MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hair Growth: పెరుగులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!

Hair Growth: పెరుగులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!

Hair Growth: జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం, ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలామందికి జుట్టు రాలే సమస్య ఎదురవుతోంది. మరి ఈ సమస్యకు ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో ఎలా చెక్ పెట్టాలో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 23 2026, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జుట్టు పెరుగుదల కోసం ఇంటి చిట్కాలు
Image Credit : Getty

జుట్టు పెరుగుదల కోసం ఇంటి చిట్కాలు

పొడవైన, ఒత్తైన, అందమైన జుట్టు ప్రతి ఒక్కరికీ ఇష్టమే. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం, పలుచబడటం, చివర్లు చిట్లిపోవడం, జుట్టు పెరగకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి కొందరు ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా పెరుగులో మెంతులు కలిపి వాడటం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి ఈ హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దామా…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పెరుగు, మెంతుల ప్రయోజనాలు
Image Credit : our own

పెరుగు, మెంతుల ప్రయోజనాలు

పెరుగు, మెంతులు రెండూ ఇంట్లో సులభంగా లభించే పదార్థాలు. పెరుగును జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారడానికి, చిక్కులు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు పొడిగా ఉన్నవారికి ఇది బెస్ట్. మెంతుల్లో ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషక పదార్థాలు ఉంటాయి. మెంతుల పేస్ట్‌ను పెరుగుతో కలిపి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

36
హెయిర్ మాస్క్ కోసం కావాల్సిన పదార్థాలు
Image Credit : Getty

హెయిర్ మాస్క్ కోసం కావాల్సిన పదార్థాలు

ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల తాజా పెరుగు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు అవసరం. ముందుగా మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు వాటిని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో పెరుగు తీసుకొని అందులో మెంతుల పేస్ట్ వేసి బాగా కలపాలి. మిశ్రమం మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించడం మంచిది.

46
జుట్టుకు ఎలా అప్లై చేయాలి?
Image Credit : stockPhoto

జుట్టుకు ఎలా అప్లై చేయాలి?

ముందుగా జుట్టును చిక్కులు లేకుండా మెల్లగా దువ్వుకోవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న పెరుగు, మెంతుల మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో బాగా కడగాలి. అవసరమైతే తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవచ్చు. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం చూడవచ్చు.

56
జుట్టు ఆరోగ్యం కోసం..
Image Credit : stockPhoto

జుట్టు ఆరోగ్యం కోసం..

జుట్టు ఆరోగ్యం కోసం హెయిర్ మాస్క్‌లతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు అందడం ముఖ్యం. రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్, జింక్, అవసరమైన విటమిన్లు అందేలా చూసుకోవాలి. పప్పులు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు, గింజలు వంటి పోషకాహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

66
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Image Credit : stockPhoto

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పెరుగు, మెంతులు సహజ పదార్థాలే అయినప్పటికీ ప్రతి ఒక్కరికి ఒకే విధంగా పడకపోవచ్చు. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. తలపై దురద లేదా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని ఉపయోగించకూడదు. అలాగే అప్లై చేసిన తర్వాత మంట, దురద లేదా ఎర్రదనం వస్తే వెంటనే కడిగేయాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Hing: పులిహోరకు రుచిని పెంచే ఈ మసాలా.. దెయ్యాల ఆహారమా..?
Recommended image2
Tattoo Meaning: ఈ పాపులర్ టాటూల అర్థాలు ఏంటో తెలుసా? ప్రతి డిజైన్ వెనుక ఓ కథే ఉంది!
Recommended image3
Water Heater : ఈ చలికాలంలో గీజర్, వాటర్ హీటర్ వాడుతున్నారా? అయితే ఈ సెప్టీ టిప్స్ మీకోసమే
Related Stories
Recommended image1
Parenting: కొడుకు భవిష్యత్ బాగుండాలంటే ప్రతి తండ్రి చేయాల్సిన 5 పనులు ఇవే!
Recommended image2
Tattoo Meaning: ఈ పాపులర్ టాటూల అర్థాలు ఏంటో తెలుసా? ప్రతి డిజైన్ వెనుక ఓ కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved