MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Job: కుక్కల ఫుడ్ టేస్ట్ చేసే ఉద్యోగం... లక్షల్లో జీతం, ఈ ఉద్యోగానికి ఎలాంటి క్వాలిటీస్ కావాలో తెలుసా?

Job: కుక్కల ఫుడ్ టేస్ట్ చేసే ఉద్యోగం... లక్షల్లో జీతం, ఈ ఉద్యోగానికి ఎలాంటి క్వాలిటీస్ కావాలో తెలుసా?

Job: ప్రపంచంలో అత్యధిక జీతాలు ఇచ్చే ఉద్యోగాలు చాలా ఉన్నాయి. చాలా ఉద్యోగాలకు విపరీతంగా కష్టపడాలి. అయితే, కేవలం ఒక ఫుడ్ ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెబితే.. లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలు ఉన్నాయని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 23 2026, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇలాంటి జాబ్ మీకు కూడా కావాలా?
Image Credit : chat Gpt

ఇలాంటి జాబ్ మీకు కూడా కావాలా?

ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి పెంపుడు జంతువులను పెంచుకునే అలవాటు ఉంటుంది. కుక్కలు, పిల్లలను తమ పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. అయితే.. ఆ పెంచుకునే వాటికి రోజూ తమ ఇంట్లో తయారు చేసిన ఫుడ్ మాత్రమే కాకుండా, సపరేటుగా మార్కెట్లో దొరికే కొన్ని స్పెషల్ ఫుడ్స్ ని వాటికి అందిస్తూ ఉంటారు. అలాంటి ఫుడ్స్ తయారు చేసే కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. వాటిలో.. వింత వింత ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

వినడానికి విచిత్రంగా, నమ్మసక్యంగా లేకపోయినా.. ఇలాంటి కంపెనీల్లో పెట్ ఫుడ్ టేస్టర్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. మనం ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కలు, పిల్లులకు పెట్టే ఫుడ్ ని టేస్ట్ చేసే ఉద్యోగం అన్నమాట అది. ఆ ఫుడ్ ఎంత క్వాలిటీగా ఉంది? ఎంత రుచిగా ఉంది? వాసన ఎలా ఉంది అనే విషయాన్ని టేస్ట్ చేసి చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కుక్కల ఫుడ్ తినాలా..?
Image Credit : chat Gpt

కుక్కల ఫుడ్ తినాలా..?

ఏంటి డబ్బుల కోసం కుక్కల ఆహారం తినాలా అని కంగారు పడకండి. ఈ ఉద్యోగం చేసేవారు.. కుక్కల ఫుడ్ ని కడుపు నిండా తినేయరు. వీరి పని వెనక చాలా రూల్స్ ఉంటాయి.

ముందుగా..ప్యాకెట్ లేదా క్యాన్ ఓపెన్ చేయగానే వచ్చే వాసన ఎలా ఉందో పరిశీలిస్తారు. తర్వాత ఆ ఆహారంలో నూనె శాతం, ఉప్పు, మాంసం లేదా కూరగాయల నాణ్యత ఎలా ఉందో చూసేందుకు చిన్న ముక్కను నోట్లో వేసుకుని రుచి చూస్తారు. రుచి చూసిన తర్వాత ఆ ఆహారాన్ని మింగకుండా వెంటనే బయటకు ఉమ్మేసి, నీళ్లతో నోరు శుభ్రం చేసుకుంటారు

కుక్కలు తినేదాన్ని మనుషులు ఎందుకు టేస్ట్ చేయాలి?

కుక్కలు మాట్లాడలేవు కదా.. "ఈ ఫుడ్‌లో ఉప్పు తక్కువైంది" అనో, "ఇది సరిగ్గా ఉడకలేదు" అనో అవి చెప్పలేవు. అందుకే, మానవుల నాలుకకున్న టేస్ట్ బడ్స్ ద్వారా ఆ ఫుడ్ పర్ఫెక్ట్‌గా ఉందో లేదో కచ్చితంగా అంచనా వేయడానికి కంపెనీలు ఈ టేస్టర్లను నియమించుకుంటాయి. పెంపుడు జంతువులకు ఎలాంటి హాని జరగకుండా, వాటికి రుచికరమైన ఆహారం అందేలా చూసే బాధ్యత వీళ్లదే.

33
జీతం ఎంత ఇస్తారంటే...
Image Credit : chat Gpt

జీతం ఎంత ఇస్తారంటే...

ఈ ఉద్యోగానికి జీతం తక్కువేమీ ఉండదు. తొలిసారి ఈ ఉద్యోగానికి అప్లై చేసే వారికి రూ.6లక్షల నుంచి రూ.7లక్షల వరకు జీతం అందిస్తారు. ఇక, సీనియర్లకు అయినా ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. ఈ ఉద్యోగం చేస్తూ సంవత్సరానికి రూ.20 నుంచి రూ.30లక్షల జీతం అందుకుంటున్నవారు కూడా ఉన్నారు.

ఈ ఉద్యోగానికి ఉన్న అర్హత ఏంటి?

ఇది కేవలం రుచి చూడటమే కాదు, దీని వెనుక పెద్ద సైన్సే ఉంది. ఈ ఉద్యోగం రావాలంటే ఫుడ్ టెక్నాలజీ లేదా న్యూట్రిషన్‌లో డిగ్రీ ఉండాలి. మంచి సువాసనలను, చెడు వాసనలను సూక్ష్మంగా పోల్చగలగాలి. ముఖ్యంగా ధూమపానం, ఆల్కహాల్ అలవాటు లేనివారిని మాత్రమే ఇలాంటి ఉద్యోగాలకు ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ అలవాట్లు నాలుక, ముక్కు పనితీరును ప్రభావితం చేస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ఉద్యోగాలు, కెరీర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Vada: ఈ గారెలంటే సమంతకి చాలా ఇష్టమట..మరి ఎలా చేయాలో రెసిపీ చూసేయండి
Recommended image2
Hair Growth: పెరుగులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Recommended image3
Hing: పులిహోరకు రుచిని పెంచే ఈ మసాలా.. దెయ్యాల ఆహారమా..?
Related Stories
Recommended image1
Sun Light: 24గంటలపాటు సూర్యుడి వెలుగు భూమి మీద పడకపోతే ఏమౌతుంది?
Recommended image2
Hing: పులిహోరకు రుచిని పెంచే ఈ మసాలా.. దెయ్యాల ఆహారమా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved