World cycle day 2022: సైకిల్ తొక్కితే.. ఒక్కటేమిటీ.. ఎన్నో రోగాలు తగ్గిపోతయ్..
World cycle day 2022: ఒకప్పుడు సైకిల్ లేని ఇల్లు ఉండేది కాదు. కానీ నేడు చూద్దామన్నా సైకిల్ కనిపించడం లేదు. ఈ రోజు World cycle day. ఈ సందర్భంగా సైకిల్ తొక్కడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

కాలం మారింది. కాలంతో పాటుగా జనాల అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. అందులో ఒకటి సైకిల్. ఒకప్పుడు సైకిల్ లేని ఊరు, ఇల్లు ఉండేది కాదు. ఏ ఊరికి వెళ్లాలన్నా.. ఏ వస్తువులు పెట్టుకురావాలన్నా.. సైకిల్ నే ఉపయోగించేటోళ్లు. ఇప్పుడు చూద్దామన్నా.. ఒక్క సైకిల్ కూడా కనిపించడం లేదు. ఊన్నోడు లేనోడు అంటూ తేడాలు లేకుండా సైకిళ్లను తొక్కే జనం కరువయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సైకిల్ పేదోడి వాహనంగా మారిపోయింది. ఏమైనా.. చాలా మంది బైక్, కార్ల వాడకాన్ని పెంచారు. ఇది మంచిదే అయినా.. వీటి వాడకం వల్ల పర్యావరణం కాలుష్యం అవడమే కాదు.. ఆరోగ్యం కూడా పాడువుతుందనేది నమ్మలేని నిజం.
ఇకపోతే ప్రతి ఏడాది జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ కన్జర్వేషన్ ఫోటోగ్రాఫర్స్ (IL CP) ప్రారంభించిన దీన్ని 1988 నుంచి జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సైకిల్ వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం పదండి.
సైక్లింగ్ కూడా ఒక వ్యాయామమే. దీని ద్వారా మనల్ని మనం సూపర్ ఫిట్ గా ఉంచుకోవచ్చు. సైక్లింగ్ కూడా పర్యావరణానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో కూడా మంది సైకిల్ తొక్కడానికి ఇష్టపడుతున్నారు. దీనిని ప్రోత్సహించడానికి ప్రపంచ సైకిల్ దినోత్సవం 2022 ను ప్రతి సంవత్సరం జూన్ 3 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని 2018 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రారంభించింది. సైక్లింగ్ ను ప్రోత్సహించడమే దీని ముఖ్య లక్ష్యం. స్కూలు, కాలేజీ లేదా ఆఫీసుకు వెళ్లే వారు సైకిళ్లను ఉపయోగిస్తే పర్యవారణానికి ఎంత ప్రయోజనం జరుగుతుందో తెలియజేస్తుంది. సైక్లింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ దీని 7 ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెకు ప్రయోజనకరంగా.. సైక్లింగ్ చేసేటప్పుడు మన హృదయ స్పందన (Heart rate) వేగవంతం అవుతుంది. ఇది మన గుండె ఆరోగ్యానికి చాలా మంచి వ్యాయామం కూడా. సైక్లింగ్ చేయడం వల్ల గుండె, రక్తనాళాలకు సంబంధించిన ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధనలో తేలింది.
కేలరీలను బర్న్ చేయడానికి.. సైకిల్ తొక్కడం వల్ల బాడీలో అనవసరంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు 1 నెల రోజుల పాటు సైకిల్ తొక్కితే 2 నుంచి 4 కిలో వరకు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. సైక్లింగ్ వల్ల తొడ కొవ్వు, బొడ్డు కొవ్వును వేగంగా తగ్గించి, బరువును అదుపులో ఉంటుంది.
సైక్లింగ్ పాదాల కండరాలను బలోపేతం చేస్తుంది.. సైకిల్ తొక్కడం వల్ల పాదాల కండరాలు బలోపేతం అవుతాయి. పాదాల నొప్పి, విటమిన్ డి లోపం, కీళ్ల నొప్పి వంటి సమస్యలు ఉండనే ఉండవు. అంతే కాదు సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలోని ఆక్సిజన్ పరిమాణం కూడా పెరుగుతుంది. ఇది శరీరంలోని కండరాలను బలోపేతం చేస్తుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. సైక్లింగ్ చేయడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇతర వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం.. చైనాలో జరిపిన ఒక అధ్యయనంలో.. రోజుకు 1-2 గంటలు సైకిల్ తొక్కేవారికి కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం 50 రోజులు తక్కువగా ఉంటుందని తేలింది. అలాగే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 10 శాతం తగ్గించవచ్చని మరొక నివేదిక తెలిపింది. అదే విధంగా సైక్లింగ్ ఇతర క్యాన్సర్లను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుందని తేలింది.
డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. సైక్లింగ్ చేయడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఒక పరిశోధన ప్రకారం.. క్రమం తప్పకుండా సైకిల్ తొక్కే వ్యక్తులు సాధారణ వ్యక్తుల్లో కంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు. అదేవిధంగా డయాబెటిస్ ఉన్నవారు రోజూ 45 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే వారి ఇన్సులిన్ స్థాయిని తగ్గించుకోవచ్చు.
సైక్లింగ్ ఇతర ప్రయోజనాలు.. రెగ్యులర్ గా సైక్లింగ్ చేసే పిల్లలు బాగా హైట్ పెరుగుతారు. ప్రతిరోజూ సైకిళ్లు తొక్కే పిల్లల ఎత్తు ఎటువంటి కార్యకలాపాలు చేయని పిల్లల కంటే 2 రెట్లు వేగంగా పెరుగుతుందని ఒక నివేదిక పేర్కొంది.
అవును సైక్లింగ్ అనేది ఒక రకమైన ఏరోబిక్ వ్యాయామం. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాస్తవానికి ఏరోబిక్ వ్యాయామం మానసిక స్థితిని మార్చడం ద్వారా మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది హైపోథాలమిక్ పిట్యూటరీ ఆడ్రినలిన్ పై పడే ఒత్తిడి ప్రతిస్పందనను తగ్గించగలదు.