MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • సముద్రం మధ్యలో శివాలయం... దేవుడి దర్శనం ఎలా చేసుకుంటారో తెలుసా? ఈ ఆలయం ఎక్కడుంది?

సముద్రం మధ్యలో శివాలయం... దేవుడి దర్శనం ఎలా చేసుకుంటారో తెలుసా? ఈ ఆలయం ఎక్కడుంది?

మన దేశంలో చాలా శివాలయాలు ఉన్నాయి. వాటిలో కొండల్లో, సముద్రం అంచున ఉన్నవి ఉన్నాయి కానీ, సముద్రం నడి మధ్యలో ఉన్న శివాలయం గురించి ఎప్పుడైనా విన్నారా?మరి, ఈ ఆలయాన్ని ఎలా దర్శించుకుంటారో తెలుసా?

3 Min read
Author : ramya Sridhar
Published : Oct 01 2026, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సముద్రం మధ్యలో శివాలయం.
Image Credit : Chat GPT

సముద్రం మధ్యలో శివాలయం.

సాధారణంగా ఆలయం అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కొండలు, పచ్చని ప్రకృతి, నదీ తీరాలు లేదా ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం. కానీ, సముద్రం మధ్యలోనే ఒక శివాలయం ఉందంటే నమ్ముతారా? నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. మన దేశంలోనే ఉంది. అంతేకాదు... ఆ ఆలయానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లలేరు. సముద్రపు నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే ఆలయాన్ని కంటితో చూడగలం.. అప్పుడే దేవుడిని దర్శించుకోగలం. ఈ వింత శివాలయం గుజరాత్ లోని కొలియాక్ సముద్ర తీర్థం వద్ద ఉంది. ఈ ఆలయాన్ని నిష్కలంక మహాదేవ్ ఆలయంగా పిలుస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సముద్రంలోకి మూడు కిలోమీటర్లు..
Image Credit : Chat GPT

సముద్రంలోకి మూడు కిలోమీటర్లు..

గుజరాత్‌లోని భావ్‌నగర్ నగరానికి తూర్పు వైపున కొలియాక్ తీర ప్రాంతం ఉంటుంది. అక్కడి సముద్రతీరం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ ఆలయం ఉంది. అయితే తీరానికి చేరుకున్న వెంటనే ఆలయం కనిపించదు. సముద్రపు నీరు ఆలయాన్ని చుట్టుముట్టి ఉన్న సమయంలో అక్కడ కేవలం ఆలయ ధ్వజస్తంభంపై ఎగురుతున్న జెండా మాత్రమే కనిపిస్తుంది. అదే నీటి మట్టం తగ్గినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. సముద్రం నెమ్మదిగా వెనక్కి తగ్గడంతో ఆలయానికి వెళ్లే దారి బయటపడుతుంది. దీంతో భక్తులు సముద్రపు అడుగు భాగం మీదుగా నడుచుకుంటూ ఆలయాన్ని చేరుకుంటారు.

సముద్రం దారి ఇస్తేనే దర్శనం..

ఈ ఆలయానికి వెళ్లే భక్తులకు సముద్రపు ఆటుపోట్లు అత్యంత కీలకం. ఉదయం సమయంలో సముద్రం నీటితో నిండిపోయి ఉండటంతో ఆలయం సాధారణంగా కనిపించదు. నీరు తగ్గడం మొదలైన తర్వాత కొంత సమయం గడిచే కొద్దీ ఆలయానికి వెళ్లే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది.

మధ్యాహ్నం సమయంలో నీరు గణనీయంగా వెనక్కి వెళ్లినప్పుడు భక్తుల రాక పెరుగుతుంది. పూజా సామగ్రి, పూలు, పండ్లు విక్రయించే వారు కూడా తమ వస్తువులతో అక్కడికి చేరుకుంటారు. సాయంత్రం వరకు భక్తులు ఆలయంలో పూజలు, దర్శనం చేసుకుంటారు. తిరిగి సముద్రపు నీరు ముందుకు కదలడం ప్రారంభించిన తర్వాత మాత్రం అందరూ తీరానికి చేరుకోవాల్సి ఉంటుంది. అంటే.. ఇక్కడ శివుడి దర్శనానికి భక్తితో పాటు సముద్రపు ఆటుపోట్ల సమయాన్ని కూడా తెలుసుకోవడం అవసరం.

33
నిష్కలంక మహాదేవ్ అనే పేరు ఎలా వచ్చింది?
Image Credit : Chat GPT

నిష్కలంక మహాదేవ్ అనే పేరు ఎలా వచ్చింది?

“నిష్కలంక” అనే పదానికి కళంకం లేనివాడు, పాపాల నుంచి విముక్తి పొందినవాడు అనే అర్థాలు ఉన్నాయి. ఈ పేరుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ చేతుల మీదుగా జరిగిన హత్యలకు పాపవిముక్తి కోరుకున్నారట. ఈ సమస్యకు పరిష్కారం కోసం వారు శ్రీకృష్ణుడిని ఆశ్రయించారట.

అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని సూచించాడని కథనం. ఒక నల్లని ఆవు, దానికి కట్టిన నల్లటి జెండాను అనుసరించాలని ఆయన పాండవులకు చెప్పాడట. ఆ ఆవు, జెండా తెల్లగా మారిన ప్రదేశంలోనే వారి పాపాలు తొలగిపోతాయని సూచించాడని పురాణ గాథ చెబుతుంది.

పాండవులు ఆవును అనుసరిస్తూ చివరకు కొలియాక్ తీరానికి చేరుకున్నప్పుడు ఆవు, జెండా రంగు మారిందని స్థానిక విశ్వాసం. అక్కడే వారు పరమశివుడిని ధ్యానిస్తూ తపస్సు చేశారని చెబుతారు.

ఐదు శివలింగాల వెనుక కథ..

పాండవుల తపస్సుకు మెచ్చిన పరమశివుడు వారికి దర్శనమిచ్చాడని పురాణ కథనం. ఐదుగురు పాండవుల కోసం ఐదు స్వయంభు శివలింగాల రూపంలో శివుడు వెలిశాడని ఇక్కడి విశ్వాసం. పాండవులు ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించిన ప్రదేశమే కాలక్రమంలో నిష్కలంక మహాదేవ్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఈ కథకు చారిత్రక ఆధారాల కంటే పురాణ, స్థానిక విశ్వాసాలే ఆధారం.

పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ప్రత్యేక సందడి..

సాధారణ రోజులతో పోలిస్తే పౌర్ణమి, అమావాస్య సమయాల్లో ఈ ప్రాంతానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో సముద్రపు ఆటుపోట్లు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఆలయానికి వెళ్లే ముందు నీటి పరిస్థితులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. శివభక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

నీటిలో ఆస్తికలు కలిపితే ముక్తి లభిస్తుందని నమ్మకం..

ఈ ప్రాంతానికి మరో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా ఉందని భక్తులు విశ్వసిస్తారు. కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు వారి ఆస్తికలను ఇక్కడి సముద్ర జలాల్లో కలిపితే ఆత్మకు శాంతి చేకూరుతుందని కొందరి నమ్మకం.

సముద్రాన్ని తట్టుకుని నిలిచిన ధ్వజం..

ఆలయానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం అక్కడి ధ్వజస్తంభం. ఆలయం సముద్రపు నీటితో చుట్టుముట్టబడే సమయంలో కూడా గోపురంపై ఉన్న జెండా ఈ ప్రాంతానికి గుర్తుగా కనిపిస్తుంది. ఈ జెండాను సంవత్సరానికి ఒకసారి మార్చే సంప్రదాయం ఉందని స్థానికంగా చెబుతారు. సముద్రపు ఆటుపోట్లు, అలల మధ్యలో ఉన్న ఈ ఆలయాన్ని చూడటం భక్తులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Diamond Replica: రూ.వెయ్యిలోపే అచ్చం డైమండ్ లా మెరిసే నక్లెస్ డిజైన్లు
Recommended image2
Walnuts: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించే వాల్ నట్స్, ఎలా తినాలి?
Recommended image3
Instant Dosa: పప్పు నానపెట్టకుండా, పిండి రుబ్బకుండా.. 20 నిమిషాల్లో దోశ చేసేయండి..!
Related Stories
Recommended image1
Instant Dosa: పప్పు నానపెట్టకుండా, పిండి రుబ్బకుండా.. 20 నిమిషాల్లో దోశ చేసేయండి..!
Recommended image2
తల నరికేసినా కూడా వారాల తరబడి బతికేయగల వింత జంతువు ఇది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved