Cell Phone : ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు ఆ రోగాలు వచ్చుండాలే..!
Cell Phone : ప్రస్తుత కాలంలో సమయం సందర్భం అంటూ ఏదీ లేకుండా గంటల తరబడి ఫోన్లతోనే గడిపేవారికి కొదవే లేదు. అందులోనూ రాత్రుళ్లు ఎంత సేపు ఫోన్లలో మునిగారో .. వారికే తెలియకుండా ఉంటున్నారు. ఈ కారణం చేత ఎంతో మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయినా ఫోన్లతో ఎక్కువ సమయాన్ని గడిపేవారికి వాళ్లకు ఏయే రోగాలు అటాక్ చేశాయో కూడా తెలియదు. అర్థరాత్రి దాకా ఫోన్లను చూడటం.. మళ్లీ ఉదయం లేచిన వెంటనే వాటినే చూడటం చాలా మందికి అలవాటు. అలా చూడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

Cell Phone : ప్రస్తుత కాలంలో ఫోన్ల వాడకం ఎంతలా పెరిగిందో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటారా? ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ఫోన్లు ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. దీన్ని బట్టే మొబైల్ ఫోన్ల వాడకం ఎంత పెరిగిందో తెలుస్తుంది. కొంతమందైతే.. ఒకటి ఆఫీస్ కోసం మరోటి పర్సనల్ అంటూ రెండు రెండు ఫోన్లను మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఫోన్ల వాడకం లాభాలేంటో కానీ.. నష్టాలే ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఫోన్లను పగలు రాత్రి అంటూ తేడా లేకుండా వాడుతున్నారు. తిండి తిప్పలు మర్చిపోయి. ఇక రాత్రుళ్లు ఏం చూస్తారో ఏమో కానీ.. అర్థరాత్రైనా వాటిని అంటిపెట్టుకునే ఉంటారు. ఇకపోతే ఉదయం లేచిన వెంటనే దేవుడి ఫోటోనో లేకపోతే అరచేతులను చూసే కాలం ఎప్పుడో పోయింది. ఆ రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడంతా లేచిన వెంటనే ఫోన్ల ముఖాన్నే చూస్తున్నారు. అదే శుభ శకునంగా భావిస్తున్నారు. ఏం నోటిఫికేషన్లు వచ్చినయ్? ఏవరు ఏయే స్టేటస్ లు పెట్టారంటూ లేచిన వెంటనే మొబైల్ ఫోన్లలో తలదూరుస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే అరచేతిలో సెల్ ఫోన్ లేనిదే ఆ రోజు గడవని పరిస్థితి ఏర్పడింది.
చాలా మందికి సెల్ ఫోన్ యే సర్వస్వం అయ్యింది. పడుకునే ముందు దాంతోనే గడపడం.. నిద్ర లేచిన వెంటనే దాన్నే చూడటం ఒక అలవాటుగా మారింది. కానీ పొద్దున్న లేచిన వెంటనే సెల్ ఫోన్లను చూడటం చాలా ప్రమాదరకరమంటున్నారు నిపుణులు. ఈ అలవాటును వెంటనే మానుకోకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తదని హెచ్చరిస్తున్నారు..
మార్నింగ్ నిద్రలేవగానే కళ్లు తెరచి ఫోన్ చూడటం వల్ల.. దాని నుంచి వెలువడే లైటింగ్ నేరుగా కళ్లపై పడుతుంది. అది కళ్లకు ఏ మాత్రం మంచిది కాదు. ఈ లైటింగ్ వల్ల Physical stress గు గురయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దీనివల్ల తల బరువుగా మారుతుంది. తద్వారా ఏ విషయాన్ని కూడా సరిగ్గా ఆలోచించకపోవడం, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు తీవ్రమైన తలనొప్పి సమస్య కూడా వేధిస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే మార్నింగ్ లేవగానే ఫోన్ చూసే అలవాటును మానుకోండి.
తాజా అధ్యయనాల ప్రకారం.. నిద్రలేవగానే ఫోన్ చూసే వారిలో అధిక రక్తపోటు సమస్య వేధిస్తున్నట్టు తేలింది. ఈ లైటింగ్ వల్ల స్ట్రెస్ పెరగడం తో అది రాను రాను రక్తపోటు సమస్యకు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అది అలాగే కొనసాగితే.. ప్రాణాల మీదికి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి సమయంలో ఎక్కువ సేపు సెల్ ఫోన్ చూడటం వల్ల నిద్రలేమి సమస్య అటాక్ చేస్తుంది. దానికి తోడు రాత్రంతా ఫోన్ తోనే కాలక్షేపం చేయడం మళ్లీ పొద్దున్నే దానితోనే రోజును ప్రారంభించడం వల్ల మీ మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. దీంతో మీరు మీ రోజు వారి పనులను సక్రమంగా చేసుకోలేరు. ప్రతి చిన్న విషయానికి కూడా చిరాకు పడటం, కోపగించుకోవడం, చేస్తున్న పనిపై శ్రద్ధ చూపకపోవడం , నిస్సత్తువ వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు ఫోన్ చూడకుండా ఉండటానికి ప్రయత్నించండి.