- Home
- Life
- Phone Effects on health: నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూస్తే మీ నరాలు ఏమవుతాయో తెలుసా? వాటర్ బబుల్ ఎత్తడం కూడా కష్టమే
Phone Effects on health: నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూస్తే మీ నరాలు ఏమవుతాయో తెలుసా? వాటర్ బబుల్ ఎత్తడం కూడా కష్టమే
Phone Effects: మనలో 99 శాతం మంది చేసే పని నిద్ర లేచిన వెంటనే స్మార్ట్ ఫోన్ చూడటం. అలారం మోగిందని మొదలు పెట్టి నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తాం. ఇక అంతే అరగంట, గంట ఇలా సమయం గడిచిపోతూనే ఉంటుంది. రోజూ ఇలానే చేస్తే మీ నరాలు ఏమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

జీవితంలో ముఖ్యమైన వస్తువు సెల్ ఫోన్
సెల్ ఫోన్ ఇప్పుడు మన జీవితంలో అతి ముఖ్యమైన వస్తువు. ఏదైనా మర్చిపోవచ్చు కాని.. సెల్ ఫోన్ మర్చిపోవడం అస్సలు జరగని పని. పొరపాటున మర్చిపోతే ప్రాణం పోయినంత పనైపోతుంది. ఇల్లంతా వెతికైనా వెంటనే కనిపెట్టేస్తాం. అంతలా సెల్ ఫోన్ జీవితంలో భాగమైపోయింది. అందుకే నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడకుండా ఉండలేరు.
మనిషికి అసిస్టెంట్ లా మారిన సెల్ ఫోన్
సెల్ ఫోన్ రాకముందు అన్ని పనులు సొంతంగా చేసుకోవాల్సి వచ్చేది. ఎవరితోనైనా మాట్లాడాలంటే వాళ్ల ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. ఏదైనా కొనుక్కోవాలంటే ఆ షాప్ కి వెళ్లి డబ్బులు చెల్లించి కొనాల్సి వచ్చేది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. ఇంట్లో నుంచి కదలకుండానే అన్ని పనులు చేసేసుకోవచ్చు. ఎంత దూరంలో ఉన్న వారితోనైనా ఇంట్లోంచే మాట్లాడొచ్చు. ఏ దేశంలో ఉన్న వస్తువునైనా ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చు.
నిద్ర లేచిన వెంటనే చూడొద్దు
ఇంత ముఖ్యమైన సెల్ ఫోన్ ను నిద్ర లేవగానే చూడకపోతే ఎన్నో పనులు ఆగిపోతాయి. మెసేజ్ లు, కాల్స్, నోటిఫికేషన్స్ ఏమొచ్చాయో చూసుకోకపోతే ముఖ్యమైన పనులు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
కాని నిద్ర లేవగానే ఫోన్ చూడటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
మెదడు చాలా డిస్టర్బ్ అవుతుంది
నిద్ర లేవగానే సెల్ ఫోన్ చూడటం వల్ల బ్రెయిన్ దెబ్బతింటాయి. రిలాక్స్ మోడ్ లో ఉన్న బ్రెయిన్ వెంటనే యాక్టివేట్ కాదు. దానికి ఒక్కసారిగా హై రెజెల్యూషన్ ఉన్న ఫోన్ కాంతిని చూపించడం వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది. అంతేకాకుండా నేరాలు, ప్రమాదాలు, ఒత్తిడికి గురిచేసే విషయాలు తెలుసుకోవడం వల్ల బ్రెయిన్ చాలా స్ట్రెస్ కి గురవుతుంది. దీంతో మరింత ఒత్తిడికి గురవుతారు.
నరాల బలహీనత కలుగుతుంది
రోజూ ఉదయం బెడ్ దిగకుండా ఫోన్ చూడటం వల్ల నరాల సమస్యలు తలెత్తుతాయి. వెంటనే శరీరంలో మార్పులు కనిపించకపోవచ్చు కాని ప్రతి రోజూ ఫోన్ చూడటం వల్ల కొన్నాళ్లకు నరాల బలహీనత వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కంటి నరాలు దెబ్బ తిని చూపు మందగించడం, చేతులు, కాళ్లలో నరాల బలహీనత వల్ల శక్తి తగ్గడం జరుగుతుందని చెబుతున్నారు. దీంతో కొన్నాళ్లకు కనీసం వాటర్ బబుల్ కూడా ఎత్తడానికి శరీరం సహకరించదని డాక్టర్లు చెబుతున్నారు.
ఇలా చేస్తే బెటర్
అందువల్ల ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే వెంటనే మొబైల్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ చెక్ చేయడం మంచిది కాదు. కనీసం అర గంట సేపయినా మొబైల్ ముట్టుకోకుండా ఇతర పనులపై ధ్యాస పెట్టాలి. అంటే మెడిటేషన్, యోగా, వాకింగ్ చేయడం లాంటివి చేయాలి.