MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2022: పచ్చి కొబ్బరితో ఒకటి కాదు రెండు కాదు.. ఎన్ని లాభాలున్నాయో...!

ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2022: పచ్చి కొబ్బరితో ఒకటి కాదు రెండు కాదు.. ఎన్ని లాభాలున్నాయో...!

ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2022:  ప్రకృతి అందించే వనరులతోనే సర్వరోగాలు నయమవుతాయి. అందులోనూ కొబ్బరి  కూడా తక్కువేం కాదు.. ఇది ఎన్నో రోగాలను ఇట్టే నయం చేస్తుంది.. 

2 Min read
Mahesh Rajamoni
Published : Sep 02 2022, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

మన తాతలు, ముత్తాతలు వారి ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు.. ఎందుకంటే వారి ఆరోగ్యం బేషుగ్గా ఉండేది. ఎందుకంటే వారు పోషకాహారమే తీసుకునే వారు. అందుకే వాళ్లు నూరేండ్లేంటి.. నూటయాభై ఏండ్లు కూడా బతికారు. ఇక ఇప్పుడు 60, 70 ఏండ్లు బతకడమే మహా ఎక్కువ. ఎందుకంటే మన ఆరోగ్యం అంత తొందరగా క్షీణిస్తుంది కాబట్టి. దీనికంతటికీ కారణం మనం తినే ఆహారమే మరి. అవును మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలుసు.. అయినా ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాన్నే తినేవారున్నారు. దీంతో లక్షలు, కోట్లు పెట్టినా.. నయం కానీ జబ్బుల బారిన పడుతున్నారు. మీకు తెలుసా..? ప్రకృతిమనకు  ప్రసాదించిన వాటిని తీసుకుంటే చాలు.. మీరు నూరేళ్లు ఎలాంటి రోగాలు లేకుండా బతుకుతారు. ఇలాంటి ఆరోగ్యకరమైన వాటిలో కొబ్బరి కూడా ఉంది. 
 

210

ప్రతి ఏడాది సెప్టెంబర్ 2 వ తేదీని ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.. 

310

పచ్చి కొబ్బరి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో హెల్తీ ఫ్యాట్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా శరీరంలో అడ్డగోలుగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. 
 

410

కొబ్బరి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. 
 

510

స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప పానీయమనే చెప్పాలి. ఇందుకోసం భోజనానికి ముందు ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగితే మీరు అతిగా తినలేరు. ఇది మీ శరీర శక్తిని కూడా పెంచుతుంది. కఠినమైన పని లేదా వ్యాయామాలు చేసిన తర్వాత గ్లాస్ కొబ్బరి నీటిని తాగడం.. బాడీ శక్తివంతంగా మారుతుంది. 

610

కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, మాంగనీస్, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీటిని తాగడం వల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. అంతేకాదు ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది కూడా. 

710

కొబ్బరి అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల ఇదొక్కటే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. 

810

జీర్ణవ్యవస్థను మెరుగ్గా చేసే ఫైబర్ కంటెంట్ కొబ్బరిలో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

910

జుట్టు, చర్మ సమస్యలను కూడా కొబ్బరి తొలగిస్తుంది. దీన్ని తీసుకున్న వారి చర్మం తేమగా మెరుస్తూ ఉంటుంది. జుట్టు కూడా చిట్లిపోయే ప్రమాదం ఉండదు. కొబ్బరిలో ఉండే యాంటీ ఫంగల్, మోనోలారిన్ లక్షణాలు మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి. 
 

1010

పడుకునే ముందు కొబ్బరి నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే విషపదార్థాలు బయటకు పోతాయి. అంతేకాదు కొబ్బరి నీరు రక్తపోటు స్థాయిలను కూడా తగ్గిస్తుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved