగా ఐదున్న కోట్ల కలెక్షన్లని సాధించింది. అప్పటి వరకు ఉన్న అన్ని సినిమా రికార్డులను ఇది బ్రేక్‌ చేసింది.

44
శివతో నాగ్‌ అన్ని రికార్డులు బ్రేక్‌
Image Credit : zee 5

శివతో నాగ్‌ అన్ని రికార్డులు బ్రేక్‌

అక్టోబర్‌లో నాగార్జున దిగారు. ఆయన `శివ` మూవీతో వచ్చారు. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతూ, నాగ్‌ తో ఈ ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీని రూపొందించారు. అమల హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. అక్టోబర్‌ 5న దసరా స్పెషల్‌గా ఈ సినిమా విడుదలైంది. టాలీవుడ్‌ని షేక్‌ చేసింది. ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాని చూసి షాక్‌ అయ్యారు. ఈ మూవీ అప్పట్లో టాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా భారీ వసూళ్లని రాబట్టింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, చిరంజీవి, బాలయ్య.. ఇలా అందరి రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 22 సెంటర్లలో వంద రోజులు, 5 సెంటర్లలో 175 రోజులు ఆడింది. ఇలా ఇండస్ట్రీ హిట్‌ని చిరంజీవి స్టార్ట్ చేస్తే, నాగార్జున ఫినిష్‌ చేశాడు. ఒకే ఏడాది మూడు ఇండస్ట్రీ హిట్స్ పడటం టాలీవుడ్‌లో అరుదైన సంఘటనగా చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
5000 కోట్ల కలెక్షన్ మార్క్ వైపు మైఖేల్ పరుగులు.. 4 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సునామీ
Recommended image2
Vanisri : అక్కినేనితో సహా ఇండస్ట్రీ అంతా వచ్చారు.. వాణిశ్రీ పెళ్లికి ఎన్టీఆర్ మాత్రం ఎందుకు రాలేదు? కారణం ఏంటో తెలుసా?
Recommended image3
Tollywood Director: ప్రముఖ టాలీవుడ్‌ డైరెక్టర్‌ కన్నుమూత.. శివాజీ, రమ్యకృష్ణల సినిమాతో పాపులర్
Related Stories
Recommended image1
Kara Movie First Review: ధనుష్‌ `కర` మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చింది.. హైలైట్స్ ఇవే, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image2
Toxic Movie: 'టాక్సిక్' మళ్ళీ వాయిదా, కారణం ఇదే.. మరోసారి సస్పెన్స్ లో పెట్టిన యశ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved