MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • World sparrow day 2025 పిచ్చుకలు మన ఇంటికి వస్తే ఎంత మంచిదో తెలుసా?

World sparrow day 2025 పిచ్చుకలు మన ఇంటికి వస్తే ఎంత మంచిదో తెలుసా?

మన చిన్నప్పడు ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. వాటి చేష్టలు చూస్తూ, కిచకిచలు వింటూ మనం మురిసిపోయేవాళ్లం. కానీ ప్రస్తుతం పిచ్చుకలు కనిపించడమే గగనం అయిపోయింది. మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భంగా  ఈ ఆర్టికల్‌లో పిచ్చుకల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

2 Min read
Author : Anuradha B
Published : Mar 20 2025, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 2025

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 2025

పిచ్చుకలు ఇప్పుడు అంతరించిపోతున్న జాతి. వాటిని రక్షించడానికి మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకొంటారు. గతంలో పిచ్చుకలు ఇళ్ల ముందు, అటకలు, దూలాలు, పైకప్పు సందుల్లో గూళ్లు కట్టుకునేవి. ఈ రోజుల్లో భవనాలు పెద్దవిగా ఉంటున్నాయి, చెట్లు తక్కువగా ఉంటున్నాయి, ఎయిర్ కండిషనింగ్ వంటి సాంకేతికతలు ఇళ్లలో సాధారణమైపోయాయి. మన ఇళ్లు పిచ్చుకలకు కొత్తగా ఉన్నాయి. గతంలో 13 సంవత్సరాలు జీవించిన పిచ్చుకలు ఇప్పుడు 5 సంవత్సరాలలోనే చనిపోతున్నాయి. మానవ సాంకేతిక అభివృద్ధి కారణంగానే ఇలా జరుగుతోందని చెప్పడంలో సందేహం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పిచ్చుకల దినోత్సవం ఎలా మొదలైంది?

పిచ్చుకల దినోత్సవం ఎలా మొదలైంది?

గాలి వెళ్లడానికి వీలులేని గట్టిగా మూసివున్న పట్టణ ఇళ్లలో పిచ్చుకలు బతకలేవు. పట్టణ ప్రాంతాల్లో గాజు కిటికీలను ఢీకొని చనిపోయే ప్రమాదం కూడా ఉంది. గ్రామాల్లో కూడా ఇళ్లు కాంక్రీటు కావడంతో పిచ్చుకలు తక్కువగా వస్తున్నాయి. పిచ్చుకలు పునరుత్పత్తి చేయడానికి అవసరమైన వాతావరణం లేకపోవడం వల్ల కొన్ని సంవత్సరాల్లోనే 60% కంటే ఎక్కువ నాశనమవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి, ఇది దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఈ పరిస్థితిని మార్చే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 2010లో మార్చి 20ని ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా మొదలు పెట్దింది.

34
పెద్దల నమ్మకాలు:

పెద్దల నమ్మకాలు:

పిచ్చుకలు ఇంటికి రావడం మంచిదని మన పెద్దలు నమ్మేవారు. పిచ్చుకలు వచ్చి ఉండే ఇంట్లో పిల్లలు పుడతారనే నమ్మకం కూడా ఉండేది. కొన్ని నమ్మకాలు మంచి చేస్తాయి. ఇది అలాంటి నమ్మకాల్లో ఇది ఒకటి. వీటితో పర్యావరణానికి అందమే కాదు.. మనం వాటిని తరచూ చూస్తుంటే మనసుకి కూాడా ప్రశాంతంగా ఉంటుంది.

44
పిచ్చుకలను ఎలా పిలవాలి?

పిచ్చుకలను ఎలా పిలవాలి?

పిచ్చుకలు తోటలోని పొదలు, మొక్కలు, చెట్లలో గూళ్లు కట్టుకుంటాయి. మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వస్తున్నాయో లేదో గమనించండి. వస్తుంటే వాటి కోసం ఆహారం ఉంచండి. బియ్యం పిండి, చిన్న చిన్న ధాన్యాలు వాటికోసం ఉంచవచ్చు. వాటి దాహం తీర్చడానికి అవి వచ్చే దిశలో నీళ్లు పెట్టండి. నీటిని తరచుగా మార్చాలి. లేదంటే దోమలు వ్యాప్తి చెందుతాయి. ఒక కార్డ్‌బోర్డ్ పెట్టెకు పిచ్చుక వెళ్ళడానికి తగినంత పెద్ద రంధ్రం చేసి ఎత్తుగా వేలాడదీయండి. పిచ్చుకలు అందులో నివాసం ఉండే అవకాశం ఉంది.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved